"పోనీ ఈయననెవరో నీకు తెలుసా?" ఆఅమ్మాయి నుద్దేశించి అడిగారు మంత్రిగారు.
"నేను ఎం.బి.ఏ చేశానండీ_
నాకేకాడు బిజినెస్ ఇంటర్ ప్రేన్యుయర్ ఎవరికయినా ఆదర్స ప్రాయడయిన వ్యక్త్రి ప్రక్కన కూర్చుని మాట్లాడే అవకాశాం ఫండా మేమ్తల్స్ ఆఫ్ బిజినెస్ ని ప్రభోధిస్తారు." అని, "బైదిబై... నా పేరు కావ్య. ఎం.బి.ఏ. చేశాను. మెరైన్ కార్పోరేషన్ పేరిట బిజినెస్ ప్రారంభింఛబోతున్నాను" తనను తానూ పరిచయం చేసుకుంది.
"సీపుద్ కి ఫారిన్ మార్కెట్ చాలా బాగుంది. ప్రత్యేకించి రొయ్యలు..." అంటూ ఇంకా ఏదో చెప్పాబోయాడుగాని, అతడి మాటల్ని మధ్యలోనే త్రంచుతూ అన్నది కావ్య, "సీపుద్ ఎక్స్ ఫోర్ట్ కాదండి_జల సమాధి అయిపోయిన ఓడల్ని పాటపాడి ఆ ఓడని, ఓడలోని వస్తువుల్నీ బయటకు తీసుకొచ్చే సాహాసం చేస్తున్నాను" అన్నది.
"ఓహే__ అడ్వంచర్ చేస్తున్నావమ్మాయి. కొన్ని సందర్భాలలో శ్రమకి తగిన దక్కాకపోవచ్చు. ప్రమాదానికి గురయిన పిష్ శ్రమకి తగిన ఫలితం దక్కకపోవచ్చు. ప్రమాదానికి గురయిన పిష్ రికార్డ్_ అందులో వున్నా వస్తువుల విలువ__ సీలెవెల్ ఇదంతా సేకరించడానికి పెద్దా రిసెర్చి వింగ్ కావాలమ్మా...." అన్నాడు.
"నా పరంగా నేను సిద్దం. మినిస్టర్ గారి గ్రీన్ సిగ్నల్ కావాలి__ ప్రాజెక్ట్ రిపోర్టు తీసుకొచ్చాను. మీరు కూడా చూసి ఏవయినా సలహాలు ఇస్తారా?" అనడిగింది.
"సలహలేకాదు, సహాయంకూడా చేస్తాను. ఇదిగో నా కార్డు_ఫోన్ చేసి రామ్మా" అంటూ విజిటింగ్ కార్డు అందించారు.
"థాంక్యూ_" అంటూ ఆ కార్డు అందించారు.
"ఇదిగో వేమ్కత్రామయ్యా... ఈ అమ్మాయి ఎవరనుకున్నావు? వడయారు కుతురయ్యా..." నవ్వుతూ అన్నాడు సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టరు.
అది అతడకి లక్షవోల్టుల షాక్ కాదు. సన్నటి జలదరింపు. అడ వాళ్ళకి స్రీత్వం పెద్ద అలంకారం అయివుండచ్చు. కాని తెలువితేటలు, ధైర్య సహాసాలు అసలయిన ఆభరణాలని అతడి అనుభవంలోకి వచ్చింది.
పారిశ్రామికంగా అంచెలంచెలుగా ఎదిగిపోతున్నా వదయారుని ఎదుర్కోవడమేలా? అని ఆలోచిస్తున్నా ఎం.వి.అయ్యకి కొత్త సవాలు ఎదురవబోతుంది_ అదీ ఆ వడయారు కూతుర్నుంచే!
ఆకులా కదలిపోయిన అయ్యా అప్రయత్నంగా టేబుల్ మీద, తనకు ఎదురుగా నున్న మంచి నీళ్ళూగ్లాసు తీసుకున్నాడు.
* * * *
డాడీ! మీ కాంపిటేటర్ ని లిటరల్ గా మంచి నీళ్ళు తాగించాను."
విషయం బోధపడలేదు వడయారుకి.
"ఫావునాన్స్ మినిష్టర్ అపాయింట్ మెంట్ తీసుకుని వెళ్ళాను. మేము మాట్లాడుతుండగా అక్కడికి ఎం.వి.అయ్య వచ్చారు. అయన వచ్చారని తెలియగానే మినిస్టరుగారు లోపలకి ఆహ్వానించారు. నన్ను హాఠాత్తుగా వెళ్ళిపొమ్మని చెప్పలేరు కదా- నేను కూడా ఆ అవకాశాన్ని వినియోగించుకుని ఆయనతో పరిచయం పెంచుకోవాలనుకున్నాను. ప్రాజెక్ట్ విషయం మినిష్టరుగారితో మాట్లాడుతున్నట్టే అయనకూడాతెలియజెప్పాను. రిస్క్ తీసుకుంటున్నావమ్మాయ్_ అంటూ ముందు వారించారు. ఆ తర్వాత నాకు ఏ సహాయసహకారం కావలసినా ఇస్తానన్నారు.అప్పుడు మినిష్టరు గారు నేను మీ అమ్మాయిని చెప్పారు. ఆ క్షణాన అయన ముఖంలో మారిన రంగుల్ని చూడాలి. జీవితంలో నాకు అంతకన్నా మించిన థ్రిల్లింగ్ ఇన్సి డెంట్ లేదు... "ఆమె మనసులో నాకు అంతకన్నా ముఖంమీద గులాభి రంగులో స్పష్టంగా ద్యోతకమవుతోంది.
విషయం వింటుంటే సింకింగ్ ఫీలింగ్ కి లోనయ్యాడు వదయారు.
కాని కెరటాలు వచ్చి తీరాన్నిడీకోనట్టు అలలు అలలుగా ఎం.వి.అయ్యా మేహమే గుర్తువస్తోంది_ మంచి నీళ్ళ గ్లాసండు కున్న అతడి మేహమే ఫోటోలా ముద్ర పడిపోయింది.
"దేశపు అత్యంత బలవంతమైన ప్రజ్ఞా పాత వలున్నా ఒక సారి శ్రామిక వేత్తతో చిత్టేలుక డీ కొనబోతుంది__" అనుకున్నాడు వడయారు. అనుకోవడ మే గాదు అదేమాట అన్నాడు.
ఆ క్షణాన ఆమెకు అర్ధంగాలేదు తండ్రి మాటలలోని అంతర్యం__
* * * *
మాదాల వెంకట్రామయ్య మనసు పొరల్లో అతి సున్నిమైన దెబ్బ కొట్టింది కావ్య. ఇటువంటి విషయాలలో తీసుకునే చర్యలకి, జరగబోయే పరిణామాలకి లాజిక్ వుండదు.
ఒక మనిషి సాంగత్యంలో కొత్త ద్వారాలు తెరుచు కోవడం, కొత్తగా ఆలోచించటం నేర్చు కోవటం ఎం.వి. అయ్యకి కొత్తకాదు. అతడి జీవితానికి కామలేగాని పుల్ స్టాఫ్ లేవు. అతడి జీవితంలో ధ్యేయాలేగాని అధ్యాయాలు లేవు. .మనిషి శారీరకంగా గాయబడి,ఆర్దికంగా నష్టపోయినా మానసికంగా దెబ్బతిన్నా తట్టుకోగలాడేమోగాని అతడి 'ఆత్మాభిమానం' దెబ్బతింటే తలక్రిందులవుతాడు.
నిన్నటివరకు వదయారు ఒక్కటే పోటీదారు, ఇప్పుడు వడయారు కూతురు కూడా రంగప్రవేశం చేసింది.
ఎం.వి. అయ్య కళ్ళలో కోపంకన్నా అతీతమైనాదేదో కనిపిస్తోంది. పేరుకున్న నిశ్శబ్దంలోంచి అతడి ఆలోచనలు ఓ రూపు సంతరించుకున్నాయి. లక్ష్యం నిర్ణయమయింది.
* * * *
వడయారు నుదుటున వున్నా విబూది రేఖల మధ్య అడ్డంగా కనబడుతున్న గీతాలు అతడి దీర్ఘాలోచనని సూచిస్తున్నాయి.
ఇండియన్ కరెన్సీని__
ఇండియన్ ఫారిన్ మార్కెట్ ని__
ఇండియన్ ఇండస్ట్రీయలిస్ట్ ని__
భారత పాలనాయత్రాంగాన్ని కంట్రోల్ చేయగల అతి కొద్దిమంది భారతీయలలో ఎం.వి.అయ్య ఒకడు!