Previous Page Next Page 
అమ్మో! అమ్మాయిలు పేజి 4

        పొట్టశాల్తీ అబ్బులి మాటలకి పోట్టపగి లేటట్లు నవ్వి " భలే వాడివోయ్" సూర్యుడు యిప్పుడు నీ వెనుక భాగం వున్నాడు. కిరణాలు పడేది నీ వీపు మీద? అన్నాడు.

    " భాగం?... ఎంత బాగా గుర్తు చేశారండి! మేము ఇల్లు మ రాలి. మాకో ఖాళీ భాగం కావాలి. మి యింట్లో... మి ఇంటి ప్రక్క మి వీధిలో... ఎక్కడో అక్కడ ఓ గది అద్దెకి దొరుకుతుందా అండీ!"

    " ఏమిటీ? గది అద్దెకి కావాలా? అద్దె గడికోసం తిరుగుతున్నారా?" ఆతృతపడిపోతూ అడిగింది శాల్తీ.

    " అవినండి " వినయంగా చెప్పాడు అబ్బులు.

    " ఒక్క గడికోసం ఒక నెలనుండి తిరుగుతున్నా మండి ఒక్క గది ఎక్కడా లేదు. మూడు గదులు. నాలుగు గదులు. ఫామిలీకి తప్ప బ్యాచిలర్సకి పనికొచ్చే ఒక్క గదున్న కొంపేలేదు" వ్యాకర్ణ దిగులుగా అన్నాడు.

    శాల్తీగారు వీళ్ళ మాటలిని లాల్చీ జేబులోంచి నోట్ బుక్కు, పెన్ను తిశాడు. " చూడు బాబు! అద్దె ఇంటి కోసం రెండు నెలల బట్టీ తిరుగుతున్నాను. మిరు చూసి వదిలేసిన ఇంటి అడ్రస్లు చెపితే నే వెళ్ళి చూసుకుంటాను. బాబ్బాబు."

    " బాగుంది. మాకు జ్ఞాపక శక్తి తక్కువండీ?" అంటూ వ్యాకర్ణ, అబ్బులు శాల్తీని తప్పించుకుని ముందుకుపోయారు.

    " లేచిన వేళ బాగుండలేదు" అన్నాడు అబ్బులు నడూస్తూ.

    " అవునురా! ఇవాళ తిరిగిన వాళ్ళం తిరిగినట్లున్నాము. ప్రతి చోటా మొండి చెయ్యే ఎదురయింది. విడేవడో రూమ్ చిపిస్తాడను కున్నాను. నీ గుద్దు ఫలితమా అని వీడే మన్ని అద్దె ఇళ్ళేక్కడు న్నాయి అంటూ నోటుబుక్కు తీశాడు చూసుకు నడువు" విసుక్కున్నాడు వ్యాకర్ణ.

    అబ్బులు, వ్యాకర్ణ మరో నాలుగు విధులు తిరిగారు. అక్కడో టులెట్" బోర్డు మెరుపులా కనబడింది. " ఈ రోజుకి ఈ ఒక్క టులెట్" చూసి కొంపకి చేరుకుందాం అనుకుని తలుపు తట్టారు. తలుపు తట్టేముండు అనుకున్నారు నమస్కారం పెట్ట కూడదు తిక్కగా మాట్లాడ కూడదు అని.

    " ఎవరది? వచ్చె వచ్చె" అంటూ లోపలి నుంచి వినపడింది. ఆ వెంటనే తలుపులు తెరుచుకున్నాయి. ఓ గుండు బామ్మగారు గుండు మిద వుండనంటూ జారిపోతున్న మల్లు గుడ్డని ముఖం మిదకు లాక్కుంటూ వాకిట్లో కొచ్చింది.

    గుండుబామ్మగారు అక్షరాల గుండే సుకుని వుండటమే గాక గుండులా వుంది. తెల్లగా వుంది. అందంగా వుంది. మొఖాన్ని రోల్డుగోల్డు ఫ్రేము గల కళ్ళజోడు వుంది. పూర్వాశ్రమంలో అందగత్తెన నిపించే విధంగా ఇప్పుడూ బాగుంది. అమాయకంగా వుంది. గుండు బామ్మగారికి నమస్కారం పెట్టాలో అక్కర లేదో అసలేం మాట్లాడాలో తెలియక కంగారుపడ్డారు అబ్బులు, వ్యాకర్ణ.

    " ఎవరు కావాలి నాయనా!" చాలా శాంతంగా అడిగింది గుండు బామ్మగారు.

    " తాతగారు" అనబోయి నాలుక్కొరుకున్నాడు అబ్బులు. ఆయనే వుంటే మంగలెందుకు నాయనా? అన్న సామెత గుర్తు కొచ్చింది.

    " ఎవరూ అక్కర లేదండి" అన్నాడు వ్యాకర్ణ.

    " దాహం కావాలా నాయనా!" అంది బామ్మగారు వీళ్ళ ముఖాన పట్టిన చెమట చూసి.

    " దాహం అంటే ఏమిటిబ్బా?" అన్నట్లు అబ్బులు వ్యాకర్ణ ముఖముఖాలు చూసుకుని, దాహం అంటే మంచి నీళ్ళని గుర్తుకు తెచ్చుకుని వాళ్ళ ముఖాలు చూసుకోవటం మానేసి బామ్మగారు ముఖం చూస్తూ " కావాలండి" అన్నారు.

    బామ్మగారు మంచి నీళ్ళు ఒఅ పెద్ద మరచెంబునిండా తెచ్చి యిచ్చింది. మంచి నీళ్ళు గడగడ తాగిం తర్వాత కంగారు, బుర్ర తిరుగుడు   తగ్గాయి మిత్రులకి .

    " బామ్మగారు!" అంటూ ఆప్యాయంగా అతి వినయంగా పిలిచాడు అబ్బులు.

    " బామ్మగారూ!" వెంటనే వ్యాకర్ణ భక్తి శ్రద్ధలతో అన్నాడు.

    " ఏం కావాలి నాయనా? అంది బామ్మగారు."

 Previous Page Next Page