ఇంతకు పూర్వం చెప్పానే ఈ రోజుకి విశేషం వుందని ఏమిటంటే ఈ రోజే వాళ్ళు మా యింటికివచ్చి ముహూర్తాలు పెట్టుకుంటారు. అయాం సారీ__నేను నీ మనస్సులో కోర్కెరగిల్చాను.
శ్రీకర్ కి గుక్క తిరగలేదు.
నిలువు గుడ్లేసుకుని చూస్తూ వుండిపోయాడు.
చప్పున జ్యోతి అతనిముందు నుంచుంది.
"నన్ను క్షమించు నీలవేణీ! తొందరపడ్డాను!"
"ఫర్వాలేదు శ్రీకర్! అడగటంలో తప్పేంవుంది! నీ మనస్సుని నా ముందు బయటపెట్టావు. ప్రేమించటం నేరం కాదు. ప్రేమించబడటంకూడా గొప్ప విషయమే! నీలాంటి భావుకుడు ప్రేమికుడు అయినందుకు నాకు సంతోషంగానూ వుంది. బట్...ఇక ఆ విషయం మర్చిపో. మామూలు ఫ్రెండ్ లాగా, మనస్సుకి నచ్చిన మిత్రుడిలా వుండు! అంతేచాలు!"
అతను లేచి అయే టేబిల్ వద్దకి వెళ్ళి ఆమె ముఖంలోకి ఆరాధనా పూర్వకంగా చూస్తూ "నేలవేణిగారూ! పెళ్ళి కుదరనంత మాత్రాన ప్రేమ పోదు. మనం ఆత్మీయులం! మనస్సుకి నచ్చిన స్నేహితులం__ఒక సౌందర్యరసాది దేవతను ఆరాధించటం ఎంత గొప్ప! దేవత అనుగ్రహించకుంటేనేం? ఆరాధన చాలదూ?" అన్నాడు. నీలవేణి అతని చేతిని స్నేహిపిచ్చలంగా నొక్కింది. అతనికామె కళ్ళలో జ్యోతి కనిపించిందిమళ్ళీ.
34
ఫోన్ వార్త విని దిగాలు పడిపోయాడు గోవర్ధనం-
అతను తన చెవుల్ని తను నమ్మలేకపోయాడు. ఇది ఎలా సంభవించింది? పదిలక్షలు ఒక్కసారిగా సముద్రంపాలా? భగవాన్ ఏమిటిది అన్యాయం?" ఆక్రోశించింది ఆయన మనస్సు. "అన్యాయమేముంది? ఆ భగవంతుడు నిజంగా న్యాయమే చేశాడు. అన్యాయాన్ని నడిసముద్రంలో దోచాడు అంతే" దెబ్బ తీసింది అంతరాత్మ.
అది స్మగ్లింగ్ సరుకు అందుకే యిన్స్యూర్ చేయలేదు. క్లెయిమూ వుండదు. పోయింది. ఎన్నో ఏళ్లుగా సంపాదించిందంతా సముద్రపు దొంగల పాలైంది" తల తిరిగిపోతూంది గోవర్ధనానికి.
"సార్!"
పర్సనల్ మేనేజర్ పిలుపుకి కళ్ళు తెరిచాడు.
"ఏమిటి? ఎందుకొచ్చావ్! డోంట్ డిస్టర్బ్! వెళ్ళు గెటౌట్! ఇప్పుడు నన్నెవరూ పలకరించొద్దు!" ఎగిరిపడ్డాడు గోవర్ధనం.
అయినా అతను కదలలేదు.
"యూ! డెవిల్! గెటౌట్! ఫ్రం మై సైట్! ఆ శివపాదాన్ని యిలా తగలడమను!"
"శివపాదంగారు లేరు సార్!"
"ఎక్కడికి చచ్చాడు?"
"తెలీదు సార్!"
"అదేం నిద్రపోతున్నాడా యింకా? ఇప్పుడు టైం ఎంతయింది? ఇది ఫ్యాక్టరీయా, లేకపోతే పశువుల దొడ్డి అనుకున్నాడా? ఇమ్మిడియట్ గా రమ్మని ఫోన్ కొట్టు. లేదా డిస్మిస్ చేస్తానని చెప్పు!"
ఆయన పారిపోయాడు సార్! కుటుంబంతో సహా రాత్రే ఎక్కడికో పారిపోయాడట!
"వాట్?"
"అవును సార్! శాలరీస్ యివ్వాల్సిన డబ్బూ, మెషన్స్ కి జపాన్ కంపెనీకి కట్టాల్సిన రెండు లక్షలూ తీసుకుని పారిపోయాడు."
"యూ" పళ్ళు కొరికాడు. ప్రళయ కాలరుద్రునిలా వున్న గోవర్ధనాన్ని చూసి భయపడి వెళ్ళిపోయాడు పరుగుపరుగున. స్వింగ్ డోర్ తీసుకుని వెళ్ళిపోతున్న అతన్ని రాచుకుంటూ లోపలికి వచ్చాడు లీగల్ ఎడ్వైజర్ పరమేశ్వరరావు. వచ్చి కుర్చీలో కూర్చుని సిగరెట్ వెలిగించి గోవర్ధనానికి ఆఫర్ చేశాడు.
"సిగరెట్ కాదు నన్ను కాల్చండి. మైడియర్ లాయర్! మా మేనేజర్ మీద థెఫ్టు కేస్ పెట్టండి. దాదాపు మూడులక్షల రూపాయలతో పారిపోయాడు. బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ క్రింద బుక్ చేయించండి రాస్కెల్".
పళ్ళు కొరుక్కున్నాడు లాయర్.
"గోవర్ధనం! అతన్నొదిలెయ్...ఫార్మల్ గా రిపోర్టివ్వు అంతే. లెట్ హిమ్ లివ్! నువ్వెలాగూ పీకలదాకా మునిగిపోయావు. కనీసం అతన్ని సేవ్ చేయ్. నీ పార్టనర్స్ ఇద్దరూ ఐ.పీ. వెట్టారు. వాళ్ళ అప్పులకి యీ ఫ్యాక్టరీ చూపారు కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. నీ ఎస్సెట్స్, లయబిలిటీస్మ్ స్టాక్, ఎస్టాబ్లిష్ మెంట్, మెషినరీ అంతా ఆ అప్పులకే సరిపోతుంది. నువ్వూ వాళ్ళలాగే ఇన్సాల్వెన్సి పెట్టేయ్. లేకపోతే జైలు కెళ్ళాల్సి వస్తుంది."
స్పృహపోయింది గోవర్ధనానికి అది వినగానే.
35
మేడలో తను అతి ప్రేమగా కట్టించుకున్న గదిలో పడుకున్నాడు గోవర్ధనం...అతను గతరాత్రి స్మృతిరాగానే మరణ వాజ్మూలం రాశాడు. బాగా మధించుకున్న తర్వాత తీసుకున్నాడు నిర్ణయాన్ని.
తండ్రి కళ్ళు తెరవగానే కూతురు కనిపించింది. అంతా ఒక్కక్షణం కళ్ళముందు తిరిగింది. తన పెళ్ళి...జ్యోతి పుట్టుక...తన బిజినెస్...ఐశ్వర్యం...జ్యోతి పెళ్ళి...శ్రీకర్ తో తెగతెంపులు అన్నీ మెదిలాయి.
"జ్యోతీ!"
"నా మాటవిను. మనం పూర్తిగా దివాలాతీసాము. మనకు ఏమీ మిగల్లేదు. ఈరోజోరేపో కోర్టువారు మన ఫ్యాక్టరీని' ఆస్తిని, ఈ మేడను స్వాధీనం చేసుకుంటారు. రిసీవర్ చేతికి అంతా వెళ్ళగానే మన చేతిలో చిల్లిగవ్వ వుండదు. బ్యాంకులో వేలకు వేలు మూలుగుతున్నా నయాపైసా డ్రా చేయలేం మనం!
అన్యాయమైపోయాం మనం! మట్టినుంచి బంగారాన్ని తీశాను నేను. ఆఖరికి ఈరోజు ఆ మట్టికూడా మిగలలేదు."
జ్యోతికి అంతా అంధకారమయంగా కనిపించింది.
"నేను ఈ బికారి బ్రతుకు బ్రతకలేను. కష్టించి తిరిగి నా స్థానం నేను పొందగలనన్న ఆశా, పట్టుదల, వయస్సు లేవు. అందుకే నేను విషం పుచ్చుకున్నాను..."
"నాన్నా!" భోరున ఏడ్చింది జ్యోతి.
"ఏడవకమ్మ! అంతా అయిపోయిందానికి ఏడ్చి లాభంలేదు. ఇప్పుడు కావలసింది ఆలోచన జ్యోతీ...నీ సంసారం చెడిపోయింది. అయితే నం డబ్బు మదంతో వ్యవహరించినా, శ్రీకర్ స్వతహాగా మంచివాడు. అతన్ని మన ఇద్దరం చిత్రహింసలు పెట్టాం. గతం గతమే...తిరిగిరాదు...ఇప్పుడు నీ బ్రతుక్కి ఆశాదీపం అతనే! నువ్వు అతని వద్దకు వెళ్ళు..."
"నాన్నా!"
"వద్దమ్మ! దుఃఖం వద్దు. ఆవేశం వద్దు_బాగా ఆలోచించి చెబుతున్నాను. నేను నిండా యిరవై యేళ్ళు నిండని నీ జీవితాన్ని నాలాగా నాశనం చేసుకోకు...అతని వద్దకు వెళ్ళు."
"ఎలా వెళ్ళను నాన్నా?" దీనంగా అడిగింది.
"నీ భర్త వద్దకు వెళ్ళటానికి నీకేంటమ్మ! ఎందుకమ్మ జంకుతావు వెళ్ళు. అతను నిన్ను ఆప్యాయంగా ఆహ్వానిస్తాడు. తిరిగి గుండెల్లో దాచుకుంటాడు. నిన్ను తన యింటి జ్యోతిని చేసుకుంటాడు. సాదాగా వచ్చిన నిన్ను మణిదీపంలా చూసుకుంటాడు."