Previous Page Next Page 
సక్స్ స్ పేజి 32



    "ఇమ్మిడియట్ గా నువ్వు చెయ్యాల్సిన పనులు రెండున్నాయి... ఒకటి... సూర్యసాగర్ నుంచి, ఆ వీలునామాను సంపాదించడం....రెండు ...లేని పక్షంలో సూర్యసాగర్ లేకుండా చెయ్యడం... అంతే .... సింపిల్ ...."

    పార్టి ముగింపు దశలో ఉండగా, అర్జంటు పనుందని బయటి కోచ్చేస్తాడు రవిచంద్ర.

    -తన  నివాసానికొచ్చేసి, డిల్లికి- లాయర్ శ్రీపతిరావుకి ఫోన్  చేసాడు. ఆయన ఆ న్యూస్ ను  కన్ ఫర్మ చేసాడు.

    దాంతో రవిచంద్ర కాలుకాలిన పిల్లిలా  హల్లో తిరుగుతున్నాడు.

    ఆ సమయంలో పార్టీనుంచి వచ్చారు పుష్పక్ , రఘునాద్ , అనిమిశ పక్కన లాయర్  అరవిందరావు కూడా ఉన్నాడు.

    "ఇప్పడే డిల్లి ఫోన్  చేసాను. శ్రీ పతిరావు....మీరు  చెప్పిన న్యూస్ ను  కన్ ఫర్మ చేసారు...."

    "మరి  ఎక్కువ ఆలోచించడం మంచిది కాదు. రేపు నువ్వు బంకర్లను కలవడానికి ముహూర్తం  పెట్టుకున్నావ్. ఈ మధ్య లో సూర్యసాగర్   విలునామాతో దిగేడనుకో .... కొంచెం ఆలోచించు." రఘునాద్ సలహా ఇచ్చాడు.

    "వీలునామా మనకు అనుకూలంగా ఉంటుందన్న గ్యారంటి ఏమిటి?" అనిమిష ప్రశ్నించింది.

    ఆ మాటన్న అనిమిష వేపు  సాలోచన గా  చూసాడు రవిచంద్ర.

    "సిస్టర్ ఈజ్ ఆల్వేస్ కరెక్ట్ ....సూర్యసాగర  దగ్గర్నించి, ఆ వీలు నామాను లాక్కుంటే చాలు....తర్వాత కధ మనం నడిపించోచ్చు" పుష్పక్  సలహా యిచ్చాడు.

    "అవసరమ్తేతే, కాండిడేట్ ని లేపెయ్యండి....తర్వాత నేను చూసుకుంటాను...." సూర్య సాగర్  కి, అరవిందరావుకి మధ్యనున్న జెలసీ అందరికి తెలుసు. అరవిందరావు చాలాకాలం నుంచి, టైమ్ కోసం వెయిట్ చేస్తూన్నాడు అరవిందరావు ప్రోపెషానల్ జెలసీ  ఎలాంటిదో అందరికి తెలుసు. రవిచంద్రతో చెప్పి, రఘునాద్ , పుష్పక్ బయటికొచ్చి కారేక్కారు.

   
                    *                 *               *

    ఫోన్ మోగుతుందో__

    చటుక్కున ఫోన్ ఎత్తింది ముక్త___

    "అమ్మా....ముక్త.....నేను .....సాగర్ అంకుల్ ని  ....రాత్రి సెవెన్ పార్టి పైవ్ ప్లయిట్ లో బయల్దేరి వస్తున్నాను. ముఖ్యమ్తెన విషయం.... నేనిక్కడ మీ డాడి వీలునామా కోసం....చేసే ప్రయత్నాలన్నీ...మీ అన్నయ్య రవిచంద్రకు దగ్గరివాడైతేన రఘునాద్ కు తెల్సింది. రఘునాద్ ఆ విషయాన్నీ  మీ అన్నయ్యకు  చేర వేసి ఉంటాడని  నా అనుమానం నా జాగ్రత్తగా ఉండాలి. ముందు జాగ్రత్త  చర్యగా నువ్వు, గెస్ట్ హౌస్ లోంచి  మారిపోయి, అవుట్ స్కర్త్సులోని ఎదైనా  హొటల్లో రహస్యంగా  వేరే పేరుమీద ఉంటే బావుంటుంది. ఆలస్యం చెయ్యకుండా ఆ పని చెయ్యి.... ఎయిర్ పోర్ట్ కి  తేజను రమ్మనమని చెప్పు"

    ఫోన్ పెట్టేశాడాయన.

    సూర్యసాగర్ చెప్పిన విషయాన్నీ తేజకు చెప్పింది ముక్త.

    తండ్రి చెప్పిన విషయంలో ఎ మాత్రం అశ్రద్ధ చేయదలచుకోలేదు తేజ.

    వెంటనే___

    కే.కె. నగర్ ఏరియాలో అన్న ఒక చిన్న హొటల్లో ముక్తని ఉంచి___

    తను  ఎయిర్ పోర్టుకి బయలుదేరాడు.

                     *                *                  *

    అప్పుడు రాత్రి పదిగంటలు సమయం.

    విధ్యద్దిపాల వెలుగులో మినంబాకం ఎయిర్ పోర్ట్  మిల, మిలా మెరిసిపోతోంది.

    సరిగ్గా-

    ఆసమయంలో ఎయిర్ పోర్ట్ మెయిన్ గెటు దగ్గర ఆగిన ఆటో వేపు చూసాడు పుష్పక్.

    ఆటోచించి సూర్యతేజ దిగాడు.

    "ఎయిర్ పోర్ట్ కి సూర్యతేజ వచ్చాడు...." చెప్పాడు పుష్పక్  కంగారు పడుతూ.

    "అంటే తను బయలుదేరేముందు....సూర్యసాగర్ మీద ఎటాక్ చెయ్యడం కష్టం...." చెప్పాడు పుష్పక్.

    ఆలోచనలో పడ్డారిద్దరూ.

    ఆ ఆలోచనా ఫలితం పది నిమిషాల్లో రూపు దిద్దుకుంది. ప్లాన్ ప్రకారం, ఒక టాక్సి ని ముందుగా మాట్లాడి, సిద్దంగా ఉంచాడు పుష్పక్ .

             *                 *                 *

    అప్పుడు రాత్రి సరిగ్గా 11.15నిమిషాల్తెంది.

    డిల్లి నుంచి వచ్చిన ఎయిర్ బస్సు రన్ వ్  మీద ఆగింది.

    సూర్యసాగర్ ని, సూర్యతేజ రిసీవ్  చేసుకున్నాడు.

    "హౌ ఆర్యూ.... మై డియర్ చైల్ద్...."

    "ఎవ్వేరిదింగ్.....పైతెన్ డాడి....."

    "ముక్త ఎలా ఉంది....."

    "మీరు చెప్పినట్లుగానే చేసాను."

    "గుడ్...."

    డాడి డేడికేషన్ గొప్పది. ఒక కేసుని పడితే, ఆ కేసు పూర్తయ్యేవరకూ  నిద్రపోరు.

    "సక్సెస్ పుల్  కెరీర్" అంటే ఆయనదే. అందుకే తన తండ్రి ప్రతిభ, దీక్షల మీద అపారమైన నమ్మకం తేజకు.

    కానీ___   

 Previous Page Next Page