Previous Page Next Page 
అమ్మో! అమ్మాయిలు పేజి 36

    " ఏ మర్ధమయింది? ఆ రాకుమారి ఎంతసేపు వణికింది చెప్పొద్దేమిటి?"

    " గంట వణికిందని చెప్పండి. లేకపోతే రెండు గంట లొణికిందని చెప్పండి.

    అంతేగాని గజ గజ గిజ గిజ  అంటూ అంతసేపూ మి రొణికితే మేం భరించలేం" కచ్చితంగా చెప్పేసింది జయచిత్ర.

    " సరే, హిమబిందు ఓ అయిదు నిమిషాలొణికి ఆ తర్వాత ధైర్యం తెచ్చుకుని " ఎవడవు నీవు? దుర్మార్గుడా ఏ దుష్ట తలంపుతో నన్నిచ్చటికి తెచ్చితివి?" అంది.

    రాక్షసుడు వికటాట్ట హాసంచేసి, " ఓహో! అందాల చినదానా! ఏమి నీ పలుకులు! ఎంత మధురంబుగ నున్నవి? నీ మోము చూడకడు దివ్యంబున నుంది.

    సుందరీ! నీ పొందు కూడని నా జన్మ ఎలా రమ్ము. ఒక పర్యాయంబు చాలు. నా కౌగిలిలో వచ్చి వాలుము. భయమేలనే బేలా!"

    " ఐడెమ్ బాష! గ్రాంధికమా? సంస్వతమా? రాక్షసమా?" అంది జయచిత్ర.

    " అవునూ! రాజకుమారి ఆకారం ఆరడుగుంటే రాక్షసుడి ఆకారం పెద్ద కొండంత వుంది కదా?

    వీళ్ళిద్దరూ ఎలా కౌగిలించుకుంటారు. ఇంపాజిబుల్ " ఆవేశంగా అని ఆపై బోలెడు సిగ్గుపడింది బిందురేఖ.

    " ఎట్టాగోఅట్టా. కధ కానీండి" అంది జయచిత్ర.

    " ఇంతలో రాక్షసుడిని ఎవరో పిలవటం వల్ల రాజ కుమారిని గదిలోపెట్టి తాళం వేసి వెళ్ళిపోయాడు.

    ఈ కధ ఇక్కడ యిలా వుంటే అక్కడ అవంతీపురంలో కానక రాజు బెంబేలుపడి యిలా ప్రకటించాడు.

    " మా హిమబిందుఉని ఎవరైతే సురక్షితంగా తిసుకొచ్చి మా కప్పగిస్తారో వారిని నా అల్లుడిగా చేసుకునేదేగాక నా అర్ధరాజ్యం యిస్తానొహో " అని నలువైలా చాటింపు వేయించాడు.

    ఆ చాటింపు విన్న విక్రమపురం రాజకుమారుడు విజయకేతుడు ముందుకొచ్చి రాజకుమారిని తాను తస్తానని చెప్పి బయలు దేరాడు...

    " అవునూ, నాకో అనుమానం. రాజకుమారి గుంటూరులో వుందో తెలియదు, గూడూరులో వుందో తెలియదు, ఏ గుహలో వుందో తెలియదు. ఇతగాడు ఏ ధైర్యంతో తగుదునమ్మా అని బయలుదేరాడు" అంది జయచిత్ర.

" ఇట్లా అయితే నే కధ [పూర్తిచేయను. చేయనుగాక చేయను" అని అబ్బులు భీష్మించుకుని కూర్చున్నాడు.

    " ఎట్టాగోఅట్టా వింటాం. ఎట్టాగోఅట్టా పూర్తిచేయండి" అంది జయచిత్ర.

    " బ్రతిమిలాడుతున్నారు పాపం సాంతం కధ చెప్పేయమ్మా అబ్బూ! అన్నాడు వ్యాకర్ణ.

    " సరే చెపుతాను. కధ మధ్యలో నోరు మెదపరాడు" అన్నాడు అబ్బులు.

    " కధంతా పూర్తిగా వీని మా అనుమానాలు తీర్చుకుంటాం అభ్యంతరమాండి?" అంది బిందురేఖ.

    " లేదండి."

    " సరే, ఎట్టాగోఅత్తా తొందరగా కధ కానీండి."

    " ఆ తర్వాతేం జరిగిందంటే...!" అంటూ మొదలు పెట్టి అరగంటలో మొత్తం కధ చెప్పేశాడు అబ్బులు. చెప్పి... " కదేట్లవుంది?" అని అడిగాడు.

    " నా ముఖంలా వుంది" అంది బిందురేఖ

    " అబ్బో! అయితే నా కధ చాలా చాలా చాగుందన్నమాట!"

    " అచ్చం రాజకుమార్తెలా వుంది" అన్నాడు అబ్బులు.

    " ఛీ... ఆ సొగరాలు కట్టేదానితో నన్ను పోల్చకండి" అంది బిందురేఖ.

    వ్యాకరణ పైకే నవ్వేశాడు. " రాజకుమార్తెకు మా మంచి పేరు తగిలించారు" అన్నాడు.

    అబ్బులికి కోపం వచ్చింది. తమాయించుకున్నాడు.

 Previous Page Next Page