Previous Page Next Page 
స్టార్ వార్స్ పేజి 39

    "ఇంత అమ్మాయి అంత పెద్ద విషయాలు మాట్లాడితే సమాధానం ఆ స్థాయిలోనే బేబీ! సముద్రం మీదకి వెళ్ళిన తర్వాత  ఏ అహారమూ నీళ్ళలోకి వదలకూడదన్న విషయం కూడా తెలియని పసిదానివి నీవు. మాఫియా మారణహొమంలోకి అడుగిడతానంటే ఎలా అనుమతించమంటావు?"

    "తంబీ! ఒక దశకు చేరుకోవడానికి ప్రమాదాలను తట్టుకోకతప్పదు. ఏం.వి.అయ్య_ అధికార అనధికార ప్రముఖుల్ని  డబ్బుతో కొనేసి చట్టపు లొసుగులమీద, నిజాయితీపరుల మీదపడి కరాళనృత్యం చేస్తున్నాడు. అధికార దాహం, సుప్రిమసీ వున్నా వాడి పీచామణచేవరకు మిశ్రమించను. జీవితం ఒక లేక్కాలాంటిదయితే  నా బ్రెయిన్ ఒక కంప్యుఉతర్. ప్రత్యర్ది ప్రతి అడుగునీ జాగ్రత్తగా కలిక్యూటర్ చేస్తుంటాను. అతన్ని సాధించితీరాలి. వెళ్ళి_ మగాడు_పిల్లల్ని కనడం_ ఇవేమి కావు నా జీవిత లక్ష్యాలు."

    బొమ్మలాంటి అమ్మాయిల్నేందర్నో అంతకుముందు చూసిన_ అతడుకూడా ఓ అద్బుతమైనా వ్యక్తిని తొలిసారిగా చూస్తున్నట్టుగా చూప్శాడు. కావ్య గొప్పతనం అదే_ ఎవర్ని _ఎక్కడ, ఎలా సాధించాలో ఆమెకు బాగా తెలుసు.

    మనిషిలో వుండే అరాచాకత్వపు అధమస్థాయిని చూసిన అతడు ఆమెను ఆ ఊబిలోకి ఆహ్వానించడం మనస్కరించకున్నా తప్పలేదు. ఆమెవ్యక్తులమధ్య, గ్రూపులమధ్య వైర్యంకాదు. సుప్రిమసీ.... ఇండి విడ్యుయాలిటీకి సంభందించినది.

    తంబి మొహంలో మారుతున్న రంగుల్ని గమనించింది. కోట్లతో చీకటివ్యాపారం చేసే అతడిలో ఇప్పుడు పెద్దరికం_ దయాదాక్షిణ్యాలు లేవు. సీజన్డ్ క్రిమినల్  లా మాట్లాడాడు. "వాడ్నేవడ్నో సాధించాలి , ఏ విధంగా సాధించాలో దానివల్ల నీకొచ్చే లాభం వాడు పొందే లాభం, నేను పడేరిస్కు ముందుగా తెలియాలి. అప్పుడు నా బిల్ ఎంతో చెబుతాను" అన్నాడు.

    "ప్రత్యర్దిని ముందు మానిసికంగా  దెబ్బతీయాలి. అప్పుడు వాడు శివమైత్తిపోతాడు. దానితో ప్రారంభమవుతుంది వాడి పతనం. అతడి శిథిలాలపైనే మాన్ భవిష్యత్తుకి పునాది వేస్తాం. ఇక్కడ మర్డర్లు , దోపిడీలు, దాహానాలు వుండవు. యిక్తితో, పలుకుబడితో ఒకరి ఆధిపత్యాన్ని మరొకరు తొలగించడమే. పని పూర్తీ చెయ్యండి_ చేసిన పనికి పారితోషకం డిమాండు చేయండి."

    ఆమెలోని ఘాడ్ నేస్ అతడికి నచ్చింది.

    "ఓ.కే. ఒప్పుకుంటున్నాను. ఒక పర్యాయం నేను ఒక పని ఒప్పుకుంటే ప్రాణాలుపోతే మినహా మధ్యలో అపన."
    శూన్యంలోకి గీసిన సమాంతర రేఖల సయితం ఎక్కడో ఒక చోట ఢీ కొంటాయి.

    ఏం.వి. అయ్య_ మాదాల వెంకట్రామయ్య_ పావని తన కొడుకుని బీచ్ లో విడిచిపెట్టడానికి కారణమయిన వ్యక్తీ రాఘవయ్యా ఆస్తిపాస్తులతో ఈ రోజుకి నేం.వన్  ఇండస్ట్రీయలిస్టుగా ఎదిగిన వ్యక్తీ!

    తంబి_ తల్లి రాకకోసం ఎదురుచూస్తున్న వ్యక్తీ, తన తల్లినుంచి తనను వేరుచేసిన వ్యక్తిని_ తన తండ్రి డబ్బుతో పెద్ద ఇండస్ట్రీయలిస్టుగా ఎదిగిన వ్యక్తిని_ తన నుదుటి రాతను మార్చిన వ్యక్తిని_ తనకు తెలియకుండానే ఢీ కోనబోతున్నాడు.

    కావ్య మనసు పొరల్లో అతి సున్నితమైన చోట దెబ్బకొట్టారు. మాదాల  వెంకట్రామయ్య _షిప్పింగ్ కార్పొరేషన్స్ నిరడ్డు చేస్తూ అర్దినేన్సూ తెచ్చి ఈ విషయంలో ఆమె తీసుకునే ప్రతీ కారానికి లాజిక్ లేదు. బలమైన తోడుకోసం 'తంబి' సహాయాన్ని కోరింది. అతడు అంగీకరించడంతో ఆమె పొందిన అగ్జయిట్ మెంట్ ఆమె ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది.
 
    "తంబి! ఈ క్షణాన నాకు నేను సాదించదలుచుకున్నదాన్లో  సాధించినట్లుంది నీ యిష్టం తీపి గుర్తుగా ఏం కావాలోచెప్పు" అనడిగింది.

    ఎప్పుడు కరేస్తీగా నవ్వాలో అతడికి బాగా తెలుసు.

    "నువ్వులాటకాదు... నిజంగానే అడుగు"

    "కావ్యా! నేను అయిదవ ఏట_ అంటే నేను ఫస్ట్ క్లాస్ చదువుతున్నప్పుడు జరిగిందది. అది కాన్వెంటు క్రిష్టియన్ ఫాదర్ నా క్లాస్ టీచరు. అయన ఓ రోజున ఏసు ప్రభువు మీకు కనిపించి 'ఏం కావాలి' అనడిగితే ఏమని కోరుకుంటారు? అనడిగారు. కొందరుస్వీట్లు, మరికొందరు చక్కటి డ్రెస్, ఇంకొందరు డబ్బులు అలా రకరకాలుగా అడిగారు..." అని చెబుతున్న తంబిత్రుటికాలంపాటు  ఆగిపోవడంతో, "మరి నీకేమని అడిగావు" అనడిగింది కావ్య.

    "చాలా పెద్ద పొరపాటు చేహ్సాను. 'ప్రభూ నీవే కావలి' అనడుగుతా" అని చెప్పాను.

    "గుడ్... చక్కగా చెప్పావు"

    "లేదు. ఎంత పొరపాటు చేశానో ఇప్పుడర్డమవుతోంది..."

    "అదేం..."

    "ప్రభూ! నాకు మా అమ్మకవాలి అని అడిగి వుండాల్సింది."

    కావ్య మనసు గతుక్కుమంది.
   
                              *    *    *    *
   
    ప్రతికారంగం ఎద్దువుండు లాంటిది. ఎద్దుకి పుండు పడితే పెరగడమేగాని తగ్గటమంటూ వుండదు. అలాగే పత్రికలవారు ఒక విషయాన్ని పట్టుకుంటే దాన్ని పీకి పాకాన పెట్టెవరకు నిద్రపోరు. ఒక పత్రికనగరంలోని కమ్యునికేషన్స్ పరిస్థితిపై సమగ్ర సమాచారాన్ని అందించటంతో మిగిలిన పత్రికల్ని రంగప్రవేశం చేశాయి. నగరంలో ట్రాపిక్_ఒక ప్రాతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళడానికి ఎంత వ్యవధి పడుతుంది_ సగటు వ్యక్తీ రోజుకి ఎన్నిగంటలు సిటీబస్ ప్రయాణంలో వృధా చేస్తున్నాడు._ రోడ్డు విశాలంగా లేకపోవడం వలన రాకపోకలు ఏ విధంగా స్తంభించిపోతున్నది_ ట్రాఫిక్ కంట్రోలు చేయటంలో పోలీసుల వైఫల్యాన్ని  ఒక పత్రిక నిర్మానత్మంగా గణాంకాలతో విమర్శించింది. దీనికి రోడ్లు, భావనల శాఖా మరుసటి రోజున పత్రికా సమావేశాన్ని ఏర్పాటుచేసి నగరంలో పెరుగుతున్న జనాభా_ క్రొత్తగా స్థాపిస్తున్న పరిశ్రమలు_ అధిక మవుతున్న వాహనలసంఖ్య_ పరిసర ప్రాంతాల నుంచి రాజధానికి తరలిస్తున్న ప్రజా నీకం వివరాలను అందిస్తూ పట్టణంలో  ట్రాఫిక్ జాం తొలగి పోవాలన్నా, రోడ్డు ప్రమాదాలు తొలగి పోవాలన్నా రోడ్లను విశాలం చేయవలసిన ఆవశ్యకత, అందులోని ప్రతి బంధకాలను సహేతుకంగా వివరించారు.

 Previous Page Next Page