Previous Page Next Page 
అమ్మో! అమ్మాయిలు పేజి 42

    లేపిందేవరో కనపడలేదు. ఓ పక్క బామ్మగారి గురక చిన్నగా వినిపిస్తుంది. బిందురేఖ అటుపక్క వత్తిగిలి పడుకుని వుంది.

    " నన్నెవరూ లేపలేదే! లేపినట్లు ఎందుకనిపించింది?" అని అలోచిస్తూ బుర్ర గోక్కోబోయింది జయచిత్ర. అప్పుడనివించింది తన చేతిలో మడత పెట్టబడ్డ కాగితం వుందని.

    జయచిత్ర ఎక్కువ ఆలోచించకుండానే  గ్రహించింది. ఎవరో లేపి తన చేతిలో కాగితం పెట్టి వెళ్ళారని అవసరం వస్తుందిని పక్కలో దిండుకింద టార్చీలైటు వుంచుకుంటుంది జయచిత్ర.

    ఎప్పుడూ అర్ధరాత్రి టార్చిలైటు వెలిగించుకునే అవసరం రాలేదు. ఇప్పుడొచ్చింది.

    జయచిత్ర టార్చిలైటు వెలిగించి ఆ వెలుతురులో అబ్బులి లెటరు చదివింది. చదివి కోపం తెచ్చుకుంది. తెచ్చుకుని ఓ గంట ఆలోచించింది.

    " అవురా ఎంత తొందర! అవురవుర ఎంత తెగించాడు! ఇలా కాదు మంచిగా పనులుగావు. రేపు- రేపు చెప్పాలి చెప్పాలేంటి! చూడాలి. చూసే దేమిడి తాడోపేడో తేల్చాలి" అనుకుంది.

    రేపేం చేయాల్సింది, ఎలాచేస్తే బాగుంటుంది! మేరోసారి దీర్ఘంగా ఆలోచించి తెల్లవారు ఝామున నిద్రపోయింది.

    మర్నాడు ...

    అబ్బులు లేని సమయం చూసి వ్యాకర్ణ వద్దకు వాళ్ళగదిలోకి వచ్చింది.

    జయచిత్రను చూస్తూనే చాపమిద నుంచి లేచాడు వ్యాకర్ణ. కొంటెగా నవ్వుతున్న జయచిత్రను చూసి మురిసి పొయ్యాడు మిరొస్తారని ఎందుకో అనుకున్నాను. దేవతలా ఠకీమని ప్రత్యక్షమయ్యారు" అన్నాడు వ్యాకర్ణ.

    " అనుకుంటారు, అనుకుంటారు. అనేముంది. మి పని... మి పని... ఇప్పుడు కాదు ఆనక" అనుకుని, పైకి ఓ చిరునవ్వు నవ్వి.

`    "సాయంత్రం గాంధీహిల్ కి మిరొక్కరే రండి సరీగా అయిదు గంటలకి అక్కడ ఎదురుచూస్తూ వుంటాను. మనం చాలా మాట్లాడుకోవాలి. వంటరిగా రావాలి రెండో కంటికి తెలియరాదు" అని వేగంగా గదిలోంచి బైటి కెళ్ళిపోయింది జయచిత్ర.

    అరగంటకి తేరుకున్నాడు వ్యాకర్ణ.

    ఆ తర్వతా ఆలోచించాడు." మగాళ్ళం మేం తెగించటానికి భయపడి చస్తున్నాము. జయచిత్ర చూడు, క్విక్ గ తెగించేసింది. ప్రేమంటే అలా వుండాలి. నేనూ వున్నాను దేనికి?      

    ఈ మధ్యనా మిద తరుచు జయచిత్ర చిరుబురులాడుతున్నది. ఎందుకో తెలియలేదు. ఇప్పుడు తెలిసింది. తను నన్నెంతో గాఢంగా ప్రేమించింది. నేనేమో భయపడి తెగించి ఒక్కడుగు ముందుకు వేయకపోతిని కోపం రాదామరి!

    ఇలా కాదని తానే ముండడుగు వేసింది. ఎవరో ఒకరు. మా ఇద్దరిలో ఎవరైతేనేమి? సాయంత్రం గాంధీహిల్ కెళ్ళాలి. అందంగా తయారయి మాంచి డ్రస్ వేసుకుని నా జయముండు ప్రత్యక్ష మవుతాను. వంటరిగా వుంటాము. మా మనసులు వుప్పుకుని చెప్పుకుంటాము.

    అప్పుడు జయచిత్రని ఏమండీ! అనక్కరలేదు. పేరు పెట్టి యించక్క పిల్వవచ్చు. '  జయా!' అంటే? పోనీ ' చిత్రా!' అంటే, ఏదీకాదు. " జయచిత్రా!" అనేస్తే, సర్లే దీనికోసం యింతగా తల బద్దలు కొట్టుకోటం దేనికి. అప్పుడు ఎలా తోస్తే అలా పిలుస్తాను.

    నన్ను ఏమండీ! అనొద్దని చెపుతాను. కర్ణా! అని పిలవమంటాను ఆ దొండ పండులాంటి పెదవులు బహు అందంగా సున్నితంగా వీణ మిటినట్లు " కర్ణా!" అంటాయి కాబోలు. నేనెంత అదృష్టవంతుడిని. కాగల కార్యం గంధర్వులే తిర్చారన్నట్లు...

    ఇలా ఆలోచిస్తూ వుండిపోయాడు వ్యాకర్ణ. గాంధీహిల్ కెళ్ళోచ్చిం తరువాత అబ్బులితో చెప్పోచ్చులే అని కూడా అనుకున్నాడు.  

 Previous Page Next Page