"చూడలేదు.....ఓకే ఒకసారి .....ఆపీసు పనిమీద పంజాబ్ లో ఉన్నప్పుడు, జీలం నడి దగ్గర, మిలిటెంట్లు ఉన్నారని మెసేజ్ వచ్చింది. ఆఘ మేఘాల పరుగెత్తాం. మొదట్నించి, నిళ్ళంటే నాకిష్టం కదా. జీలం నది.... చాలా బాగుటుందని విన్నాను. జీలం నది దగ్గర కొన్ని గంటలు గడపాలని ఆశ. మా గ్రూఫ్ వెళ్ళేసరికే మిలిటెంట్లు, పోలిసుల మధ్య కాల్పులు జరిగిపోయాయి. మేం వెళ్ళేసరికి జీలం నది ప్రాంతం, రక్తభూమిలా ఉంది. నిళ్ళన్నీ రక్తాన్ని పులుముకుని ప్రవహిస్తున్నాయి. ఆ నదిని చూడలేకపోయాను. వెంటనే తిరిగోచ్చేసాను...." చెప్పాడు తేజ.
తేజ చెప్పిందాన్ని శ్రద్దగా వింటోంది ముక్త.
"ఎన్నాళ్ళకో కలిసావు. కానీ... ఇలాంటి కష్ట సమయంలో నిన్ను చూడడం నాకు బాధగా ఉంది" అన్నాడు తేజ,
"ఇలాంటి సమయంలో నువ్వు రావడమే నాకు ఓదార్పుగా ఉంది. నిన్నరాత్రి....జరిగిన సంఘటన సమయంలో నువ్వు లేకపోతే...."
"ఒకరుండడం లేకపోవడం అనేది.....నాన్నేన్స్ .....మనిషె ప్పడూ వంటరి జీవే. బతుకే అతనికి యుద్దనితిని నేర్పుతుంది. బతగ్గలిగితే చేవనిస్తుంది. తనని తాను రక్షించుకోగలిగే శక్తి నిస్తుంది. నికా శక్తుంది. ఆ చెక్కును చింపేసి, అతని ముఖమ్మిద కొట్టినపుడు.. నేనక్కడ ఉన్నాననే స్పృహ నీకు లేదుకదా. సహజమ్తెన ని ఆత్మ విశ్వాసమే నిన్నలా చేయించింది. దట్సాల్...." చాలా సీరియస్ గా చెప్పాడు తేజ.
నువ్వుండగా నేను ఒంటరిదాన్నెలా అవుతానని అనాలపించింది ముక్తకు -కానీ ఎందుకో అనలేకపోయింది___అతని మనస్సు తేల్చుకోకుండా అతి చనువు తీసుకోవటం, మంచిది కాదనే ఆగిపోయింది.
"మీ నాన్నగారిలోని గొప్పగుణం....నీక్కూడా వచ్చింది...." మెల్లగా అంది ముక్త.
"ఏంటది...."
"ఎదుట వ్యక్తులు నిరాశపడకుండా చూడడం. వారిలో నిబిడి కృతం గా ఉన్న శక్తిని బయటకు తియడానికి ప్రయత్నించడం...."
"నన్నంతగా పొగడ్డానికి ప్రయత్నించకు...." నవ్వుతు అన్నాడు తేజ. చీకట్లో సముద్రం, నేలమీద నల్లటి సిల్కుచీర కప్పినట్లు ఉంది.
"ఇక వెళ్దామ ....చీకటి పడింది...." లేస్తూ అంది ముక్త.
దూరంగా ఏం.జి రామచంద్ర్ స్మారకార్ధం నిర్మించిన కట్టడడం, నియాన్ దీపాల వెలుగులో అధ్బుతంగా మెరుస్తుంది.
ఇద్దరూ నెమ్మదిగా నడచుకుంటూ రోడ్డుమీద కొచ్చారు.
* * *
నాయుడు గ్రూఫ్ కు చెందిన బోర్డాఫ్ డ్తె రెక్టర్స్ కోసం, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పార్టిలో రవిచంద్ర నాయుడు, హుషారుగా అందరి మధ్య తిరుగుతున్నాడు.
గెస్ట్ హౌస్ లాన్ లో అతిధులు నెమ్మదిగా డ్రింక్స్ తీసుకుంటూ కబుర్లు చెప్పకుంటున్నారు.
అందరి మధ్య ప్రత్యేకంగా కనబడాలని, అతిగా అలంకరించు కున్న అనిమిష హడావుడి తిరుగుతోంది.
ఆమె దృష్టిలో రవిచంద్ర నాయుడు గ్రూఫ్ కు చైర్మన్ . తను చైర్మన్ కు కాబోయే భార్య-ఆ హొదా వెలగబడుతోంది అనిమిష.
అనిమిష అందానికి, కొత్తగా కొన్న యాబై లక్షలు విలువ చేసే నక్లెస్ మరింత కొత్త కాంతి నిస్తోంది.
-లాయర్ అరవిందరావుతో మాట్లాడుతున్నాడు రవిచంద్ర.
"ఏవంటున్నారు....మీ బోర్డా ఫ్ డై రెక్టర్స్ ..." అడిగాడాయన- ఆయనకో యాబైఏళ్ళుంటాయి.
"ఒకరిద్దరు తప్పు....అందరూ ఓకే...."
"ఆ ఇద్దరి విషయంలోనూ డౌటేందు కబ్బాయ్ ....ప్రపంచంలో పవర్ మూడేమూడు విషయాల చుట్టూ తిరుగుతుందన్న విషయం నీకు తెలిదనుకొను మని....ఉమెన్ ....సెక్యూరిటి ఈ మూడింటిలో దేనికవె.... సెపరేట్ గా .... కనిపించినా .....ఒకదాని అవసరం ..... ఇంకో దానికుంది....ఒకటి లేకుండా ఇంకొకటి లేదు....ఈ మూడు కలిస్తే, దాని అందమ్తెన పేరే పవర్.... నీకు పవర్ కావాలంటే....ఈ మూడింటిని రంగంలోకి వదలాలి. గుర్తుంచుకో....." అరవిందరావు తాగుడు టైమ్ లోనే కొటేషన్లు చెప్తాడు"
"నువ్వు నిజంగా, నీ ప్రాపర్టీనీ స్వాధీనం చేసుకోవాలంటే....ఈ బోర్డాఫ్ డైరక్టర్స్ ....ఈ మీటింగ్స్ ....అంతా వృధా .....ఎవడికి కావాల్సింది వాళ్ళింటికి పంపేయ్ .....చాలు"
"వాళ్ళందరి గురించి నేను చూసుకుంటాను సార్. నా గురించి చూసుకుంటాను.....అంతే....మనిషి మ్,మనుగడకు అవసరమయ్యే ఏ చట్ట మైన చెప్పేది ఇదే...."
మందు మత్తుతో, మగతగా నవ్వాడయన.
అర్ధమై పోయింది రవిచంద్రకు.
-అదే సమయంలో పరుగు, పరుగున వచ్చాడు రషునాద్.
"సరిగ్గా సమయానికొచ్చారు.....రఘునాద్ అంకుల్ ....చెప్పా చెయ్యకుండా, డిల్లి వెళ్ళిపోయరేంటి...."
"నా పనిమీద డిల్లి వెళ్ళాను. నీ పనిమీద, సగం మధ్యలో వచ్చేసాను." ఆయాసంతో రోప్పతున్నాడు రఘునాద్.
"ఏంటి చెప్పండి.....ఎందుకంత కంగారు...."
"కంగారేంఅ లేదయ్యా కొంపమునిగిందంతే....మీ డాడి....రాసిన వీలునామాను, ఆ లాయర్ సూర్యసాగర్ సంపాదించట్ట ఈ విషయంలో, సుప్రింకోర్టు ఏడ్వకేట్ ను సంప్రదిస్తున్నట్ట."
ఆ వార్త రవిచంద్ర మెదడులో బాంబులా పేలింది.
"విలూనామా దొరికిందా .... డాడి .... వీలునామా రాసే చనిపోయారా ... " బుర్ర పనిచెయ్యడం మానేసింది రవిచంద్రకు.
వెంటనే అరవిందురావు దగ్గరకు పరుగెత్తాడు రవిచంద్ర.