"వీలునామాను కోర్టులో సబ్ మిట్ చేయాలి అప్పడే మన పధకం పూర్తిగా నెరవేరినట్లు రేపు శనివారం, ఎల్లుండు ఆదివారం, సోమవారం వరకూ మనమేమీ చెయ్యలేం సబ్ మిషన్ పూర్తయిన అనంతరం నాయుడు ఎస్టేట్స్ ని అధికారంగా నువ్వు స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుంది.....సోమవారం వరకూ మనం ఎక్కడున్నామో వాళ్ళకు తెలీకుండా జాగ్రత్తపడాలి. ఫేక్ డయాక్ మెంట్ల విషయం తెలిగానే, మీ అన్న రెచ్చిపోతాడు. ఈ పాటికి హంటింగ్ మొదల్తే ఉంటుంది, ఈ టైమ్లో వాళ్ళు ఎంత క్తేనా, తెగించడానికి రెడిగా ఉంటారు. మనం ఇక్కడనుంచి బయటపడడం మంచిది....సూర్యసాగర్ చెప్పాడు ఆలోచనగా.
"ఎక్కడకెళ్దాం...." ప్రశ్నించింది ముక్తనంద. సూర్యసాగార్లో అంత కంగారుని ఎప్పడూ చూడలేదు ముక్త-ఏ సమయంలోనూ,ఏ మాత్రం తొణకని, తన తండ్రి ఈ విషయంలో ఎందుకంత బెంబేలు పడుతున్నాడో సూర్యతేజకు కూడా అర్ధం కావడంలేదు, అదే అన్నాడు సూర్యతేజ.
"మీరిద్దరూ....ఇన్నాళ్ళూ ఎక్కడో దూరంగా ఉన్నవాళ్ళూ బిజినెస్ లోని పాలిటిక్స్ మీకు తెలివు, ఈ విషయాల్ని నిశితంగా ఆలోచించే దూర దృష్టికూడా మీకులేదు మికుగాని, నాకుగాని ప్రస్తుతమున్న పరిస్ధితుల్లో ఎవరిక్తేనా కన్పించే శత్రువు రవిచంద్ర. కన్పించే శత్రువుని ఎదుర్కోవడం సులభం. కానీ నాయుడు ఎస్టేట్స్ వ్యవహారాల్ని చూస్తే .....మీ డాడి హరికృష్ణమనయుడు మర్డర్ ని చూస్త్వే కన్పించాకండా బాలమ్తెన శత్రువులున్నారని తెలుస్తోంది. హు ఆర్ దే? ఆర్ దే పొలిటికల్ ఎనిమిస్, ఆర్ .... పర్సనల్ ఎనిమిస్ బిజినెస్ ఎనిమిస్ ఇది సాల్వ్ చెయ్యాల్సిన ప్రాబ్లమ్ మన ఎదురుగా ఉన్న సవాల్ దిన్ని ఎలా పరిష్కరిస్తావో, ని తెలివితేటల మీద ఆధారపడి ఉంది." ఒక్కొక్క మాటను, ఆచి, తూచి, అమ్తున్నట్టుగా అన్నాడు సూర్యసాగర్.
తండ్రి మర్డర్ మాట వినగానే ఆలోచల్లో పడింది ముక్త.
నిలువెల్లా రక్తం పొంగినట్టుగా అయిపోయిందామెకు. ఆప్యాయంగా స్పర్శించే తండ్రి చేతులు, కఠోర శాసనంలా కన్పించే తండ్రి కళ్ళు....ఆ కళ్ళ వెనక కన్పించే తనమీద పెంచుకున్న ఆశ___
గుర్తుకొచ్చి, క్షణకాలం చలించి పోయింది ముక్త.
"నువ్వులివ్ లో ఉన్నావా...." కొడుకువేపు తిరిగి అడిగాడు సూర్యసాగర్.
"అవును...."చెప్పాడు సూర్యతేజ.
"లివ్ ఎక్స్ టెం చెయ్యి....ఫోన్ చేసి చెప్పు....ముక్తని కంటికి రెప్పలా కాపాడాల్సిన బాధ్యత నిదే....ముక్త, కంపెని టేకోవర్ చేసుకున్నాక నువ్వెళ్ళు...."
అంగీకారంగా ఆ మాటకు తలూపాడు సూర్యతేజ - నిజానికి అతని మనస్సులోనూ అదే ఉద్దేశ్యం ఉంది.
లేచి, ఎవరికో ఫోన్ చేసి____
"మహాబలిపురం రోడ్ లో ఓ ప్రెండ్ గెస్ట్ హౌస్ ఉంది. ఈ మూడ్రోజులూ నువ్వక్కడుంటావు.....నీకు కాపలాగా తేజ ఉంటాడు ఆ ప్రెండ్ .....హ్తేకోర్టులో లాయర్. టి. నగర్లో రెసిడెన్స్ ....ఆయన ప్రస్తుతం ఇంట్లోనే ఉన్నాడు. కిస్ ఇస్తాడు. తీసుకొని మహాబలిపురం వెళ్ళండి." అన్నాడు సూర్యసాగర్.
హొటల్ రూమ్ ఖాళి చేసి, ముగ్గురూ బైటకొచ్చారు.
"మీ డాడి వీలునామా మాత్రం నా దగ్గర ఉంటుంది. డైరిల్ని నువ్వు పట్టుకేళ్ళు ....మొత్తం డైరిల్ని చదువు....."
"మాతో మీరు రారా....."
"రాకూడదు.....అందరూ ఒకేచోట ఉండటం మంచి పద్ధతి కాదు గెస్ట్ హౌస్ కి నేను ఏదో టైమ్ లో వస్తాను.....
మీరు ముందుఆటో ఎక్కండి." టి. నగర్లో వాళ్ళేక్కడకు వేళ్ళలో చెప్పాడు సూర్యసాగర్.
సూర్యతేజ ఆటో కోసం వెళుతుండగా, ముక్తానంద అతన్ని పట్టుకొని ఆపింది.
ఏమిటన్నట్లు చూసాడు తేజ.
"మీ నాన్నగారు ఎంత అప్రమత్తంగా ఉంటున్నారో గమనించి కూడా ఆటో ఎక్కితే ఎలా? మన శత్రువులు ఊహించని విధంగా మరో వాహనం ఎక్కాలి" అంది ముక్తానంద గుంభనంగా.
"ఏ వాహనం...." అయినా నేనుండగా ని జోలికి రావటానికి ఎవరి క్తేనా ఎన్ని గుండేలుండాలి? ఐయమ్ టైని సి.బి.ఐ. ఆఫీసర్ ....యూ నో...."ధీమాగా అన్నాడు తేజా.
"నువ్వన్నట్లుగా మనిషి జీవితాంతం ఒంటిరే అనుకుంటే- ప్రమాదాలు చచేవరకూ తప్పవు. నన్ను ప్రమాదాలు చుట్టూముట్టవని నమ్ముతాను" అంది ముక్త అతని కేసే సూటిగా చూస్తూ.
ఒక్కక్షణం అర్ధం కానట్లు చూసాడు తేజ.
అర్ధంకాగానే ఆనందాశ్చర్యలతో అవునా అన్నట్లు ఆమె కేసి చూసాడు.
ముక్త సిగ్గుతో తలవంచుకుంది.
ఇద్దరి మధ్య కొద్ది క్షణాలు నిశ్శబ్దం.....
ముక్తనంద కొద్ది కొద్దిగా అర్ధమవుతున్నట్లనిపించింది తేజకు.
ముందు తేజాయే తేరుకున్నాడు.
"నువ్వు నమ్మేలా చేస్తాను___సరేనా" అన్నాడు తేజా కూడా గుంభనంగా.
ఇద్దరి మధ్య ఏదో పల్చని తెర....దాన్ని తొలగించుకొని, ఎదుటపడలేని బిడియం.....
"మరో వాహనం అన్నావ్- ఏమిటది.....?" తేజా అడిగాడు అంత సేపు పబ్లిక్ ప్లేస్ లో ఉండటం మచిందికాదని.
ముక్త మౌనంగా చేత్తో ఒవేపు చూపించింది.


