Previous Page Next Page 
గాడ్స్ గిఫ్ట్ పేజి 40

    మీరు మీ జీవితంలో ఎవరినైనా ప్రేమించారా! మీ ప్రేమ సఫలమా! విఫలమా! అభ్యంతరం లేనివాళ్ళు ఫోటో పంపవచ్చు. ప్రేమించి పెళ్ళాడిన దంపతులు వారి అనుభావాలతోపాటు భార్యా భర్తల ఫోటో పంపితే బహుమతి వందరూపాయలు.
   
    ఇలా మొదటివారం "మీరు మీ ప్రేమ" శీర్షిక పెట్టేసరికి బోలెడు ప్రేమ పక్షులు (ప్రేమానుభావాళ వ్యాసాలూ ఫోటోలు కలిసి పోస్ట్ లో) ప్రయోగం ఆఫీసులోకొచ్చి వాలాయి.
   
    ఆ శీర్షిక అంతవరకు సక్సెస్ అయింది.
   
    ఇహ మిగిలింది శృంగారం దీనికి మరోపేరు సెక్స్ ఆబాల గోపాలం చదివే పత్రికలో బూతుని చూస్తే యూత్ వూరుకుంటుందిగాని పెద్దలు వూరుకోరు కదా! (వాళ్ళూ చాటుగా చదువుతారు. అది వేరే సంగతి పైకన్నా పెద్దరికం వెలగబెట్టాలి కదా!)
   
    శృంగారం ఎప్పుడూ చేయకపోయినా దీనికి ఓ శీర్షిక పెట్టాడు.
   
    ఆ శీర్షిక పేరు "మీ మొదటిరాత్రి అనుభవాలు."
   
    ఆ శీర్షిక కింద దయచేసి ఈ అనుభవాలను పెళ్ళయినవారు మాత్రమే చదవండి.
   
    కొందరి తొలిరేయి అనుభవాలు వింతగా విచిత్రంగా వుంటాయి. తమ తమ అనుభవాలు ఇతరులతో పంచుకోవాలని కొందరికి వుంటుంది. ఇతరుల అనుభవాలు తెలుసుకోవాలని మరికొందరికి వుంటుంది. అనుభవాలని పంచుకోటంలో తప్పులేదు.
   
    "మీ మొదటిరాత్రి అనుభవాలని అందరూ చదవటానికి వీలులేకుండా "ప్రయోగం" పత్రికలో నాలుగు పేజీలని అతికించి జేబుపద్దతిలో తయారు చేస్తున్నాము. దయచేసి ఈ జేబుని పెళ్ళయినవారు మాత్రమే తెరవాలి. కొలతలు రెండర్ధాల మాటలు. అవి చాలక మూడర్దాలు నాలుగర్దాలతో బూతుగాని బూతు మాటలు... ఆ మాటలు వినటానికి యిష్టపడే ప్రేక్షకులు.
   
    "నీ ఎంకమ్మ!" అని హీరో అదోలా చూస్తూ అంటే.
   
    "నీ టెంకె కదూ!" అంటూ హీయోయిన్ సిగ్గుతో వంద మెలికలు తిరుగుతూ అనేది.
   
    దీన్ని బూతు అనొచ్చుకాదు ఉత్తిత్తి మాటలే అనొచ్చు అదంతా మనిష్టం.
   
    ఈ భూమ్మీద మామూలు మనుషులు ఇలా అఘోరిస్తే వుంటే పైన దేవాది దేముళ్ళు కధలు కూడా పరమ పవిత్రమయిన బూతుతో కూడి వుండేవి.
   
    బూతు తప్పని పైకి అందరూ అంతం వరకే బూతు ఇష్టం లేని దెవరికి?
   
    అందరికి అమిత ఇష్టం కాబట్టే అయిష్టంగ పైకి ముఖం పెట్టి మాట్లాడినా అందరికి అంతో ఇంతో కావాల్సింది అదే.
   
    యీ వీక్ పాయింట్ తెలిసిన బి.పి. రావ్ తన పత్రికలో "మీ మొదటి రాత్రి అనుభవాలు" శీర్షికపెట్టి అందరి మన్ననలు పొందాడు.
   
    ఆ పత్రిక్కి మొదటి రాత్రి అనుభవాల గురించి నిజంగా రాసిన వాళ్ళు ఎవరూ లేరు.
   
    వాళ్ళ....వాళ్ళ కోరికల కుతి తీర్చుకోటానికి ఏవేవో ఊహించి వికృతమైన ఆలోచనలతో వింత వింతగా రాసి పంపించేవాళ్ళు. మారుపేర్లు...తప్పుడు అడ్రస్ లు ఇచ్చేవాళ్ళు అయినా సరే...అవన్నీ కూడా ప్రచురణకి నోచుకునేవి.
   
    ప్రతి వారం ఇవి చదవటానికి బహు పసందుగా ఉండేవి.
   
    ఈ వైవిధ్యం సంచికలో చిన్న "జేబు" సంచిక ఉండటంవల్ల పెద్దలు ఆ జేబుని పత్రిక రాగానే కత్తిరించుకోటానికి వీలయ్యేది.
   
    పెద్దలు ఎంత జాగ్రత్తపడ్డా పిన్నలు చాటుమాటుగా ఈ "జేబు" దొంగతనాలు చేస్తూనే ఉండేవాళ్ళు (చదువుతూనే వుండేవాళ్ళు)
   
    "ప్రయోగం" పత్రికకి అంతులేని పేరు ప్రఖ్యాతులు రావటం చూసి....వాళ్ళూ కొత్త శీర్షికలు యమర్జంట్ గా వెతికిపెట్టారు.
   
    ఒక పత్రికలో "మీ గృహంలో మీరే వైద్యులు" అన్న శీర్షికని చూసిన బి.పి.రావ్ కి అప్పటికప్పుడే ఒకబ్రిలియంట్ ఐడియా వచ్చింది. తన "ప్రయోగం" పత్రికలో రెండు పేజీలు ఈ కొత్త శీర్షికకి ఉపయోగించటం జరిగింది.
   
    "చేయూత...పై పూత" అనే పేరుతో డాక్టర్ గారి సలహాలు మొదలయ్యాయి.
   
    తమ కొచ్చిన రోగాలేమిటో పత్రికాముఖంగా తెలియజేస్తే డాక్టర్ వినయం గారు తగు రీతిగా సమాధానాలు ఇవ్వటమేగాక ఒక (రోగి) పాఠకుడికి ఆ వ్యాధికి తగిన మందులు కూడా పోస్ట్ ద్వారా అందేలా ఏర్పాటుచేశాడు బి.పి.రావ్.
   
    ఉచితంగా సలహాలు...మందులు వస్తాయనే సరికి ప్రతివాళ్ళు. ఈ శీర్షికకి తమ రోగం తాలూకా ప్రశ్న పంపించేవాళ్ళే. "తరచూ తుమ్ములొస్తాయ"ని ఒకడు...
   
    "తన ఒళ్ళు పగలు వేడిగాను, రాత్రులు చల్లగాను ఉంటుందని" మరొకడు...
   
    "వంకాయలు తరిగినప్పుడల్లా తనకు తలనొప్పి వస్తుందని" మరొక ఇల్లాలు...
   
    "మగవాళ్ళకి వచ్చినట్టుపూర్తిగా కాకపోయినా కొద్దికొద్దిగ తనకూ మీసాలొస్తున్నాయని" వొక యువతి...
   
    "అది తొలిగే మార్గం లేదా" అంటూ ఉత్తరాలు రాశారు.
   
    "ఏ ఉత్తరం చూసినా ఏమున్నది గర్వకారణం....? తలనొప్పులు....పంటి నొప్పులు తప్ప. ఈ చచ్చు పుచ్చురోగాలని పత్రికలో ప్రచురిస్తే పత్యం కూడు తిన్నట్టే. పత్రిక సేల్స్ పదిపోవడం ఖాయం" అని ఆలోచించిన బి.పి.రావ్ ఆ ఉత్తరాలన్నీ ముందేసుకుని ఒక రోజు అంతా ఆలోచించగా మంచి ఆలోచన తట్టింది.
   
    తనకొచ్చిన ఆలోచనకి తనే మురిసిపోయి ఆనందంతో తబ్బిబ్బై కొన్ని ప్రశ్నలు....వాటికి సమాధానాలు తనే తయారుచేసి ఆ వారం "ప్రయోగం" పత్రికలో "చేయూత-పై పూత" డాక్టర్ సలహాల క్రింద ప్రచురించాడు.
   
    ఆ ప్రశ్నలు....సమాధానాలు ఈ విధంగా ఉన్నాయ్.
   
    "డాక్టర్ వినయంగారు! నా ఎడం తొడమీద రూపాయంత పుట్టు మచ్చ ఉంటే పెళ్ళయిన తర్వాత పిల్లలు పుట్టరని నా న్సేహితున్నాడు. నేను పెళ్లిచేసుకొంటే నిజంగా పిల్లలు పుట్టరా? మీ దగ్గరనుంచి జవాబు వచ్చిన తరువాతనే పెళ్లి చూపులకెళతాను." అంటూ ఓ పుట్టుమచ్చ పాఠకుడు పుట్టగుంట నుంచి ప్రశ్న అడిగాడు.
   
    "పుట్టుమచ్చ ఎడం తొడమీద వున్నా కుడి తొడమీద వున్నా అక్కడవున్నా ఎక్కడవున్నా పిల్లలు పుట్టకపోవటం అంటూ ఏమీ వుండదు. పెళ్లి చూపులకి వెళ్ళండి. పిల్లలో పుట్టుమచ్చలు వెతక్కండి." అంటూ డాక్టర్ వినయంగారి జవాబు.
   
    "నాకేమో రాత్రిళ్ళు లైటుంటే [ఆ వెలుతురు] యిష్టం లేదు. మా ఆవిడకి పట్టపగలులాగా రాత్రంతా పెద్దలైటు వెలుగుతూనే వుంటే ఇష్టంట. మాకు కొత్తగా పెళ్ళయింది. మొదటి రాత్రి నేను లైటు స్విచ్ ఆఫ్ చెయ్యను. నా భార్య వెంటనే లైటు స్విచ్ ఆన్ చెయ్యను.... ఇలా ఆపు ఆన్ తోనే ఆ రాత్రి తెల్లారింది. అంతేకాదు ప్రతిరాత్రి నా పాలిట ఓ కాళరాత్రిలా ఇలా ఆపు ఆనుతోనే తెల్లారిపోతున్నది. పత్రికాముఖంగా నా...మా సమస్యకి పరిష్కారం చూపి పుణ్యం కట్టుకోండి డాక్టరుగారూ!" అంటూ బొబ్బర్లంక నుంచి ఓ బుద్ధమూర్తి రాశాడు.

 Previous Page Next Page