Previous Page Next Page 
అమ్మో! అమ్మాయిలు పేజి 38

    " ఇది కధ. ఎలాగో సర్దుకుపోవాలి మరి" అంది జయచిత్ర.

    " విళ్ళిద్దరూ యిద్దరే పోకిరీ పిల్లలు. యేం చేద్దాం" అంటూ వ్యాకర్ణ అబ్బులి చెవి కొరికాడు.

    " వీళ్ళ సంగతి నేచూసుకుంటాలే" అని తిరిగి అబ్బులు వ్యాకర్ణ చెవి కొరికి ఓసారి భూతద్దాలు తీసి తుడుచుకుని కళ్ళకు తగిలించుకున్నాడు.

    " బెల్లం కొట్టిన రాయిలా మాట్లాడరేమిటి?" అంది బిందురేఖ.

    " మాట్లాడితే మిక్కోప మూస్తుంది" అన్నాడు అబ్బులు.

    " వస్తే వస్తుంది మాట్లాడండి" అంది బిందురేఖ.

    " అదెలా కుదురుతుందీ?" రాగం తీశాడు అబ్బులు.

    " వాళ్ళు ఎలాగో అలా సర్దుకుంటామంటే మన కేమిటి. ఊ, కానియ్" అన్నాడు వ్యాకర్ణ.

    " అలాగే, ఇప్పుడు బామ్మగారు లేరుగాని వుంటే న పక్షం వహించేవారు. అదలా వుంచండి.

    అసలు కధ కొద్దాం. కధ చెప్పండి., చెప్పండి అని చంపింది మిరు. పోనీకదా అని చెప్పను. అవునా?"

    " అవును."

    " కధకు కాళ్లుండవు, ముంతకు చెవులుండవని ఓ సామెతుంది. అలాగే ఈ రాజు కధలకి తలా వుండదు. ఎందుకంటే ఏం చెబుతామ్? అని కాకమ్మ కధలు అంతే.

    రామాయణ భారతాలు తీసుకోండి. అని మన పవిత్ర గ్రంధాలు. వంకలు వెతకటానికి ప్రయత్నించండి. బోలెడు. అందుకే రామాయణం రంకు, భారతం బొంకు అన్నారు.

    దేముళ్ళు, దేవతలు అనబడే వాళ్ళకి కూడా వరాలు, శాపాలు, బ్రహ్మాస్తాలు, నాగాస్తాలు, ఇవన్నీ కలగా పులగం అయే కధ నడిచింది..."

`    అబ్బులి మాటలకి వ్యాకర్ణ అడ్డుతగిలి - " మొన్న మనం చూశాం. అదేం సినిమా అబ్బా..! ఆ... పాదుకా పట్టాభిషేకం. దానిలో ఎన్. టి. ఆర్. ని శారద " బ్రదర్, బ్రదర్" అని కేకలెడుతూ పాటపాడితే-

    ఠకీ అని ప్రత్యక్షమయి బోలెడు నైలాన్ చిరలివ్వ లేదేమిటి? ఎక్కడో వున్న కృష్ణుడు యిక్కడున్న శారద పిలుపుకి పరుగెత్తుకు రాలేదేంటి" అన్నాడు.

    " నోరు ముయ్యి" అన్నాడు అబ్బులు, అనట మేగాక వ్యాకర్ణ నోరుమూశాడు తన చేత్తో.

    జయచిత్ర, బిందురేఖ పొట్టలు పట్టుకున్నారు. ( వాళ్ళవే) నవ్వాపుకోలేక.

    " నిన్నెవరు నోరు తెరవమన్నారు?" అని అబ్బులు కోప్పడి మళ్ళీ మొదలు పెట్టాడు.

    " కాశీమజలీ కధలేమిటి. ఇచ్చట ప్రముఖ రచయిత్రుల కధలేమిటి, అన్నీ అన్నే సర్దుకుపోవాలి.

    అదెలా ఇదెలా అని కోడుగుడ్డు మిద ఈకలు పీకటానికి ప్రయత్నించకూడదు" అంటూ హితబోధ  చేశాడు.

    " కాశీమజలీ కధలకీను మా రచయిత్రుల కదలకీను పోలికా! నక్కెక్కడ నాగలోకం ఎక్కడ?" గయ్యిమంది బిందురేఖ.

    " రచయిత్రులనంటే నే సహించను గాక సహించను." గట్టిగా అంది జయచిత్ర.

    " సహించరు లేండి. మి జాతివాళ్ళు కదా రాసేది నిజం చెప్పాలంటే నవల్స్ లో ఎన్ని లోపాలుంటాయో చెప్పనా? ఇది నిజజీవితంలో   వాస్తంగా జరుగుతుందా అనిపిస్తుంది.

    ఓహీరో వుంటాడు. అతగాడు రిక్షా తొక్కేవాడు. బి. ఎ. వెలగబెడుతున్న హిరోయిన్ కారులో రోజూ కాలేజీ కొస్తుంది.

    ఓరోజు వదిలేటప్పటికి కారు రాదు. హీరో రిక్షాని పిలుస్తుంది. 'ఎంతివ్వమంటావ్?" అంటుంది.

    " మి దయ అమ్మాయిగారూ?" అంటాడు.

    ఈ పిల్ల రిక్షా ఎక్కుతుంది.

    ఆ పిల్లగాడు రిక్షా తోకకుతాడు.

 Previous Page Next Page