Previous Page Next Page 
సక్స్ స్ పేజి 34



    లోనకోస్తున్న తండ్రిని చూసి ఊపిరి తీసుకున్నాడు,

    "మీ కోసం రోడ్లన్ని వెతికి, వెతికి ఇప్పడే వచ్చాను...." తండ్రి చేతిలో బ్రీఫ్  కేసు  లేకపోవడాన్ని గమనిస్తూ అన్నాడు తేజ.

    "బ్రీఫ్ కేసు ఏమ్తెంది డాడి...." గాభరాగా అడిగాడు తేజ మళ్ళి.

    "నన్ను కిడ్నాఫ్ చేసింది..... అందుకేగా.... బ్రీఫ్ కేస్  తీసుకుని..... వదిలేసారు...." లోనకోస్తూ చెప్పాడు సూర్యసాగర్ నవ్వుతూ. పోలీసాఫీసర్ కావటంతో తండ్రి నవ్వగానే విషయాన్నీ  అర్ధం చేసుకున్నాడు  తేజ, ఫేక్  డాక్యుమెంట్స్ తో  వచ్చారన్నమాట ....మరి ఒరిజల్స్....?!

    "మిమ్మల్నేం ఇబ్బంది పెట్టలేదు గదా?"

    "లేదు....పెట్టలేదు....ఎర్లీమార్నింగ్ ....మనం ముక్తదగ్గర కెళ్దాం రెస్టు తీసుకో...." లేచి, తన బెడ్ రూమ్ లో కెళ్తూ అన్నాడాయన.

    తండ్రి పరిస్ధితికి జాలేసింది.

    తేజకు ఆ రాత్రిచాలా సేపు నిద్రపట్టలేదు.

                     *              *               *

    బెంగుళూరు రోడ్ లోని కె.కె, నగర్ ఏరియా.

    లాడ్జి హృదయ్ లోని____

    రూం నెం. 116.

    ఉదయం  సరిగ్గా తొమ్మిది గంటల్తెంది.

    డబుల్ కాట్ మంచమ్మిద కూర్చున్నారు సూర్యసాగర్.

    చెక్  మీద సంతకం పెట్టించడానికి, అర్ధరాత్రి వచ్చిన పుష్పక్  విషయం చెప్పింది ముక్త.

    ఎయిర్ పోర్ట్ నుంచి వస్తున్నపుడు - తండ్రి  మీద జరిగిన  దాడి గురించి, బ్రీఫ్ కేసుని ఎత్తికెళ్ళిపోయిన విషయం గురించి చెప్పాడు తేజ.

    "డాడి రాసిన వీలునామా...." ఏదో  ప్రశ్న  వెయ్యబోయింది ముక్త.

    "నేను బతికున్నంతవరకూ గెలుపు నాదేనమ్మా..... మీ డాడి నాకు ప్రెండే కాదు.....ఆత్మబంధువు.....నేనివాళ ఈ స్ధానంలో ఉన్నానంటే....దానిక్కారణం హరికృష్ణ నువ్వేం బెంగాపడకు నాయుడు ఆస్తికి నిన్ను వారసురాల్ని చేయందే నాకు నిద్రపట్టాదు." ఆ మాట సూర్యసాగర్ గొంతులోంచి మామూలుగానే వచ్చినా, ఆ గొంతు  వెనకున్న కఠోర దీక్షా  పటిమ గురించి తేజకు బాగా  తెలుసు.

    "తేజా....నువ్విప్పుడు అర్జంటుగా మన గెస్టుహౌస్ కెళ్ళు.... కాసేపట్లో నా పేరు మీద ఒక పార్సిల్ వస్తుంది.....తీసుకురా...." అన్నాడు సూర్యసాగర్.

    వెంటనే ఆ లాడ్జిలోంచి బయటికొచ్చాడు తేజ.

    సరిగ్గా గంట తర్వాత చేతిలో ఓ పార్శిల్ తో, రూమ్ లోకి అడుగు పెట్టాడు సూర్యతేజ.

    దాన్ని అందుకుని, ఆనందంగా చూసాడు ముక్త వేపు సూర్యసాగర్.

    ముక్తకు ఏవి అర్ధం కాలేదు.

    కొరియర్ సర్విస్  లో తనే డిల్లినుంచి, మద్రాసులో తన అడ్రసుకి పంపిన పార్సిల్ అది.

    "ప్రమాదాన్ని ముందే ఊహించాను. అందుకే మీ తండ్రి రాసిన డైరిల్ని, వీలునామాను....కొరియర్ సర్విస్ లో పార్సిల్ చేసాను. ఫేక్ డ్తెరిల్ని, డాక్యుమెంట్స్ ని సృష్టించి, నా బ్రీఫ్ కేసులో పెట్టుకున్నాను. నాకు తెలుసు వాళ్ళు నన్ను ఎటాక్  చేస్తారని.

    ఇదిగోనమ్మా.....ఇవి .....సినలైన... డైరిలు....ఈ  డైరిల్ని చదివిన మీదట....మీ తండ్రి విలునామారాసిన విషయం నాకు తెల్సింది. మీ తండ్రి, ముందు చూపు చాలా  గొప్పదమ్మా. తను పారిశ్రామిక వేత్తగా  ఉన్నంతకాలం....తన వీలునామా గురించి, ముఖ్యమైన  వాళ్ళతో చర్చించాడే తప్పు, రాయలేదు ఎప్పడ్తెతే.....పాలిటిక్స్ లోకి ప్రవేశించాడో ఆయన మొట్ట మొదట చేసిన పని....వీలునామా  రాయడం, రాజకీయాల్లోకి ఆయన రావడం, గెలవడం, అంతా  మహా ప్రభంజన వేగంతో జరిగి పోయింది. రాజకీయంలో మొదటిభాగం....ప్రజల్లోకి వెళ్ళడం....రెండో భాగం....ప్రజల్ని మెప్పించడం....మూడో భాగం....ప్రజల మనిషిగా నిలవడం ....ఈ మూడు ప్రమాదకరమైనవె. బిజీనెస్  లైన్లో ని శత్రువులే కాకుండా, రాజకీయంలో ఇంకా అదనంగా శత్రువులు  తయారౌతారు, తయారయ్యారు కూడా. అందుకే....ఆయన జాగ్రత్త పడ్డాడు." అని చెప్పి డైరిల్ని ఆమె చేతి కందిచ్చి__

    "ఇవి  చదువు....మీ  డాడి ఎంత గోప్స వ్యక్తో నీకు తెలుస్తుంది."

    అన్నాడు సూర్యసాగర్  రిలాక్స్ గా బాత్ రూమ్ లోకేళ్తూ-

               *                     *                       *

    "ఒరిజనల్ డాక్యుమెంట్స్-డైరిలు తన అడ్రస్ కి తనే పోస్ట్ చేసుకొని- ఫేక్ వాటితో మద్రాసులో దిగారా...." ఆశ్చర్యపోతూ అంది ముక్తనంద.

    "డాడిది లాయర్ జ్రేయిన్ -పాజిబిలిటి ఆఫ్ కైమ్ ని సరిగ్గా అంచనా వేసే అలా చేసారు" అన్నాడు తేజ.

    "మరి ఫేక్ ని ఎందుకు సృష్టించటం?" తిరిగి అడిగింది ముక్తా.

    "ఫేక్ వీ లేకపోతే , ఎటాక్  చేసిన మరుక్షణం అవి లేనని  తెలిసి పోయి తనని బంధించి హింసించే ప్రమాదం ఉంది. ఫేక్ పని మీ అన్న మాత్రమే తెల్సుకోగలడు. మీ అన్న ఎలాగూ  సిన్ లోకి రాడు___తన చేంచాల్ని ఉపయోగిస్తాడు. వాళ్ళు  తెలుసుకాలేరు గదా  ఫేక్ వని, దొరగ్గానే పనయిందని మా నాన్నగార్ని వదిలేస్తారు. వాళ్లవి ఫేక్ అని తెలుసుకొనే  లోపు కొంత టైమ్ పడుతుంది. ఆ టైమ్ని తన మాద్రాస్ ఆడ్రస్ కి వచ్చే  ఒరిజినత్స్ ని చేజిక్కించుకొనేందుకు ఉపయోగించుకోవచ్చుని అలా చేసుంటారు....." అన్నాడు ప్రమాదపు సాంద్రతని లేఖ్ఖేసుకుంటూ తేజ.

    ముక్త ఎందుకో ఒక్కక్షణం భయపడింది. ఎదురుగా కనిపిస్తున్న తేజని చూసి__వెనుక ఉండి నడిపిస్తున్న సూర్యసాగర్ ని తలుచుని దైర్యాన్ని ప్రోది చేసుకుంది వెంటనే.

                 *            *           *

 Previous Page Next Page