Previous Page Next Page 
అమ్మో! అమ్మాయిలు పేజి 40

    " తీశారు. కాని పీలిస్తే గాలి పీలిస్తే గర్భిణీ రావటం రాయలేదు. కావాలంటే పందెం కాస్తాను" అంది బిందురేఖ బోలెడు ఆయాసపడిపోతూ.

    " గాలి పీలిస్తే గర్భిణీ అయిందని మాట వరసకే చెప్పను. చలికి పిల్లలు పుడతారా? అన్నట్లు గాలికి గర్భిణీ వస్తుందా? ఏదో కధ కోసం " అన్నాడు అబ్బులు.

    " వస్తుంది" గట్టిగా నొక్కి పలికాడు వ్యాకర్ణ.

    " నీకెలా తెలుసురోయ్! ఎవరికొపం ముంచావు రోయ్! ఎవతి కొచ్చిందిరోయ్?" అంటూ గుండెలు బాదుకున్నాడు అబ్బులు.

    " నువ్వు ముందా సోకాలు ఆ పెయ్యి! సినిమా అనుకో నవలనుకో ఇలా రేప్ సీను చూపిస్తారు. అలా కడుపొస్తుంది.

    ప్రేమికులు అలా కల్సుకుంటారు. ఇలా కడుపొస్తుంది. అలా విడిపోతారు. కన్ను మూసి తెరిచేటప్పటికి జరిగిపోతుంది.

    కాదా? దీనికి అనుభవం వుండాలా? ఇలాంటి వెన్నో చదివాము. ఇలాంటి వెన్నో చూశాము సినిమాలలో." అన్నాడు వ్యాకర్ణ.

    " సరేలేండి యిప్పుడేమంటారు?" అంది జయచిత్ర చాలా సీరియస్ గా.

    " అబ్బే, ఏం  అనమండి" అన్నాడు వ్యాకర్ణ.

    " ఎలా అంతామండి. మి యింట్లో అద్దెకున్నా మాయె!" అన్నాడు అబ్బులు.

    " అద్దెకు లేకపోతే అనేవారన్నమాట....! మగబుద్ధి పొనిచ్చుకున్నారు కాదు" అంది బిందురేఖ.

    కొంటెగా చూసి తల తెప్పేసుకున్నాడు వ్యాకర్ణ.

    " ఉత్తపోకిరీ పిల్లగాళ్ళు!" అనుకున్నారు బిందురేఖ, జయచిత్ర.

    " ఈపూటకు సర్దాగా కధలతో కబుర్లుతో కాలక్షేపం అయింది. చాలా పొద్దుకూడా పోయింది యింక లేద్దాం." అన్నాడు అబ్బులు.

    " ఎలాగో అలా కాలక్షేపం అయింది. మా నాన్నమ్మ ఊరికెళతానంటే ముందే బోలెడు బెంగపెట్టుకున్నాను.

    మి వల్ల మాటలు కాలక్షేపం. బిందురేఖ రాకవల్లతోడు. అట్టట్టా రెండు రోజులయి పోయింది.

    ఇంకో రెండు రోజులు, నాన్నమ్మ వచ్చేస్తుంది" అంది జయచిత్ర.

    " ఎలాగో అలా రోజులు గడవాలి కదా, ఈ రెండు రోజులూ అలాగే గడిపేస్తే సరి " ఆనందు వ్యాకర్ణ.

    " అట్టా గేలెండి" అన్నది బిందురేఖ.

    అట్టా యిట్టా భాషకి నలుగురికి నవ్వొచ్చింది. నలుగురు నవ్వుకున్నారు.

    తర్వాత నిద్ర పోవటానికి ఒకరినుంచి ఒకరు శలవు తీసుకుని లేచారు.

    అప్పటికే, ఆరోజు చాలాకధలు, కబుర్లు దొర్లి నందున రాత్రి పన్నెండయింది. లేక చిన్న ముళ్ళు పెద్దముల్లు తచ్చయ్యాయి.

    ఆ మర్నాడు అబ్బులు, వ్యాకర్ణ సినిమాకెళ్ళారు.

    అనుకోకుండా అదే సినిమాకి జయచిత్ర బిందురేఖ కూడా వెళ్ళారు.

    హాలువద్ద ఒకరి నొకరు చూసుకుని, కలుసుకుని మాట్లాడుకుని, ఒకే వరసలో, ఒకే క్లాసుకి, ఓ నాలుగు టిక్కట్లుచ్చుకుని, సర్దాగా సినిమా చూశారు.

    ఆ మార్నాడు బామ్మాగారు ఊరునుంచి దిగింది.

    బామ్మగారు వచ్చిన తరువాత నలుగురూ కూర్చుని పెద్దగా మాట్లాడుకొక పోయినా మధ్య మధ్య నలుగురూ మాట్లాడుకుంటూనే వున్నారు.

    బామ్మాగారు మంచీ చెడ్డా కనుక్కుంటూనే వున్నారు.

    రోజులు బాగానే గడిచిపోతున్నాయి.

    బిందురేఖ ఇంటర్వూ తాలూకా జాబ్ రాలేదుగాని ఓ కంపెనీలో టైపిస్ట్ గా టెంపరరీ జాబ్ దొరికింది.

    కంపెనీలో అబ్బులికి తెలిసిన ఓ పెద్దాయన ద్వారా ఆ జాబ్ బిందురేఖ కొచ్చింది.

    బిందురేఖ తల్లిదండ్రులు కుటుంబ నియంత్రణ పాటించనందున అరడజను మంది కన్నారు.

 Previous Page Next Page