అందుల్లో నలుగురు ఆడ, ఇద్దరు మగ, సంసారం మధ్య రకంది. అలాంటిదే సంపాదన. బిందురేఖ వాళ్ళ అమ్మా నాన్నకి మూడో అమ్మాయి. ఇద్దరు పై వాళ్ళకి పెళ్ళయింది. పెళ్ళికి అప్పయింది. ఇద్దరమ్మాయిలకి ఇద్దరమ్మాయిలు పుట్టారు.
అప్పు తాలూకు వడ్డీ పెరిగి ఇదీ పిల్లలని పెట్టింది. ఎలాగూ ఓ అప్పు వుందిగా మరో అప్పుచేసి అబ్బాయి కోరినకట్నం యిచ్చి నీపెళ్ళి చేస్తాను అన్నాడు బిందురేఖతండ్రి.
కానీ కట్నం తీసుకొని అబ్బాయినే పెళ్ళాడుతాను. అందాకా కన్యగానే వుంది నా కాళ్ళ మిదనే బ్రతుకుతానని ఉద్యోగం వేటలో పడి దిట బిందురేఖ. " మి ధర్మమా అని జాబ్ దొరికింది. మి మేలు మరచిపోలేను" అంటూ తన కధ చెప్పింది బిందురేఖ అబ్బులికి.
అబ్బులు బిందురేఖ మొదట ముఖమాటం పడితర్వాత సిగ్గిపడి ఆ తర్వాత ధైర్యం తెచ్చుకుని ప్రేఅలో పడిపోయారు. ఎలాగో అలా అంతవరకూ వచ్చారు.
వచ్చారు కాబట్టి ఒకరినొకరు చూసి నవ్వుకోవటం, మాట్లాడుకొటం... చాటుగా ఓ రకంగా, మలుగురెదుట ఓ రంకంగా... వుండటం, మొత్తానికి కొంత దూరం పోయారు.
ఓ రోజు...
అబ్బులు బిందురేఖతో అన్ని విషయాలు మాట్లాడటం కుదరక, ఎందుకంటే బిందురేఖ చుట్టాలయిన వేలు విడిచిన భజన భక్తబృందం అనుమానప్పినుగలు.
కాబట్టి బిందురేఖ ఓ బుల్లి కాగితం మిద ప్రేమ ( పైత్యం) కవిత్వంతో నాలుగులైన్లు గీకాడు. ఏమని...?
నా అందాల రాకుమారీ!
రేపు సాయంత్రం ఊర్వశీ ధియేటర్ వచ్చేసి నీకోసం ఎదురు చూస్తూ వుండు. ఊర్వశీలో మాంఛి పిక్ చర్ ఆడుతుంన్నది. నీవూ నేనూ కలిపి ఆ పిక్ చర్ చూడాలి.
ప్రేమకి కొత్త అర్ధాలు తీయాలి. ఊ... అను... ఊ అన్నావా, వెరీగుడ్ మా మంచి అమ్మాయిని నీ కోసం ఎదురుచూసే,
నీ రాకుమారుడు.
ఆ రాత్రి అబ్బులు ఆ లెటర్ తీసుకుని జయచిత్రా వాళ్ళ వరండాలోకి వెళ్ళాడు. అప్పుడు టైము వంటిగంటయింది.
బామ్మగారూ జయచిత్రా వాళ్ళ వద్దనే రాత్రిళ్ళు బిందురేఖ పడుకుంటున్నది. అబ్బులికి ఆ పగలంతా బిందురేఖని లెటరందించటం పడలేదు.
అందుకని అర్ధరాత్రి ఎన్నుకున్నాడు. మెల్లమెల్లగా చల్లచల్లగా వరండా మెట్లెక్కి మంచం వద్దకెళ్ళి మెల్లగా తట్టి లేపాడు స్టిట్ లైట్ వెలుతురు వరండాలోకి పడుతుంది. కాబట్టి రాత్రిళ్ళు బామ్మగారు వరండాలో లైటుంచదు. ఇంట్లో మాత్రం చిన్న లైటు వుంటుంది. ఆ రోజు స్టిట్ లైట్ వెలగటం లేదు.
ఓ పక్క వరండాలో చీకటి. మరోపక్క అబ్బులి మనసులో గాభరా బిందురేఖ మంచం వద్దలు పిల్లలా నడిచి బిందురేఖను తట్టి లేపాడు.
సరీగా అప్పడే బామ్మగారు కదిలింది. అలా కదలటం ఏమిటి ఇలా ఒకటి కెళటానికి లేవబోవటం ఏమిటి ఒకేసారి చేసింది.
బామ్మగారు లేవబోతున్నదని గ్రహించిన అబ్బులు బోలెడు కంగారుపడి బిందురేఖ చేతిలో తాను రాసిన లెటర్ వుంచి గుప్పెటి మూసి వరండాలో కిందకి ఒక్క జంప్ చేసి నాలుగంగల్లో తన గదిలోకి వచ్చిపడ్డాడు.
జయచిత్ర ఎవరోతట్టి లేపినట్లుయి ఉలిక్కిపడి నిద్ర లేచింది.