"నే వెళ్ళను నాన్నా! నిన్ను బ్రతికించుకొని, నా చదువుతో ఉద్యోగం సంపాదించి, నిన్ను పోషిస్తాను. మనం ఎవరమో తెలియని దేశానికి వెళదాం."
వెర్రిగా నవ్వాడు. "జ్యోతీ! అదంతా పిచ్చి ఆలోచన! నా శరీరంలో విషం ఎంత వుందో నీకు తెలియదు. ఈ ఊళ్ళోనే కాదు, దేశంలోని డాక్టర్లంతా కలిసినా నన్ను రక్షించలేరు. ఇది నా ఆజ్ఞ! అభ్యర్ధన! పార్ధన! నువ్వు అతన్ని చేరుకో."
సెకండు సెకండుకి మృత్యువుకి చేరువౌతున్న తండ్రిని చూస్తూ నిస్సహాయంగా దుఃఖించసాగింది జ్యోతి.
36
"ప్రఖ్యాత పారిశ్రామికవేత్త గోవర్ధనం ఆత్మహత్య!"
ఉదయమే పేపర్ చూసిన శ్రీకర్ ఉలికిపడి గబగబా చదివేడు. అతని మనస్సు స్తంభించింది. "మైగాడ్! జ్యోతి! జ్యోతి! జ్యోతి! ఏమైంది?" అతని మనసు పాదరసం కంటే వేగంగా ప్రవహించింది.
వెంటనే పోస్టు ఆఫీస్ కి వెళ్ళి టెలిగ్రాం యిచ్చాడు. యెంత ప్రయత్నించినా ఫోన్ కనెక్షన్ దొరకలేదతనికి.
జ్యోతీ!
నా ప్రాణప్రియా! నా ప్రేమ స్వరూపమా! ఎంత చిక్కు వచ్చింది నీకు? ప్రపంచంలో కష్టాలన్నీ ఆ జ్యోతి నిలయం చుట్టే కమ్ముకున్నాయ్...అయినా భయపడకు...నేనున్నాను...నిన్ను నా ప్రాణప్రదంగా దేవతగా చూసుకుంటాను.
ఆలోచించకు...సంకోచించకు...సిగ్గుపడద్దు...అభిమానం వద్దు. భార్యాభర్తల మధ్య యివన్నీ వుండకూడదు. వచ్చేయ్...నీ రాకకోసం నా మది తలుపులూ, యింటి తలుపులూ తెరుచుకొని గేట్లోనే నించుంటాను...వస్తావు కదూ! రా! వెంటనే బయలుదేరిరా!
నీ శ్రీకర్"
"ఏంటయ్యా! ఇది ప్రేమలేఖా? టెలిగ్రామా?" అని విసుక్కున పోస్టల్ క్లర్క్ ని మింగేటట్టు చూశాడు శ్రీకర్.
రైలు వేగంగా పరుగెడుతోంది. కిటికీ ప్రక్కన దిగాలుగా కూర్చుని వుంది జ్యోతి. ఆమె మనసు, మెదడు, మొద్దుబారిపోయాయి యెప్పుడో! యిలా జరుగుతుందని ఊహించలేదెన్నడూ. మళ్ళీ తిరిగి భర్త వద్దకు వెళ్ళాల్సి వస్తుందని కూడా ఊహించలేదు.
విథి రువ్విన నిప్పుల వలలో చిక్కుకుపోయి, ఆ సెగకు, వేడికి భరించలేక అలమటించి పోతున్న తరుణంలో శ్రీకర్ దగ్గరనుంచి టెలిగ్రాం వచ్చింది. అది చూసుకుని పొంగిపోయింది. కారు చీకట్లో పయనిస్తున్న తనపట్ల అది వెలుగు రేఖలా భాసించింది. కొత్త ఆశలు రగిలించింది. అది టెలిగ్రాం కాదు - వరం!
మరేమీ ఆలోచించలేదు, బయలుదేరింది.
"శ్రీకర్ మనసు ఎంత మెత్తనిది? నిర్ధాక్షిణ్యంగా తాళి త్రెంపివేసి అతన్ని తూలనాడింది ఆనాడు మరి శ్రీకర్. తనను చూసి హేళన చేయలేదు. వ్యంగ్యంగా బాధించలేదు. ఆర్తితో, సానుభూతితో తిరిగి ఆహ్వానిస్తున్నాడు.
అలాంటి ఉత్తముడ్ని ఇన్నాళ్ళూ దూరం చేసుకుంది అవివేకంతో!
అతను అందించిన ప్రేమ బంధాన్ని అందుకోలేక నేలపాలు చేసుకుంది. ఆయన పాదాలమీద వాలిపోవాలి. తనివి తీరా ఏడ్వాలి. గుండెలు తేలికపడేలా సేదతీరాలి. ఆయన్ను అల్లుకుపోవాలి_అని అనుకుంటే జ్యోతికి దుఃఖం ఆగలేదు.
ఏ మనిషీ పుట్టుకతోనే చెడ్డవారుగానూ, దుర్మార్గులుగానూ పుట్టరు. పరిస్థితుల ప్రాబల్యం వలన, అజ్ఞానం వలన అలా మారుతారు, తిరిగి వాళ్ళు మంచివాళ్ళు కావాలంటే, కనువిప్పు కలగాలంటే బలమైన సంఘటనలు వాళ్ళ హృదయం మీద ముద్రపడాలి.
జ్యోతికి అంతే! పరిస్థితులు ఆమెను మార్చేసాయి.
తన తప్పును తెలుసుకుంది. మళ్ళీ అలాంటి తప్పులు చేయకూడదని తెలివి తెచ్చుకుంది. అందుకు భర్త సహకరించి తనను రమ్మని వ్రాశాడు. చాలు ఆ కాస్తంత భాగ్యానికే పొంగి పోతుంది.
రైలు ఆగింది.
నెమ్మదిగా ప్లాట్ ఫారం దాటి కాలినడకన బయలుదేరింది జ్యోతి.
ఒకప్పుడు కారులో తిరిగిన జ్యోతి, లక్షాధికారి బిడ్డ జ్యోతి ఇప్పుడు రిక్షాకుకూడా డబ్బులులేక నడచి వెళుతుంది. అందుకే అంటారు-ఓడలు బళ్ళూ, బళ్ళు ఓడలూ అవుతాయని అశాశ్వతమైన సంపదను చూసి మురిసిపోవడంకన్నా ఏమీలేదు అనుకుని తృప్తిపడటం ఉత్తమం!
కాలం ఎన్నో గారడీలు చేస్తుంది. మరెన్నో మార్పులు తెస్తుంది.
అవన్నీ ముందుగా మనకు తెలీదు. అందుకే మనిషికి ముందు చూపు అవసరం అని పెద్దలు అంటుంటారు.
అతి కష్టంమీద నడుస్తూ, నీరసంగా, దైన్యంగా వెళ్ళి ఇంటిముందు నిలబడింది జ్యోతి. లోపలకు అడుగుపెట్టే ధైర్యం చాలడంలేదు ఆమెకు. ఒకనాడు ఆ ఇంటిని, ఇంటి వాతావరణాన్ని చూసి ఏహ్యభావంతో ఛీత్కారం చేసింది!
నేడు ఆ ఇల్లు దేవుని కొలువులా అనిపిస్తుంది!
అందులో అడిగిడే ధైర్యం చాలడంలేదు.
అప్రయత్నంగా, యాదృచ్చికంగా శ్రీకర్ బయటకు వచ్చాడు.
శోకదేవతలా నిల్చున్న జ్యోతిని చూశాడు.
"జ్యోతీ! జ్యోతీ!" అతని పెదవులు పలవరించాయి. కళ్ళు మిల మిల మెరిసాయి. ఆమె దోషిలా తల దించుకున్నది. ఉబికి వస్తున్న కన్నీటి వాగుకు ఆనకట్ట వేస్తూంది బలవంతంమీద.
"వచ్చావా జ్యోతీ! నీకోసం__నీకోసం ఈ క్షణంకోసం ఇన్నాళ్ళుగా యెదురు చూపు చూస్తుంది. నేటికి నామీద దయ కలిగిందా జ్యోతీ! మన బ్రతుకుల్లో నవజ్యోతులు వెల్లివిరియగా, నవరాగం పల్లవించగా రా జ్యోతీ...రా..." అతని హృదయం పారవశ్యంతో పులకరించింది.
ఆ మాటలు గాయపడిన జ్యోతి గుండెల్ని ఊపేశాయి.
ఇక నిలువలేకపోయింది.
వేగంగా వెళ్ళి అతని పాదాలముందు ప్రణమిల్లింది.
వెచ్చని రెండు కన్నీటి బొట్లు అతని పాదాలను స్పృశించాయి. అతను చలించిపోయాడు.
"జ్యోతీ!...ఛ...ఏమిటిది?...లే..." ఆర్తిగా ఆమెను లేవనెత్తాడు. అతని స్పర్శకు, ఆత్మీయతకు ఆమె మనసు ఉధృతమయింది.
"నన్ను__నన్ను క్షమించరూ..." దీనంగా దైన్యంగా చూసింది.
"జ్యోతీ! జ్యోతీ!" అని అతని గుండె కొట్టుకుంటోంది.
నవ్వే కళ్ళతో, ఏడ్చే పెదవులతో చేతులు సాచాడు శ్రీకర్.
అలౌకికమయిన ఆనందంతో, ఉద్వేగంతో ఆ అమృత హస్తాల్లో వాలిపోయింది జ్యోతి.
"ఏమండీ! నేను మహా పాపిని. నన్ను మన్నించండి. మిమ్మల్ని వదలి ఎక్కడికీ వెళ్ళను. మీరు నాకు కావాలి" పెదవులు పిచ్చిగా పలవరిస్తున్నాయి.
అతని కళ్ళు మెరిసాయి. వళ్ళు తూలింది.
ఆమెనలాగే హృదయానికి హత్తుకున్నాడు గాఢంగా. కొన్ని క్షణాలు వారి హృదయాలు తీవ్రంగా, తీయగా, హాయిగా ఊసులాడు కున్నాయి. సంతోషంతో మాటలు కరువయ్యాయి ఇరువురికీ. రాగజలధిలో తడుస్తూ అలాగే వుండిపోయారుచాలాసేపు.

__: సమాప్తం :__