Previous Page Next Page 
అమ్మో! అమ్మాయిలు పేజి 47

    కొన్నాళ్ళు జాబ్ చేయాలనే కుతూహలంతో ఈవూరు వచ్చిందట. వాళ్ళది పల్లెటూరుట. పొలాలు యిళ్ళువున్నాయి. ఒక అన్న వున్నాడు యిదీ కధ. అమ్మానాన్న పెళ్ళికి అభ్యంతరం పెట్టారని చెప్పింది.

    ఈ ఆడాళ్ళు మాచెడ్డ వాళ్ళురా. మణిద్దరం వీళ్ళ నే పరిక్ష చేయలేదు. వీళ్ళు మాత్రం మనల్ని శల్య పరీక్ష చేసి భర్తలుగా ఎన్నుకున్నారు.

    ఒరెరోయ్ ఇంకోటి మర్చిపోయాను నా ఉత్తరం నేను బిందురేఖ చేతిలోనే పెట్టను.

    అది చదివి తమాషా చేయటానికి జయచిత్ర చేతిలో తాను పెట్టిందట."

    " ఏం అని చేశావ్?" అంది జయచిత్ర.

    " ఏదో ఒకటి చేయకపోతే ఎలా?" అంది బిందురేఖ.

    " ఎలాగో అలా పెళ్ళేట్టా అవుతుంది! కధెలా కంచి కెళుతుంది?" అన్నాడు అబ్బులు.

    " అలా అన్నావ్ బాగుంది" ఆనందు వ్యాకర్ణ.

    నలుగురూ నవ్వేసుకున్నారు.

    ఆ తర్వాత ఆశీర్వదించమని బామ్మగారి కాళ్ళమిద అబ్బులు బిందురేఖ పడ్డారు.

    బామ్మగారు " హారి పిడుగుల్లారా! పడి కాలాలపాటు చల్లగా వుండండి" అని దీవించారు.

    తెల్లారి అందరికీ ఉత్తరాలు రాసేస్తానంది. ఆలస్యం చేస్తే లాభం లేదంది. సరే అన్నారు వీళ్ళు.

    చెమటి ధర్మరాజు ఏదో పనుండి బామ్మగారి దగ్గరకు వచ్చాడు.

    బోలెడు సంతోషంలో వున్న బామ్మగారు పిల్లల పెళ్ళిళ్ళ విషయం చెప్పింది.

    ఆయన కినపడదని చెప్పి చెయ్యిపెట్టి చూపించి జంటలని, తాళిబొట్టు త్వరలో కడతారని పెళ్ళని చేతులు తిప్పుతూ చెప్పింది.

    " నలుగురూ పెళ్ళి కెళుతున్నారా? ఏ వూరు? ఓహో ఆలూరా! బాగుంటుందోయ్, వెళ్ళిరండి ఎవరిదీ పెళ్ళి! ఆహో మి వాళ్ళదేనా? సరిసరి చెప్పావు కాదూ!" అని ప్రశ్నలు సమాధానాలు అన్నీ ఆయనే చెప్పుకుని వెళ్ళిపోయాడు.

    బామ్మగారు అన్ని భాగాలలో వాళ్ళకీ పెళ్ళి విషయం చెప్పటానికి ఆదరా బాదరాగా ముళ్ళకిరీటం సరిచేసుకుని ముందుకి లాక్కుంటూ వెళ్ళింది.

    వ్యాకర్ణ జయచిత్ర దగ్గరకు అబ్బులు బిందురేఖ దగ్గరకు జరగాబోయారు.

    " దూరం దూరం" అంది జయచిత్ర.

    " ఏం?" అన్నాడు వ్యాకర్ణ కళ్ళెగరేసి.

    " మి వేడిగాలి తగిలితే..." అంది బిందురేఖ.

    " అవునురోయ్ కర్ణా! అప్పుడు మనం సినిమా కధలు చెప్పుకున్నాం గుర్తుందా? అదీ వీళ్ళ భయం" అన్నాడు అబ్బులు.

    " ఓహో అదా? పెళ్ళియిందాకా ఇంతేనా అబ్బా!"

    " అవునుబ్బా," అన్నాడు అబ్బులు.

    " అప్పటిదాకా ఎలాగో అలా గడపలేరా?" అంది జయచిత్ర.

    " ఎలాగో అలా గడిపేయండి" అంది బిందురేఖ.

    " అమ్మోజయచిత్రా! మా పాఠం మాకే అప్పగిస్తున్నావే?" అన్నాడు వ్యాకర్ణ.

    " అబ్బో, వ్యాకర్ణం తక్కువ తిన్న దేమిటి? మహా తలనొప్పి" అంది బిందురేఖ.

    అమ్మోజయచిత్రా! అబ్బో వ్యాకర్ణం, అందరం వున్నాము. నా బిందురేఖ ఏదిరా మన మధ్య" అబ్బులు వ్యాకుల పడుతూ అన్నాడు.

    " అరె భాయ్, మాన్ వెనుక ముందు మధ్య బిందువులు ( చుక్కలు) రేఖలు ( గీతలు) వుంటాయిరా," అన్నాడు వ్యాకర్ణ.

    బామ్మగారు పెళ్ళి కబురు చెప్పి తిరిగొచ్చేటప్పటికి నలుగురూ విరగపడి నవ్వుతున్నారు.

 Previous Page Next Page