Previous Page Next Page 
అమ్మో! అమ్మాయిలు పేజి 44

    " ఏయ్! పోకిరీ మాటలు మాట్లాడకు."

    " మాటలాడను."

    " ఇంత ప్రేమ నామిద వుండి ఎప్పుడూ బయటపెట్ట లేదేం?"

    " ఎలా పెట్టను! నీ మనసులో ఏముందో తెలియదు. నా మిద ప్రేమున్నట్లు తెలిస్తేకదా? నేనేదయినా తెగించి చేయటానికి- ఓసారి నీ మాటలు చూపులు నా మిద ప్రేమతో కూడివుండాలి. అంతలో రుసరుసలు తిక్షణ వీక్షణాలు. నీవు నన్ను ప్రేమించలేదనుకో, నేను తొందరపడి ప్రేమించానని చేపుతాననుకో, అప్పుడేమవుతుంది?

    " అదీ మిరే చెప్పండి."

    " పాత చెప్పు తీసుకుంటావు. సమయానికి అదీలేకపోతే బజారు పరుగెత్తి కొత్త చెప్పులు కొనుక్కొచ్చి ఎడా పెడా వాయిస్తావు."

    " ఆమాత్రం యింగితం వుందికదా?"

    " ఉంది. ఇహ నీవు నన్నెప్పటినుంచి ప్రేమించిందీ చెప్పు జయా!"

    " చెపుతాను. చెప్పి పాయింట్ కొస్తాను. మి లాంటి రూపంగల యువకుడు భర్తగా వుంటే బాగుండునని చాలా సార్లు అనుకున్నాను. ఉన్నంతలో పోకిరీ వేషాలు లేకుండా మంచిగానే వున్నారు. అది ఆకర్షించింది.

    ఇదిలా వుండగా మా నాన్నమ్మ వూరికెళ్ళింది. ఎందుకంటే మా నాన్నగారొక పెళ్ళి సంబంధం చూశారుట. అది మాట్లాడటనికి, పెళ్ళి చూపులు. పెళ్ళి కొడుకు ముందు తలొంచు క్కూర్చోటం చేయను. పెళ్ళి కొడుకు కట్నం అడగరాదు.

    అయినా ఇప్పుడప్పుడే పెళ్ళి చేసుకోవాలని లేదు. అని నాన్నమ్మ చేత మా నాన్నగారికి కబురంపాను. నాన్నమ్మ నాన్నగారు చెప్పిన ఓ కబురు నా కందజేసింది.

    " పెళ్ళికి నిన్నేమి బలవంతం చేయము. నా స్నేహితుడి, స్నేహితుడి కొడుకు విజయవాడలో వున్నాడు. వాళ్ళ ఫామిలీ మంచిది. కుర్రాడు బుద్ధిమంతుడు.

    పిల్లాడికి పెళ్ళి చేయాలని వాళ్ళ నాన్నగారు ఎన్ని విధాల చేసుకుంటాను. పెళ్ళికేం తొందర అని భీష్మించుకుని కూర్చున్నాడుట.

    ఆ పిల్లవాడి అడ్రసు, ఫోటో యిస్తాను చూడు. నా కెందుకో ఆ పిల్ల వాడు నచ్చాడు. వాళ్ళ ఫామిలి మంచిది.

    ఇదీ నాన్నగారి కబురు. నాన్నమ్మచేత అతగాడి ఫోటో కూడా పంపారు."

    " ఆ పిల్లగాడు న కన్నా బాగుంటాడా?" ఆతృతగా అడిగాడు వ్యాకర్ణ.

    " ఓ. చాలా బాగుంటాడు" కళ్ళు తిప్పుతూ చెప్పింది జయచిత్ర.

    నీరుకరిపోయాడు వ్యాకర్ణ " కొంపదీసి వాణ్ణి ప్రేమించారేమిటి?" అన్నాడు.

    " ఉండండి. ఇంకా పాయింట్ కి రాలేదు.

    సరే, ఆ కుర్రాడెవడో తెల్సుకున్నాను. పరీక్ష చేయటానికి ఎన్నో రకాలుగా ఆడించాను. ఎన్నోసార్లు షేమ్ చేశాను. కోపం ప్రదర్శించాను.

    అనవసరంగా కల్పించుకుని పోట్లాడి నానా మాటలన్నాను. అన్నింటికీ చిరునవ్వే. ఆ ఓర్పు ఆ శాంతం చూసి నేనెంతో యిదయ్యాను."

    " ఛీ వాడు మనిషికాదు" గొణుక్కున్నాడు వ్యాకర్ణ.

    " అతగాడు మామూలు మనిషి. నా ప్రేమ పరీక్షలో నెగ్గలేదు. రాత్రి బండారం బైటపడింది." అని వూరుకుంది జయచిత్ర.

    " వాడెం చేశాడు? వాడి బండారం బైటపడటం వల్ల ఈ వుదయం నుంచీ నన్ను ప్రేమించటం మొదలు పెట్టారా?" బొంగురు  స్వరంతో అడిగాడు వ్యాకర్ణ.

    " ప్రేమలేదు, దోమలేదు. రాత్రి ఆ సంఘటన జరిగిందగ్గరనుంచీ నా హృదయం మండిపోతున్నది.

    మా నాన్నగారు, మా నాన్నమ్మ చేతికిచ్చి పంపిన ఫోటో మిది. అడ్రస్ మి పాతింటిది. మా నాన్నమ్మని మాట్లాడవద్దని చెప్పి మిమ్మల్ని ఎన్ని విధాలుగానో పరీక్ష చేశాను. పరీక్షలో నెగ్గారు. గెలిచారు.

    

 Previous Page Next Page