Previous Page Next Page 
సక్స్ స్ పేజి 33



    ముక్తకు సంబంధించిన అతి ప్రధానమైన, హరికృష్ణమనాయుడుగారు వ్రాసిన వీలునామాను, ఆయనొక్కడే పట్టుకురావడం ఆశ్చర్యంగా ఉంది తేజకు.

    తను సమయానికి మద్రాసులో ఉన్నాడు. లేకపోతే....

    ఎయిర్ పోర్ట్ అవుట్ గేటులోంచి బయటికొచ్చి, మెట్లమీద నిలబడ్డారిద్దరూ.

    "ఏయ్ ....టాక్సి...." పిలిచాడు తేజ.

    టాక్సి వచ్చి ఆగింది.

    చేతిలోని బ్రీఫ్ కేసుతో, కారు డోరు తెరచి బెక్  సీట్లో కూర్చున్నారు సూర్యసాగర్.

    టాక్సికి, సూర్యతేజకు మధ్య ఓ ఆటో అడ్డుగా వచ్చింది సడన్ గా. అంతలోనే టాక్సి  స్పీడుగా  ముందుకెళ్ళిపోయింది.

    "ఏయ్.... డ్తె వర్....స్టాఫ్ ది టాక్సి...." గట్టిగా  అరిచాడు సూర్యసాగర్. అప్పటికే టాక్సి ....మెరుపువేగంతో వాహనాల్ని తప్పించుకుని, రోడ్డుమీద కెళ్ళిపోయింది.

    మళ్ళి అరవబోయి ఆగిపోయడాయన.

    డ్తెవర్ కి ఎడం పక్కన, అంతవరకూ కన్పించకుండా కూర్చున్నపుష్పక్ .....చేతిలోని రివాల్వర్ ను, సూటిగా సూర్యసాగర్  వేపు గురిపెట్టి చూపిస్తూ__

    "మిస్టర్....సాగర్ ....అరిచావో ....అదే ని ఆఖరి కేకవుతుంది. గుర్తుంచుకో...." భికంరం ఉంది పుష్పక్  గొంతు. ఆ సమయంలో అతను  ఆ టాక్సిలోని సూర్య సాగర్ ని చంపడానికి సిద్దంగా ఉన్నాడు. ఆ విషయం అర్ధమైంది సూర్యసాగర్ కి.

    ఏం జరిగిందో తెల్సుకోడానికి తేజకు కొద్ది క్షణాలు పట్టింది___ అంతే- ప్రమాదాన్ని శంకించాడు.

    అప్పడే అక్కడకొచ్చిన మరో టాక్సి ఎక్కాడు తేజ.

    "క్విక్ ....అర్జుంటుగా పోనీ...." అన్నాడు ఆందోళనగా.

  డైతెవర్ టాక్సిని ముందుకు దూకించాడు.

                         *            *              *

    మీనంబాకం ఎయిర్ పోర్ట్ నుంచి, సిటికి వెళ్ళటానికి రెండు దార్లున్నాయి.

    రెండవ దారిలో తక్కువ ట్రాఫిక్ ఉంటుంది.

    ఆ దారిలో వందమైళ్ళ వేగంతో కారు పోతోంది. వెనక్కి, ముందుకి చూస్తున్నాడు పుష్పక్.

     ఎక్కడ్తె నా, తేజ తనను అనుసరిస్తున్నాడేమోనని.....

    తమ కారుని  ఎవరూ అనుసరించడం లేదని, తెలియడంతో కారుని రోడ్డు పక్కన స్లో చేయించాడు.

    "మిషర్ .... సూర్యసాగర్ .....మీ చేతిలో బ్రీఫ్ కేసిచ్చేస్తే....ప్రాణాలతో బయటపడతారు. లేకపోతే  మీ శవం నడిరోడ్డు మీదుంటుంది______"

    ఏం చెయ్యాలో తోచలేదు సూర్యసాగర్ కి.

    ఒక్క క్షణం ఆలోచనలో పడ్డాడు_____విధి లేక.

    తన పక్కనే ఉన్న బ్రీఫ్ కేస్ ను తిసి, పుష్పక్ కి అందించాడు.

    పుష్పక్ తను సాధించిన దిగ్విజయానికి గుర్తుగా నవ్వి___

    బ్రీఫ్ కేస్  ఓపెన్  చేసి, అందులో ఉన్న డ్తెరిల్ని డాక్యుమెంట్స్ ని  చూసుకున్నాక సూర్యసాగర్ వేపు తిరిగి___

    "బతికిపోయావ్.... లాయర్..... నౌ ఐ యామ్ వెరి హేపీ ....కొడుకుని రప్పించుకుని, కొన్ని జాగ్రత్తలు తీసుకున్నావ్ ....కానీ ....డోన్ద  వర్రి  తెలివితేటలున్నా.....లుక్ ఫేవర్ చెయ్యకపోతే .....ఇలాగే ఉంటుంది పరిస్ధితి. ఎక్కడ డ్రాఫ్ చేయ్యమంటారో చెప్పండి.... డ్రాప్ చేసి వెళ్తాం...." అన్నాడు  పుష్పక్ .

    "పాండి బజార్లో డ్రస్ చెయ్యి....." అన్నాడు సూర్య సాగర్ హిన స్వరంతో.

    టాక్సి.... మరో ఇరవై నిమిషాల తర్వాత పాండి బజార్ బస్టాపులో ఆగింది.

    సూర్యసాగర్ టాక్సి లోంచి దిగిన మరుక్షణం, కారు రివ్వున ముందుకెళ్ళిపోయింది.

                      *               *             *

    పెద్ద పెద్ద అంగల్తో, లోనికోచ్చాడు పుష్పక్ చేతిలో  బ్రీఫ్ కేస్ తో.

    అప్సటికే అక్కడ_____

    రవిచంద్ర, రఘునాద్ , అరవిందరావు, అనిమిష, పుష్పక్ కోసం ఎదురు చూస్తున్నారు.

    రవిచంద్ర పరుగున ముందుకెళ్ళి, పుష్పక్ చేతిలోని బ్రీఫ్ కేసుని లాక్కుని  ఆత్రంగా  తెరిచాడు.

    రెండుపైల్స్ , రెండు డైరి లు  కనిపించాయి_ వాటిని తిసి, టిపాయి మీద పెట్టి__

    ఒకపైలు ని ఓపెన్  చేసాడు.

    కొన్ని టైపు చేసిన కాగితాలు....కింద హరికృష్ణమనాయుడు సంతకం.

    చాచి, చంపమీద ఎవరో కొట్టినట్టయింది___

    "యూ బాస్టర్డ్...." పిచ్చి  పట్టిన వాడిలా అరిచాడు  రవిచంద్ర.

    "వీటిలో డాక్యుమెంట్స్ .....ఒరిజినల్ కాదు....విటికింద....డాడి సిగ్నేచర్ ఒరిజనల్ కాదు....డైరిల్లోని రాత.... డాడిది కాదు.... పేక్.." అరిచాడు.

    అపహనంగా అరిచి, ఆ పైల్స్ ని చింపి ముక్కలు చేసేసాడు. నిస్సహాయంగా సోఫా మీద కూలబడి పోయాడు.

    అక్కడున్న మిగతా నలుగురూ షాక్  తిన్నారు.

                         *            *             *
   
    గెస్ట్ హౌస్ ముందు  ఆందోళనగా పచార్లు చేస్తున్న సూర్య తేజ, గేటు  ముందు  ఆగిన ఆటోని చూసి, పరుగు, పరుగున ముందుకు వచ్చాడు ఆటో పెత్ చెల్లించి___      

 Previous Page Next Page