Previous Page Next Page 
స్టార్ వార్స్ పేజి 3

    ఎటువంటి పరిస్థితిలోనయినా చెదరకుండా సీరియస్ గా వుండే అతడు ఆ క్షణనా ఉన్మాది అయ్యాడు. చేతిలోని గ్లాసుని బలంకొద్దీ ఎదురుగానున్న గోడకేసి కొట్టాడు. ఆగ్లాసు  భళ్ళున బద్దలయి కార్పెట్ మీద చిందరవందరగా చిట్లిపడింది. ఆ మ్రోతకి ఉలిక్కిపడ్డ లేడీ సెక్రటరీ గాబరాగా ఎదురుగావున్నా వ్యక్తీ ముఖంలోకి చూసింది.సమాధానంగా చిద్విలాసంగా నవ్వడతడు.

    ఆ గ్లాసు బ్రద్దలుకోట్టిన వ్యక్తీ_ఎం.వి. అయ్య.అతడి పర్సనల్ రూము చూడటానికి మినీకాటీజీలా వుంది. చిన్న బెడ్ రూమ్, ముందు లాంజ్, వెనుక భోజనం ఏర్పాట్లు,ప్రక్కన అతడి తాలూకు సెక్రటరీలు_స్టెనోలు  కూర్కాహోవడానికి చిన్న గది... ఎంతటి క్లిష్ట మయిన సమస్యలయినా అప్పటికప్పుడు మర్చిపోయేలా చేసుకోవడం అతడికి అలవాటు. అటువంటివాడు గత అరుగంతలుగా సిగార్ మీద సిగార్ కాలుస్తూ, గ్లాసు వెంబడి గ్లాసు ఎందుకు ఖాళీ చేస్తున్నాడో ఆమెకు అర్ధంగాలేదు. అతడి సమస్యల్లో పాలిపంచుకునే లేడీ సెక్రటరీగాని, స్టెనోగాని ధైర్యంచేసి అతడి ముందుకు రాలేకపోతున్నారు. కారణం__ పడయారు!

    అవును ముమ్మాటికి వాడయరే!!

    ఇండియన్ ఇండస్త్రీయలిస్ట్  జబితాలోమకుటంలోని మహా రాజుగా నెంబర్ వన్ స్థానాన్ని అలకరిమ్చిన మాదాల వేమ్కత్రామయ్యా కీర్తిసౌధాన్ని వడయారు పునాదిసహా పేలిస్తున్నాడు.సూట్ కేసుల తయారీ భారతదేశంలో ప్రధమస్థానం 'వి.బి.సి.'సూట్ కేసులది_ ప్రపంచ మార్కెట్ లో తృతీయస్థానం! సూట్ కేసుల తయారీలో ప్రధమస్థానం అమెరికాకు చెందిన 'శాంసోనైట్'సూట్ కేసుల్ని భారతదేశంలో పంపిణీచేసే హక్కుల్నీ తీసుకున్నాడు. కాని ప్రభుత్వం స్వదేశీ వస్తువుల్ని ప్రోత్సహించటానికి విదేశీ వస్తువుల్ని దీగుమతి పై అధిక మొత్తంలో పన్నులు విధించడంద్వారా అంక్షలు పెట్టింది దీనికి విరుగుడుగా 'శాంసోనైట్ కంపెనీకి గుడ్ విల్ చెల్లించి అదే పేరుతో సూట్ కేసుల తయారీకీ హక్కులు పొందాడు వడయారు. ఈ వ్యాపార లావదేవీల వెనుకనున్న మాస్టర్ బ్రెయిన్ వడయారు కూమార్తె కావ్యాది.

    ఈ లావాదేవీలు తెలిసినప్పటినుంచి ఎం.వి.అయ్య.కంటికి కునుకులేదు, మనసుకీ కుదరలేదు.
    "ఇంతింతై పటుడింతయినట్లు..." తన కళ్ళముందే ఏదిగిపోతున్న తన ప్రత్యర్డీ దెబ్బతీస్తూ తనస్థితిని పదిలపర్చుకోవడానికి గల విషయంలోను తనకన్నా రెండడుగులు ముందు దర్శనమివ్వడంతో అతడి మోహం ఆవేశంతో_ అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడిలా మారింది.
   
                                 *    *    *    *   


    విశాలమైనా ఆవరణ. చదరంగం బల్లవలే నలుపు_తెలుపు ఫోర్లింగ్ ఒకవైపున  ఎక్సర్ సైజు చేస్తున్నారు. కొందరు మరొకవైపున బాక్సింగ్ బ్యాగ్ మీద పంచేస్ ఇస్తున్నాడు మరోవ్యక్తీ ఆ హాలులో ఒక వైపున కాఫీబార్ వుంది. మరొకవైపు స్టాండు కి బ్లాక్ బోర్డు వుంది. ఆ బోర్డు మీద ఒక కాగితం పిన్ చేసివుంది. ఆ కాగితం మధ్యలో నల్లటిచుక్క చుట్టూ వృత్తాకారంలోగల గీతాలున్నాయి. అక్కడ ఘాంటింగ్ ప్రాక్టీసు జరుగుతొంది. కాఫీబార్ దగ్గర కొంతమంది స్నాక్స్ తీసుకుంటూ   పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. అప్పుడు ఆ బిల్డింగ్  ఆవరణంలో బాణంలా దూసు కొచ్చిందొక ఇంపోర్దెండ్ కారు. అంత వేగంతో వచ్చిన కారు సడెన్ గా 'కారు పార్కింగ్' అన్నబోర్డు ఎదురుగ రెండుగీతలమధ్య చిన్న జెర్క్ తో ఆపటంలోనే డ్రైవింగ్ లో అతడి స్కిల్, ఘ్రాడ్ నేస్ బయటపడుతున్నాయి. అ వచ్చిన వ్యక్తీ మనోహర్_ భారతదేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తాలతో ఒకడయిన మాదాల వెంకట్రామయ్య ఏకైక కుమారుడు_ యంగ్ డైనమిక్ క్లబ్ సెక్రటరీ. ఇంజనీరింగు గ్రాడ్యుయేట్. రేపోమాపో తండ్రికి చేదోడువాదోడుగా పారిశ్రామిక రంగంలోకి దిగబోతున్నాడు.

    అయిదడుగుల పది అంగుళాల ఎత్తు, సన్నటి నడుము, ఆ పైన విశాలంగా పైకిపాకిన ఛాతీ_ ఇవేమీకావు అతడి ఆకర్షణలు, అతడి కళ్ళే పెద్ద అక్షర్షణ; అతడి రాకతో అప్పటివరకు స్తబ్దతగా వున్నా ఆ క్లబ్ చేతన్యం వచ్చింది.
   
                                  *    *    *    *  
    ఆమెవైపు మరోసారి చూశాడు ఎం.వి.అయ్య. గాలికి ఆమె ముంగురులు కదుల్తున్నాయి. మాములుగా ఏ పార్టీలోనో, షాపింగ్ దగ్గరో కనబడితే అలాటి అమ్మాయిగురించి పట్టించుకునేవాడు కాదు . కాని చాలా తక్కువ మాటల్లో ఎక్కువ భావాన్ని స్పురించెట్టు ఆమె మాట్లాడే మాటలు, చివరకి ఆమె కూర్చున్న పొజిషన్ లో వున్నా ఠీవి అతడిని అదో రకమైన సంభ్రమంలో పడేస్తాయి. ఆమెలో ఏదో ఆకర్షణ అతడిని పరిమళంలా చుట్టుముడుతోంది. పైగా అది ఫైనాన్స్ మినిష్టర్ పేషీ.

    చెవులదగ్గర తెల్లబడిన అతడి జుత్తు_ కళ్ళకున్న దళసరి అద్దాలు అతడి వయసు ఏభై రెండు అని బయట పెడుతున్నాయి.

    సన్నటి నడుము మీదనుంచి జలపాతంపైకి ఉబికి నట్టున్న పైట! స్ట్రక్చర్ ఆమె స్రీత్వాన్ని బయట పెట్టేస్తున్నాయి. వాయిస్ మాడ్యులేషన్ దేరఫిలో ఆమెకు ప్రవేశమున్నట్టుంది. ఒక్కొక్క వాక్యాన్ని అందునా ఒక్కొక్క పదాన్ని ఒక్కొక్క రకంగా ఉచ్చరిస్తోంది. వినేవార్ని మెస్మరైజ్ చేస్తోంది. ఆమె వున్నట్టుంది  మౌనం వహించడంతో అప్పటివరకు పెద్దమనిషిగా_రిజర్వర్డ్ పర్సనాలితీగా వున్నా ఎం.వి అయ్య. ఆ ప్రయత్నంగా, "ఆగి పోయారేం... మాట్లాడండి" అన్నట్టుగా ఆమెవైపు చూశాడు. వ్యాపారంలో రాటుదేలిన ఎం. వి. అయ్య ఆ క్షణనా చాలా మంది అమ్మాయిలు మొహానికి మేకప్ వేసుకున్నట్టే మనసుకి కూడా వేసుకుంటారని, తనప్రక్క కుర్చీలో కూర్చున్న ఆమె ఆ కోవకే చెందుతుందని గ్రహించలేకపోయాడు.

    "సి మిస్టర్ వేమ్కతత్రామయ్యా!"

    "ఈ అమ్మాయి నీకు తెలుసుగదా" అనడిగాడు ఫైనాన్స్ మినిస్టర్.

    "తెలియదు" అన్నట్టుగా తలూపి, "ఇదే మొదటిసారి చూడటం" అన్నాడు. 
 

 Previous Page Next Page