ఈ బీచ్ లోనే నా తల్లి నన్ను పోగొట్టుకున్నది. ఎప్పుడయినా మా అమ్మ నన్ను వెదుక్కుంటూ వస్తే... నేను కనిపించకపోతే ఆమె ఏమవుతుంది?"
కత్తిలేకుండా రక్తం లేకుండా నిమిషాల సుఖంతో తల్లినిచేసి ఆమె మానాన ఆమెని వదిలే మగవాళ్ళలో ఇటివంటి వారుంటారా?
ఓ మగవాడా! నీ జన్మ ధాన్యం... నీ వంటి బిడ్డనుకన్న ఆడదాని జన్మ ధాన్యం... నీవంటి బిడ్డ నివ్వడానికి ఆడది మృత్యువు నేదిరిస్తుంది. _ తన ప్రాణాలు ఫణంగా పెడుతుంది.
ఆపని చేసింది కూడా!
విభ్రాంతిగా చూశాడు.
"తంబీ!
తల్లిని ప్రేమించునవాడు... గౌరవించినవాడు భార్యను, పరాయిస్రీని కూడా అభిమానిస్తాడు. గౌరవిస్తాడట!!
మగాళ్ళందరిలోకి నీతి_ నిజాయితీ కలవాళ్ళు ఇద్దరే ఇద్దరు!
ఒకడు__ దొంగ! రెండోవాడు__ హంతకుడట!
వీరిద్దరూ ప్రియురాలితో మనపిచ్చి మాట్లాడతారు. చచ్చినా అబద్దంచెప్పరు. అవసరమైతే ప్రియురాలి కోసం దొంగతనంగాని, హత్యగాని చేస్తారట! తమ ప్రాణాలు కూడా ఇస్తారట! కాని తక్కినవాళ్ళు పచ్చిమోసగాళ్ళు- అబద్దాలకోర్లు-కనిపించకుండా జిత్తులు పన్నుతారట. కుట్రలతో, కుచ్చితాలతో ఆడవారిని నమ్మించి నాశనం చేస్తారట!"
ఇప్పుడుగాని తంబి మామూలు మనిషి కాలేదు.
ఒక తుఫానులోంచి గాఢమైన నిశ్శబ్దంలోకి వచ్చిన అనుభూతులు అతడి మనసంతా స్తబ్దుగా వుంది. ఏమీ ఆలోచించకుండా మనసు నిరాకరిస్తోంది.
"తంబీ! రక్తం దారకడుతోంది....డాక్టరుకి ఫోన్ చెయ్!"
"వద్దు...ఇప్పుడు నన్ను ఏ విధంగానూ డిస్టర్బ్ చేయకు. ఆఖరికి జానీని కూడా పిలవకు. చాలాకాలం తర్వతః మా అమ్మ గురించి ఆలోచించడానికి...మాట్లాడటానికి అవకాసం కల్పించావు. మనసెంత హాయిగా వుందో తెలుసా? అమ్మ ఒడిలో తలపెట్టుకుని పడుకున్నంత హాయిగా వుంది' అన్నాడు.
తిరిగి చెప్పడం ప్రారంభించాడు.
"కావ్యా!
ఈ హత్యలు, దోపిడీలు, లూఠీలు, దొంగతనాలు, లక్షల రూపాయలు నాకొద్దు. ఒక కనీటి చుక్కాని తుడిచే రెండు చేతులకోసం ఎదురు చూస్తున్నాను. మా అమ్మ కావలి_ నన్ను అమ్మలా ఆడుకున్న ఈ బీచ్ ని... అదిగో ఆ పడవని నేను మర్చిపోను."
"అయితే ఒకపని చెయ్_
ఇక్కడే బీచ్ రెస్టారెంట్ నిర్మించు.
మీ అమ్మగారు వస్తే ఆమె ఉండటానికి అన్ని సౌకర్యాలు వున్నా ప్యాలస్ వుండాలికదా!" అతడి బలహీనత మీద దెబ్బతీసింది.
ఆలోచనల్లో పడ్డాడు!
"తంబీ!
నాకు నీ సాయం కావలి. చేస్తావా?"
"కావ్యా!
జీవితంలో నేనొక శాపగ్రస్తుడ్ని! ఈ రక్తపు కూడుతిని బ్రతికి బట్టగాట్టాను. నీవు ఈ హత్యా వ్యాపారాలలోకి అడుగు పెట్టకు. హాయిగా పెళ్ళిజేసుకుని జీవితంలో స్థిరపడు!"
"సారీ!"
"మా నాన్నకు కొడుకునయినా కూతుర్నయినా నేనోక్కదాన్నే. అయన ఆస్తిపాస్తులకే కాదు_ పంతాలు పట్టింపులకి కూడా వారసురాల్ని"
"కావ్యా! ఈ గ్యాంగ్ వార్స్ ని త్రెంచుకుంటూ పోవాలెగాని పెంచుకుంటూ పోరాడు. అడ__మగ_ పసిపిల్లలు అని చూడకుండా నరికేస్తారు."
"మీ గ్యాంగ్ వార్ కి, మా స్టార్ట్ వార కి తేడా వుండి. ఈ దేశంలో నెం.1 బిజినెస్ మాగ్నెట్ ఎవరన్న విషయమై. పోరుసాగుతోంది. మాది రెండవతరం. మా నాన్నగారి వ్యాపారాలకి అతడు అడ్డుపడ్డాడు. అంతటితో ఆగకుండా నా దోవవకికూడా అడ్డొచ్చాడు. కాలు అడ్డం పట్టాడు. ఐతే అది నాకే లాభించింది. నలభైలక్షలు చేతికి అందింది. అతనిపై పావురుకి ఈ నలభైలక్షలే పెట్టుబడి_ ఎదురుదాడి ప్రారంభించాలి."
"ప్రత్యర్ధిని ఎన్నడూ తక్కువుగా అంచనావేయకు. అటువంటి వారికి మాత్రుల అండ ఒకవైపు, దాదాల సపోర్టు మరోవైపు వుంటుంది. ప్రత్యర్ది చరిత్ర తెలియకుండా యుద్ధం ప్రకటించగూడదు."
"అతనికి రాష్ట్ర ముఖ్యమంత్రి అండ, కేంద్రమంత్రుల సహాకారం వుండి. పోరు తప్పదు. నా శక్తి యుక్తుల మీద నమ్మకం వుంటే నాతో చేయి కలుపు. లేదా నా ప్రయత్నం నేను చేస్తాను."
"కావ్యా! నా శరీరంమీద ఎన్ని కత్తి పోట్లున్నాయో లెక్కపెట్టడం నీవల్ల కాదు. ఏ దాదా చాంబర్ కి వెళ్ళి మావుక్రావు వేవ్ట్రాన్స్ స్తారు అన్ చేసినా పోలీసులు_కస్టమ్స్ అధికార్లు వాకీటాకీలపై మాట్లాడుకునే సంభాషణలన్నీ వినిపిస్తాయి. ప్రభుత్వ నిర్ణయాలు,పోలీసు అధికార్ల తాఖీదులు ముందుగా మాకు అందుతాయి. మాచేప్పు చేతల్లో కొన్ని వేళ మంది బ్రతుకుతుంటారు. క్రిమినల్ సైకోపాల్స్ అంతా మా వారే! దేనికైనా తెగించినవారే. అరాచాకత్వపు భవంతి మాది. అందులో ఎందుకు షెల్టరు కోరుకుంటున్నావు?"
"పిరికిమందు పోయకు తంబి!
నా జీవితానికి ఓ లక్ష్యం వుండి. ఆ లక్ష్యానికి కొన్ని లక్షణాలున్నాయి. అనుకున్నది సాధిస్తాను. ఎడ్యుకేషన్ లో నా గమ్యాన్ని నేను చేరుకున్నాను."
"ఆత్మవిశ్వాసం మంచిదే. కాని అహంభావం అనర్దాదాయకం"
"తంబి__ ది కింగ్ ఆఫ్ అండర్ వరల్డ్.
తనను ఆశ్రమించిన వారిని ఆకాశంలోకి లేపి, తనను కాదన్న వారిని నిర్దాక్షిణ్యంగా నలిపేసి__ చీకటి ప్రపంచాన్ని ఏలుతున్న మహారాజా! మిన్నువిరిగి మీదపడ్డా చలించమని అందరూ అంటారు. కాని ఇంత పిరికివాణ్ణి గురించి గొప్పగా ఎలా అనుకుంటూన్నారో అర్ధం గావటంలేదు."