Previous Page Next Page 
స్టార్ వార్స్ పేజి 37

    స్కాచ్ విస్కీ బాటిల్స్ కేస్ అతడి ఎదురుగా వుండి. రెండు చేతులతో బాటిల్స్ తీసి ఎదురుగానున్న గోడకేసి పగులగోడ్తున్నాడు. బ్యాండేజీ వేసిన గాయాలనుంచి దారకడుతోంది. ఆ క్షణాన కోపంతో జేవురించిన అతడి ముఖాన్ని ఏ గర్బిణీ అయినా చూసి వుంటే అబార్షన్ కావడం ఖాయం! మల్టిపుల్ ఫాక్చార్లతో, తడిసిన రక్తం వంటి మీద ప్రవహిస్తుండగా అతడు అన్నది ఒకటే మాట__

    "నేను కొజ్జా....!?"

    అతడ్ని అ స్థితిలో చూసిన ఆమె విద్యుద్ఘాతం తగిలినదానిలా నిశ్శేష్టురాలాయి అలాగే చూస్తూ వుండి పోయింది. మనసు నిశాంత శరాఘాత అవశేషమైంది. శరీరం మంచులో పెట్టినట్టు చల్లగా అయిపోయింది.

    అతడి గుండెల్లో జలపాతం హొరు, మెదడులో అగ్ని పర్వత విస్పోటనం!

    మృత్యువుకి ప్రతిరూపంలా అతడ్ని అంత సమీపంనుంచి చూడలేక కళ్ళు మూసుకుంది.

    ఒక్కసారిగా ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఆవరించింది.

    తంబి పిడికిళ్ళు బిగుసుకున్నాయి కోపంతో, కసితో అతడి రక్తం ఉడుకిపోతోంది. ఒక రకమైనా పిచ్చితనంతో అతడి చేతులు వణికి పోతున్నాయి. శరీరంలో ఒక్కసారిగా రక్తప్రసరణ_రక్త స్రవం హెచ్చింది.

    "నేను కొజ్జా!?" పలకరిస్తున్నట్టు మరోమారు అన్నాడు.

    ఆకాశం బద్దలయితే వినిపించే శబ్దంలా వుండి. అతడి సర్వం అతడి కళ్ళలోకిరక్తం పాకింది. కాటేసే ముందు తాచుపాము చూసినట్లు  చూస్తున్నడతాను.

    ఆమె మోహంమీద చెమట జుట్టులోంచి ధారాపాతంగా కారుతోంది. మృత్యువు ఎదురుగా నిలబడినట్టుంది.

    కొన్ని ఫీలింగ్స్ లాజిక్ వుండదు... నిర్వికార, నిరామయావస్థలోకి క్రమక్రమంగా జారిపోసాగిందామె. నిశ్శబ్డం లోనే ఆమె ఆలోచనలు ఒక రూపు దిద్దుకున్నాయి. అతడి కళ్ళలో కోపంకన్నా అతీతమయిన భవాన్ని గ్రహించింది. అతడి కళ్ళలో ముఖంలోకి చూస్తూ వుండిపోయింది.

    అతడు శారీరకంగా గాయపడ్డా_ ఆర్దికంగా నష్టపడ్డా తట్టుకోగలిగే వాడేమోనని, ఓ ఆడపిల్ల అతడి 'ఈగో' ని హార్ట్ చేయడంతో డైజెస్ట్ చేసుకోలేకపోయాడు.

    "కావ్యా..." పేరుకున్న నిశ్శబ్దంలో అతడి మాట బాంబుల పేలింది.

    "సెంటి మేమ్తుకి, అర్ధరాత్రికి తావులేనిచోట బ్రతుకుతున్నాను. జీవస్మరణాల మధ్య తూనీగలా పరుగెడుతున్నాను. జీవితపు ఆవేదన ఆహ్నందం ఈ సముద్రపు అటుపోట్ల మధ్య పెరిగాను.

    'పెంచుకుంటే పెరిగేది మమత ఒక్కటే_

    పెంచుకుంటే తరిగేది బాధ ఒక్కటే_

    మచుకున్నా పెంచుకున్నా మిగిలేది జ్ఞాపకం ఒక్కటే_'

    నా అయిదోయేట ఓ సాయత్రం నన్ను ఇదే బీచ్ కి తీసుకొచ్చింది. నాకు వాటర్ తో ఆడుకోవడం అంటే మహసరదా! చిన్న తనంలోనే నేను ఈ సముద్రం ఒడ్డున ఆడుకుంటూ మా అమ్మ విషయమే మర్చిపోయాను  చీకటిపడింది. అప్పుడు అమ్మ గుర్తుకొచ్చింది. ఈ బీచ్ అంతా 'అమ్మా' అంటూ అమ్మకోసం వెదుక్కుంటూ ఏడుస్తూ తిరిగాను. అలా ఒకటిరెండు రోజులు కాదు. వారాలు... నెలలు... సంవత్సరాలు.

    "ఈ బీచ్ కి ఒంటరిగా వచ్చే_ తెచ్చే అడవాల్లా భవిష్యత్తు ఏమిటో కళ్ళారా చూస్తున్నాను. ఒక శ్రీ ని యిద్దరు... ముగ్గురు... పదిమంది మగవాళ్ళు పంచుకుని ఈ ఇసుకలో పాతిక పెట్టిన సంఘటనలు ఎన్నెన్నో చూశాను. ఫారిన్ శిఫ్స్ కేప్తేన్స్ కి అమ్మాయిల్ని సరఫరా చేస్తుంటారు. అలా వెళ్ళే వారిలో కొందరు సముద్రం పలయ్యేవారు. మరి కొందరు సుఖ వ్యాధులతో దిక్కుతోచని కుక్కచావు చచ్చేవారు. బలవంతాన వ్యభిచారంలోకి దిగినవారు_ భర్తలే తర్పాడు గాళ్ళుగా మారిన వారి భార్యలు, మోసంచేసి తీసుకొచ్చి ఈ వృత్తిలోకి దిమ్పబడిన వారు_ తొలి దినాల్లో సరదాగా ఈ వ్యాపారంలోకి దిగిన వరు... ఇలా ఏమ్దరేమ్ద్రావు ఈ వ్రుత్తిలోకి రాబడ్డారు నేను కూడా తొలిదినాల్లో ఆడవాళ్ళతో స్నేహం చేశాను. వ్యాపారం చేశాను... అదే చీకట్లో... కొందరి మోహాలు కూడా చూడకుండా పడుకుని వచ్చేవాడ్ని.

    "కాని... ఒక రోజున  ఎందుకొచ్చిందో ఓ ఆలోచన వచ్చింది. బీచ్ లో మాయమయిన ణ తల్లి_ నా తల్లిని ఎవరైనా బలవంతంగా తీసికెళ్ళి వుండవచ్చు... ఈ వ్యాపారంలోకి బలవంతాన దింపివుండవచ్చు. ఆ ఆలోచన కూడా భరించలేకపోయాను ఆ రోజునుంచి చీకట్లో ఏ స్రీని చూసిన మా అమ్మ ఏమావునన్న అనుమానం_ చేకట్లో ఆడవాళ్ళని పిష్ దగ్గరకి తీసుకేళుతుంటే వారిలో మా అమ్మ కనిపిస్తోంది. అందుకే నాకుగా నేను ఏ స్రీ వైపు ఆ దృష్టితో చూడలేకపోతున్నాను. చూస్తుండగా ఏ స్రీ ఆపనికి పూనుకున్నా సహించలేక పోతున్నాను. నాకిపుఉడు అదొక పావుబియాగా తయారయింది దాదాగా నా ప్రాబల్యం పెరుగుతున్న కొద్దీ ఆడవాళ్ళపై  నేను చూస్తుండగా ఏ ఒక్కరూ అత్యాచారం తలపెట్టడంలేదు. బహుశ నా పరోక్షంలో నా గురించి వారలా మాట్లాడుకుంటూ వుండొచ్చు."

     "తంబీ! ఆవేశపడనంటే నేనొకమాట చెప్పానా?"

    "కావ్య! స్పందన, ఆవేశంలేనివాడు మనిషి కాదు. ఫ్రేమపరిపూర్ణతతో కన్నా సంస్మరణలోనే పరిపూర్ణత చెందుతుంది. అనందం...విషాదం... ఆవేశం మనిషి జిఇవితంలో సహజం. నీవు చెప్పవలసింది చెప్పు. వినడం ణ కర్తవ్యం గనుక వింటాను."

    "క్షణ క్షణం మృత్యువుతో ఈ బ్రతుకు బ్రతకడం దేనికి? నాతోపాటు సిటీకి వచ్చీ..."

    "ప్రతి దాదా చేసేపని ఇదే_ నేను మినహా"

    "అదేం...."

 Previous Page Next Page