"అయితే..."
"నీకు నేను ఫస్ట్ టైమ్ చేసాను___ఇదే టైమ్ అది చెప్పడానికే ఈ ఫోన్....you MEAN IT....OK" అవతలి వ్యక్తి గొంతు హుషారుగా ఉంది.
"నీలాంటి ఎనిమిస్ నాకు చాలామందున్నారు. శత్రువులతో ఆడు కోవడం....నా హాబీ....నన్ను డి కొనాలనుకుంటే, దమ్ముంటే ఎదురుగా రా...."కోపంగా అన్నారు హరికృష్ణమనాయుడు.
"అంత మొనగాడివా నాయుడూ...." అవతలి వ్యక్తి నవ్వునాయుడిని కిర్రెక్కించింది.
ఆయన ముఖం ఎర్రగా మారిపోయింది.
"పదికోట్లు పార్టి ఫండ్ గా ఇచ్చి, టిక్కెట్ కోసుక్కిన్నట్టుకాదు, నన్ను డి కొనడం నువ్వు పాలిటిక్స్ లోకి ఎందుకు అడుగు పెట్టావో నాకు మాత్రమే తెలుసు. మరో అరగంటలో నువ్వు హొం మినిస్టరవు తున్నావ్..... ఆ విషయం నీకు తెలిదు, నాకు తెలుసు."
"అది చెప్పడానికే ఫోన్ చేశావా!"
"కాదు. జాగ్రత్తగా విను....నువ్వు మినిష్టర్ కావడానికి మిల్లేదు. అందులోనూ హొం మినిష్టర్ కావడానికి అసలు వీల్లేదు. ప్రమాణ స్వకారోత్సవానికి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. గుర్తుంచుకో.... దీనికి భిన్నంగా ఏం జరిగినా .....ప్తెనాల్ రిజల్ట్ కొన్ని గంటల్లో నీకు తెలుస్తుంది.....సి....యూ...."
అవతలి వ్యక్తి ఫోన్ రిసివర్ని పెట్టేసాడు.
ఎన్నో గేమ్స్ ని అవలీలగా ఆడిన హరికృష్ణమనాయుడి యాభ్తే ఆరేళ్ళ జీవితంలో డ్తె రెక్టుగా వచ్చిన ఫోన్ బెదిరింపు అదొక్కటే.....
ఇండస్టియలిస్టుగా ఎప్పడూ ఇలాంటి ఫోన్లు తనకు రాలేదు. పాలిటిక్స్ లోకి అడుగుపెట్టిన తొలి క్షణంలో.....?
కొన్ని క్షణాలు ఆలోచనలో పడ్డాడు హరికృష్ణమనాయుడు.
బిజినేన్ వరల్డ్ లో ఉన్న శత్రువులు తెలుసు....వాళ్ళ జలాబలాలు స్పష్టంగా తెలుసు వాళ్ళు అదును చూసి, తనని దెబ్బకొట్టడానికి, ఎదురుచూస్తున్న విషయం కూడా తెలుసు.
రాజకీయం-కనబడని శత్రువుల మయసభ.
పోలిటిక్స్ లో ఇలాంటి కాల్స్ చాలా సహజం .....ఆ ఆలోచన రావడంతోనే, కొన్ని నిమిషాలసేపు సీరియస్ గా ఆలోచించిన హరికృష్ణమనాయుడు పూర్తిగా రిలాక్స్ అయిపోయి సూట్లోంచి బయటకొచ్చారు.
ఆత్రంగా అస్పష్టంగా లోన జరిగిన సంభాషణని అంచనా వెయ్యడానికి ప్రయత్నస్తున్న సూర్యసాగర్ వేపు చూసి___
"ఇట్స్.....ఎ.....రాంగ్ కాల్ ....కమాన్" ఆయన భుజం మీద చేయి వెస్తూ గబగబా ముందుకు నడిచారు హరికృష్ణమనాయుడు.
మరో మూడు నిమిషాల తర్వాత____
హొటల్ అశోక పోర్టికోలోంచి ఒక అయిదు కార్లు రాష్టపతి భవన వేపు దూసుకుపోయాయి. ఆ కార్ల మధ్యలోని బ్రౌన్ కలర్ కారులో కూర్చున్న హరికృష్ణమనాయుడు మెదడులో కనబడని ఎనిమి చేసిన ఫోన్ కాల్ రింగవుతూనే వుంది.
* * *
సరిగ్గా____
12.17 నిమిషాలు.
రాష్టపతి భవనలోని దర్భారు హల్లో ప్రవేశించారు హరికృష్ణమనాయుడు అప్పటికి ఎనిమిది మంది అభ్యర్ధులు మంత్రులుగా ప్రమాణ స్వకారం చేసారు.
ఆంద్రప్రదేశ్ కు చెందిన ఎం.పిలు కూర్చున్న ప్రదేశానికి వెళ్ళబోతూ- మ్తెకులో చటుక్కున తన పేరు వినబడడంతో, తలెత్తి, పార్టి సహచరుల వేపు నవ్వుతూ చూసి, ఉప్పొంగిన ఉత్సాహంతో___
వేదిక వేపు అడుగేసారు హరికృష్ణమనాయుడు....ఆయన. ప్రమాణ పత్రమ చదుతున్నంతసేపూ హాలంతా, జయ, జయశ్వానాలు, కరతాళాల్తో మారుమోగిపోయింది.
ప్రమాణ పత్రం చదివాక, సంతకాల కార్యక్రమం అయిపోయాక, రాష్టపతితో కరచాలనం చేసి, కృతజ్ఞాతలు తెలియజేసి___
ప్రధాని వేపు అడుగువేసారు హరికృష్ణమనాయుడు.
"కంగ్రాచ్యులేషన్స్- మిస్టర్ నాయూడూ ....." మనసారా నవ్వుతూ షేక్ హేండ్ ఇచ్చారు ప్రధాని.....
"గమ్మత్తుగా నన్ను పొలిటిషియన్ ని చేశారు.... అంతే గుమ్మత్తుగా హొం మినిష్టర్ ని చేశారు ...." అన్నారు హరికృష్ణమనాయుడు ఎగ్త్సేట్ మెంట్ తో. "మీమీద నాకు నమ్మకం ఉంది నాయుడు గారూ.... అందుకే మీరు "హొం" ఇచ్చాం ఇండస్ట్రీయలిస్ట్ గా మీ సక్సస్ మాకు తెలుసు. కరెక్ట్ పోలిటిషియన్ గా మిమ్మల్ని మీరు తిర్చిదిద్దుకోవాలంటే..... స్వదేశంలోనూ, విదేశంలోను పొంచి ఉన్న జాతివ్యతిరేకులకు సవాల్ గా నిలిచి, మన శత్రువుల్ని ఆనగాదోక్కే ప్రయత్నం మీరు చేయాలి. మీకు ఆ కెపాసిటి ఉందని నమ్ముతున్నాం.... అందుకే కొత్తవార్తెనా మీకు హొం శాఖనిచ్చాం..." నవ్వుతూ అన్నారాయన.
ఆ మాటకు హరికృష్ణమనాయుడు కృతజ్ఞతగా చూసాడు.
Every body is bound to make enemies, especially if they do their jab right, we cant please every one" అన్నాడు నాయుడు ఎంతో ఆత్మ విశ్వాసాన్ని , కృతజ్ఞతని కనబరుస్తూ, ప్రధాని నాయుడు భుజం తట్టారు__ స్నేహ పూర్వకంగా , నాయుడు తన శత్రువుల్ని ఎలా ఎదుర్కొన్నాడో, ముప్త్పే ఏళ్ళుగా నాయుడ్ని తెలిసిన వ్యక్తిగా ప్రధానికి తెలుసు!
"EVERY BODY BOUND TO MAKE FEW ENEMIES"
ఆకస్మాత్తుగా తన నోటి వెంట వచ్చిన మాటకు తానే ఆశ్చర్యపోయాడు హరికృష్ణమనాయుడు FEW ENEMIES....
వేదిక దిగుతున్న హరికృష్ణమనాయుడుకి, పార్టి సభ్యుల కేరింతలు, పార్టి మిత్రుల అభినందనలు ఏవి విన్పిచడంలేదు.