Previous Page Next Page 
అమ్మో! అమ్మాయిలు పేజి 39

    ఇంటి కొచ్చిం తరువాత పడి రూపాయలు నోటు ఇస్తుంది.

    పైసా ఎక్కువ తీసుకోనని ఓ ముప్పావలా పుచ్చుకుని తొమ్మిది రూపాయిల పావులా ఆ పిల్లదానికిచ్చి వెళ్ళిపోతాడు.

    అర్జంటుగా ఆ రాత్రే అబ్బాయి కలలోకి అమ్మాయి, అమ్మాయి కలలోకి అబ్బాయి వెళ్ళిపోతారు."


    " ఇలాంటి కధ ఏ రచయిత్రి రాయలేదు?" తను చదివిన నవలలు గుర్తు తెచ్చుకుంటూ అంది బిందురేఖ.


    " ఏ రచయిత్రన్నా రాసిందేమో! మనం చదివుండము. బాగుంది. ముందు కధ విడం పట్టు" అంది జయచిత్ర.

    కానియ్యరా అబ్బూ!" అన్నాడు వ్యాకర్ణ.

    " ఓ రోజు పదిమది కాలేజీ స్టూడెంట్లు ఈ అమ్మాయిని రేప్ చేయబోతారు. సమయానికి ఎవరూ వుండరు.

    కాశీమజిలీ కధలో రాకుమారిలా విలపిస్తూ ' రక్షించండి. రక్షించండి" అని గావుకేక లెడుతుంది.

    ఆ దోవన వెడుతున్న రిక్షా అబ్బి అంటే మన హీరో పరుగున వెళ్ళి పదిమందినీ చితకదన్ని ఆపిల్లని రక్షింస్తాడు.

    వాళ్ళిద్దరి మధ్య ఆ నిమిషాన ప్రేమ అంకురిస్తుంది. ప్రేమ అంకురించింది కాబట్టి బిగియార కౌగులించుకుంటారు."

    " ఉండుండు నాకో సందేహం. వాడు రిక్షా తొక్కుకునే వాడు. ఆమె కారున్న కాంత.

    వాళ్ళిద్దరూ అలా టచ్చయితే రిక్షా అబ్బి బీదవాడు. చిరిగిన మురికి దుస్తులు ధరించి వాడూ కాబట్టి. ఆమె అతగాడి స్మెల్ ఎలా భరించింది.

    అసలే స్టంట్ చేస్తున్నాడు. నీచకంపు ఎంత కొడుతున్నాడో, ఏంటీపాడు, ఛీ!" అన్నాడు వ్యాకర్ణ.

    " ఎలాగో అలా భరించింది లెద్దూ!" అన్నాడు అబ్బులు భూతద్దాల్లోంచి బిందురేఖనుకొంటెగా చూస్తూ.

    " అదెలా కుదురుతుంది?" అన్నాడు వ్యాకర్ణ ఓ చూపు జయచిత్రపై పారేసి.

    జయచిత్ర మూతి మూడొంకర్లు తిప్పింది.

    " కురురలపోతే ఎలాగో అలా సర్దుకుందూ! నా కడ్డురాకు. సరే అప్పుడేమాయిందీ అంటే అప్పుడు ఆమెకు కడుపొచ్చింది.." అని ఆగాడు అబ్బులు.

    " అదెలా? ఏం జరిగిందని కడుపొస్తుంది" అన్నాడు వ్యాకర్ణ.

    " ఏం జరగాలి! ఇంకేం జరగాలంటా? జరిగింది చాలదూ? ఆ పిల్ల ఈ పిల్లగాడు తొలి ప్రేమతో గాఢాంగా కౌగిలించుకున్నారు.

    అతగాడి వేడిశ్వాస- అంటే గాలి తగిలి ఈవిడగారు వాంతి చేసుకుంది" ఆనందు అబ్బులు. " అవునుమరి. వాడేమో రిక్షావాడు. మాసిన గుడ్డలు చెమటకంపు. పైగా పదిమందితో స్టంట్ చేసి వున్నాడాయె. 

    మనిషింపయినా కంపెక్కడికి పోతుంది! అందుకే వాంతయింది ఆమెగారికి" అన్నాడు వ్యాకర్ణ జేబులోంచి కర్చీఫ్ తీసి ముక్కు కడ్డంగా పెట్టుకుని.

    " వాసనకి కాదురా కర్ణా! వాంతయింది. కడుపొచ్చి. అంటే వేవిళ్ళు అని గుర్తన్నమాట..." అన్నాడు అబ్బులు.

    " సరే, ఎలాగో అలా కానియ్యి" ఆనందు వ్యాకర్ణ కర్చీఫ్ జేబులో కుక్కుకుని.

    అంతవరకూ కధ వింటున్న జయచిత్ర, బిందురేఖ పళ్ళు కొరుక్కుంటూనే ( నూరుతూనే) వున్నారు.

    పళ్ళు నొప్పుట్టాయి. పళ్ళు కొరకటం మానేసి కోపం తెచ్చుకుని కళ్ళెర్రజేసి " గాలి పీలిస్తే కడుపొస్తుందా?" అన్నారు.

    " మగాణ్ణి ఆ సంగతి నాకెలా తెలుస్తుంది?" అన్నాడు అబ్బులు.

    " ఆడాళ్ళకి తెలుస్తుందిగా ఎవరినైనా అడిగితె!" అన్నాడు వ్యాకర్ణ.

    " మి కధలో దండం. మికో దండం ఇంకా పెయ్యండి. తెలుగు సినిమా కధ చెప్పి రచయిత్రుల నవల్స్ లో ఈ కధ వుంటుందంటారా?" అంటూ జయచిత్ర కళ్ళెర్రజేసంది.

    " తెలుగు సినిమాలు సగం రచయిత్రుల నవలలే కదండే తీసింది" చల్లగా అన్నాడు అబ్బులు.

   
   
   

 Previous Page Next Page