Previous Page Next Page 
అమ్మో! అమ్మాయిలు పేజి 45

    కాని రాత్రి మిరు మామూలు మనిషినిపించుకున్నారు. సెక్స్ సినిమాకిని రమ్మని ఉత్తరం రాసి, అది నా చేతిలోపెట్టి పారిపోతారా?

    అలా అడగటానికి ఆ పని చెయ్యటానికి, ఎలా సిగ్గు లేకపోయింది?" ఆ వేశంగా గబ గబ అంది జయచిత్ర.

    " సెక్స్ సినిమా ఏంటి? ఉత్తరం ఏమిటి? రాత్రి పారిపోవడం ఏమిటి?" తెల్లబోయి అడిగాడు వ్యాకర్ణ.

    " ఈ ఉత్తరం చూడండి, మికే తెలుస్తుంది." అని వ్యాకర్ణ మిదకు విసిరేసింది ఆ ఉత్తరాన్ని.

    వ్యాకర్ణ నవ్వు వీని గాంధీహిల్ మిద వున్న కొన్ని పక్షులు ఎగిరిపొయ్యాయి. ఓ చీమల బారు ఉరుములతో వానొస్తుందని గబ గబ పుట్టలోకి దూరాయి. రెండు మూడు రాళ్ళు దొర్లిపడ్డాయి. దుమ్ము ఎగిరిపడింది. వాయుదేముడు భయపడి తూర్పువైపు నుంచి పడమటకి తిరిగాడు.

    " ఇదేం నవ్వు! ఇదేం నాటకం!" అన్నట్లు కోపంగా చూసింది జయచిత్ర.

    జయచిత్ర కోపానికి ఊళ్ళో చాలాచోట్ల కరెంటు పోయింది.

    " అమ్మ... అబ్బ... ఎంతపార్దం చేసుకున్నావు జయచిత్రా! ఇది అబ్బులుగాడు రాసిన ప్రేమలేఖ" అన్నాడు వ్యాకర్ణ నవ్వాపేసి

    " ఏంటీ?" అని ఆశ్చర్యపోయి.

    ముఖం నిమ్మకాయంత చేరుకొని మళ్ళీ కోపం తెచ్చుకుని " అబ్బులు నా కెందుకు ప్రేమలేఖ వ్రాయాలి? అబ్బులికి బుద్దిలేదు. మికూ లేదు.

    అబ్బులు నాకు ప్రేమలేఖ రాస్తే కోపంగించుకో వాల్సింది పోయి, అదేదో ఘనకార్యం అన్నట్లు నవ్వుతారా?" అని యింతెత్తు ఎగిరి పడింది జయచిత్ర.

    వ్యాకర్ణ మరోసారి యిందాక నవ్వినట్లే నవ్వాడు.

    నవ్వి... " అబ్బూ ప్రేమలేఖ రాసింది నీకు కాదు. బిందురేఖకి. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. నాకు తెలుసు" అన్నాడు.

    అనుమానం తీరని జయచిత్ర " ఈ ఉత్తరం నా చేతిలో ఎవరు పెట్టారు?" అంది.

    " ఏంటీ నాటకం?" గయ్యిమంది జయచిత్ర.

    " ఆబునాధం రాత్రి భూతద్దాలు లేకుండా ఉత్తరం పట్టుకుని మి వరండాలోకి వచ్చి వుంటాడు. కంగారులో బిందురేఖ చేతిలో పెట్టాల్సింది నీ చేతిలో పెట్టాడు.

    వాడి ధర్మమా అని నా జయ హృదయం బయట పడింది. క్షమిస్తానంటే ఇంకో కధ" అన్నాడు వ్యాకర్ణ.

    " ఊ, చెప్పండి" బుంగమూతి పెట్టి కోపంగా అంది జయచిత్ర.

    " నన్ను పెళ్ళి చేసుకోమని అమ్మా నాన్నా బలవంతం. నే చేసుకోనని భీష్మించుకున్నాను. వారు విసిగివేసారి పొయ్యారు.

    ఓ రోజు అంటే మి యింట్లో చేరిన రెండు వారాలకి మా నాన్నగారి వద్దనుంచి లెటర్ వచ్చింది. పెళ్ళి విషయంలో నిన్నేం బలవంతం పెట్టము. నీ కొత్త అడ్రస్ చూశాను.

    ఆ యింటివారికి ఓ అమ్మాయి వుంది. పేరు జయచిత్ర. ఓ స్నేహితుడు వాళ్ళ సంబంధం చెప్పాడు. పిల్ల వచ్చేతే రాయి. లేకపోతే లేదు. నీ ఇష్టానుసారం నీ ఇష్ట మొచ్చినప్పుడే పెళ్ళి జరుగుతుంది" ఇదీ లెటర్ లో సారంశం.

    నాన్నగారికి తొందరపడవద్దని లెటర్ రాసి ఈ దేవిని ఎలాగూ ప్రేమించా గాబట్టి దేవి ఆజ్ఞకోసం ప్రేమభిక్షఎప్పుడు పెడుతుందా అని ఓర్పుగా వేచి వున్నాను.

    ఈ మధ్య నీ పరీక్ష తాలూకు కోపం, రుస రుసలు చూసి నన్ను ప్రేమించటం లేదేమో అని భయపడ్డాను. భయంతో అడుగు ముందుకే వేయగలను? అబ్బూ దయవల్ల లైన్ క్లియరయింది.
    

 Previous Page Next Page