పలుదేశాల తాలూకు ఫారిన్ స్టాంపుల్ని సేకరించిన కావ్య వాటిని అందరివలె ఆల్బమ్ గా తయారుచేసి దాచుకోలేదు. ఒక ఆదివారంనాడు అందర్నీ పిలిచి 'ఆక్షన్' పెట్టింది. అరుదైన ఆ స్టాంపుల కోసం చాల మంది పొట్టీపడ్డారు. కవ్యకు బాగా లాభించింది.
షేర్ మార్కెట్ లో ఎప్పుడూ 'వుయ్ ఘుడ్ నాట మేరీ షేర్స్' అన్నది ఫండ్ మెంటల్ ప్రిన్సిపుల్. షేర్స్ కొనాలి. మార్కెట రేటు పెరగగానే అమ్మివేయాలి. కొన్న షేర్స్ మార్కెట ధర తగ్గుముఖం పడ్తుంటే వెంటనే అమ్మివేయాలి. ఎప్పుడూ అసలు_ వడ్డీ_కాలపరిమితి లెక్క వేసుకోవాలి.
కవ్యకి ఎనినిదో క్లాసులోనే ఈ గుణం వంటబట్టింది. అటు వంటి కావ్య సముద్రంలో తంబికి ప్రమాదం జరగడంతో_ తొలిప్రయత్నంమే విఫలం కావడంతో కలత చెందింది. ఆ తర్వాత షిప్పింగ్ కార్పోరేషన్స్ ని నేషనలైజ్ చేస్తున్నారని తెలుసుకొని క్రుంగిపోయింది. అదీ కొద్దిసేపు మాత్రమే! వెంటనే ఆ షాక్ నుంచి తెరుకున్నదీ.
బాగా పడిపోయిన షిప్పింగ్ కార్పోరేషన్ షేర్ వేల్యూని క్యాష్ చేసుకుంది. తెల్లవారేలోపు అవకాశం వున్నంతవరకు షేర్స్ కొనుగోలు చేసింది. ఆ షేర్స్ ని గవర్నమెంట్ కి సరెండర్ చేసి కాంపేస్ సేషన్ కోరింది. ఆంద్రభ్యాంకు నేషనలైజేషన్ తర్వాత ఒకప్పటి ధనలక్ష్మి బ్యాంకు ఫౌండర్ అయిన ఈయన ఇదే విధంగా తన షేర్ కేపితర్ లో రిఫండ్ అడిగారు. కోర్టులో ఓడిపోయిన ప్రభుత్వం కొన్ని కోట్ల రూపాయలు చెల్లించవలసి వచ్చిన అందరికీ విదితమే. ఇప్పుడు కావ్య విషయంలో అదే జరిగింది. షిప్పింగ్ కార్పోరేష న్స్ ని గవర్నమెంట్ టేకేన్ ఓవర్ చేయడంవల్ల షేర్ హొల్డర్స్ కి షేర్ కేపిటల్, బుక్ ప్రోఫిట్స్ రితర్స్ చేయవలసిన వచ్చింది. ఆ విధంగా కేవలం ఇరవై నాలుగంటలలో దాదాపుగా నలభై లక్షలరూపాయలు లాభం. అదీ కేవలం పదిహేను లక్షల పెట్టుబడితో! తన ప్రాజెక్టుని సేబూటైజ్ చేసిన అతడి పైనే ఖర్చు పెట్టడానికి నిర్ణయించుకుంది.
దేశపు అత్యంత బలవంతమైన పారిశ్రామికవేత్తతో ఢీకొనడానికి ఓ చేట్టేలుక సమయత్తమయింది!
అయితే ఈ విషయాలు ఇంత లోతుగా ఏం.వి. అయ్యకి తెలియదు.
తెలిసిందల్లా ఒక్కటే. తను ఆమెపై ప్రయోగించిన ఆశ్రం ఆమెకే అనవసరంగా ఉపయోగపడింది. తన్హ ప్రత్యర్ది కూతురు తనవల్ల లాభం మెదడుని చిందరవందర చేస్తోంది.
0 0 0 0
దూరంగా అస్పష్టంగా నీడ కదలడంతో తలెత్తి చూశాడు. చూపులకన్నా వేగంగా చూపుడువేలు పిస్టల్ మీద బిగుసుకుంది.
అతడు__
తంబి... చీకటి ప్రపంచపు మూలవిరాట్టులలో ఒకడు...ప్రజల కొరకు ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధుల ప్రభుత్వానికి పేరలర్ గవర్నమెంట్ నడుపుతున్న నిశాచారుడు!
మిన్నువిరిగి మీదపడ్డా చలించని వ్యక్తీ!!
అనుకోని కొణాలనుంచి ఎదురయ్యే ప్రమాదాలను అత్యంత ధైర్యంగా ఎదుర్కోగల డేర్ డెవిల్. అవినీతి మహల్ నీడలో_ హింస, క్రౌర్యం, బాధ తన జీవితంలో ఒక భాగంగా, అనుక్షణం ఆఖరిక్షణంగా భావించి బ్రతుకుతున్న మైనపు బొమ్మలా కారాగసాగింది.
ఆ వచ్చింది కావ్య.
ఆమెను గుర్తించగానే పిస్తలు వదిలేశాడు. ఆమె ఎంతో థ్రిల్లింగ్ గా ఉద్వేగంగా కనిపించినా క్షణాన అతడికి.
* * * *
అతడి మాటలు అర్ధం కావటానికి అరనిముశం పట్టింది.
"యస్ డాడీ! అల చేస్తే చాలా బాగుటుంది అనుకొంటున్నాను."
మనూ! ప్రాక్టికల్ గా ఆలోచించడం నేర్చుకో!"
"యస్ డాడీ... షిప్పింగ్ కార్పోరేషన్ వ్యవహారం మాట్లాడటానికి ఎవరి దగ్గరకు వెళ్ళినా పేపరు మీడియా గురించే భయపడుతున్నారు. ఇంత ఇండస్ట్రీయలిస్టులమై వుండీ మనం పేపరు పెట్టక పోవడమేమిటి? పేపరు మన చేతిలో వుంటే..."
"పనులు తేలిగ్గా జరుగుతాయి అంటావు. అంతేనా?"
యస్ డాడీ..."
"ఫండమెంటల్ మిస్టేక్ అది."
న్యూస్ పేపర్ మీడియా పబ్లిక్ అవేర్ నేస కోసం. 1950 ప్రాతంలో ఓ సామాన్య వ్య్తక్తి రాష్ట్ర రాజధానిలో ఒకే ఒక గది అద్దెకు తీసుకుని చిత ఫండ్ కంపెనీ పెట్టాడు. సైకిల్ మీద తిరిగి డబ్బు వసూలు చేశాడు. ఆ తర్వాత, గంతంలో ఒక అర్వర్ట్ యిజింగ్ ఏజెన్సీలో చేఇన అనుభవాన్ని పురస్కరించుకుని ఒక ఎద ఏజెన్సీని ప్రారంభించాడు. ఆ విధంగా ఫైనాన్స్ అండ్ పబ్లిసిటీమీద గ్రిఫ్ సంపాదించాడు. ఇప్పుడతడు న్యూస్ పేపరు ఏ విధంగా వుండాలి...అన్న విషయమై యితరులకు వ్యతిరేకంగా ఆ రహ్స్త్రంలో తన పేపరుని వేదికగా చేసుకుని ఉద్యమాన్ని నడిపాడు. ప్రభుత్వ మారేవరకు మిశ్రమించలేదు.