Previous Page Next Page 
స్టార్ వార్స్ పేజి 32

    "చూశావటయ్య వెంకట్రామయ్య! ఈ పేపర్ వాడు అన్నీరాశాడుదయ్యా__ పొద్దున మాట్లాడుకున్న విషయాలన్నీ ఈడికేలా తెలిశాయంటావు?"

    "దానివల్ల మనకొచ్చిన నష్టమేమిటి?" ప్రశ్నకు ప్రశ్న సమాధనమయింది.

    "మొన్న రాజ్యసభకు నువేన్నీ లక్షలు ఖర్చు పెట్టావ్__ నేనెంతపెట్టాను? గ్రూపు మెయింట్ నేన్స్ కోసం ఎంత ఖర్చు పెడుతున్నాం? అప్పుడు ణ పరిష్టితి, నీ పరిష్టితి ఏమిటి?"

    "నీ పరిష్టితికి ఏ డోఖాలేదు. నీవు ముఖ్యమంత్రిగా వున్నంత కాలం నాకే ఇబ్బంది లేదు"

    "నీకంత దండి ఏమిటి?

    "అదంతే__ ద్ద్బ్బు తీసుకుని పని చేసినంతకాలం జనం మనల్ని తిట్టుకోరు. డబ్బులు తీసుకోకుండా పనులు చేయకుండా వుంటే తిడతారు.డబ్బులు పుచ్చుకుని పనులు చేయకుంటే డబుల్ తిట్లు తిడతారు. తిను_ పని చెయ్. తిన్న దాంట్లో రూపాయికి పదిపైసలు పేదవాళ్ళు కోసం ఖర్చు పెట్టు. హౌసింగ్ డెవలప్ మెంట్ ఫైనాన్స్ కో_ ఆపరేటివ్ సొసైటీవారి శాతం మాత్రమే! మిగతా వారంతా  అద్దేఇళ్ళలో వుంటున్నారు. ఇళ్ళులేక రోడ్ల ప్రక్కన, కాలువగట్టులమీద, రైల్వే_ బస్ ప్లాట్ ఫారమ్ మీద బ్రతికేవారు మొత్తం జనాభాలో ముఫైరెండు శాతంమంది వున్నాడు మరో పదేళ్ళలో ఇల్లు కట్టుకోవడానికి స్థలం దొరకడు. కొంప గోడులేని ఈ జనాభా పేపరు చూడరు. చూసినా ఇవేమీ అర్డంగాదు; అర్దమయినా పట్టించుకోరు. వెంటనే వీరికోసం కాలనీలు కట్టిస్తున్నట్టు దినపత్రికలతో పుల్ పేజీ అడ్వర్టయిజ్ మెంట్లు ఇవ్వు. నీతో గొడవ పెట్టుకున్న పత్రికలలో ఆ ప్రకటనలు ఆపు. కాలనీ శంకుస్థాపనకి స్వయంగా నీవే వెళ్ళు_ పేదలకు పట్టాలుపంచు, నీ జేబులో డబ్బుతో ఉచితంగా ఇళ్ళు కట్టిస్తున్నట్టు మాట్లాడు. శ్రీ శ్రీ 'మహాప్రస్థానం' లో కొన్ని వాక్యాలు కంఠతాచేయ్. ఉపన్యాసం మధ్యలో ఉదహరించు. నీ ప్రభుత్వం వుంటే వారికీ ఇల్లోస్తుందని ఆశ  చూపించు. ప్రతి ఇంటిముందు కొని ఇటుకులు, ఇసుక దింపు నీ ఇట్లా బ్యాంక్ వీళ్ళే!"

    "వాట్ ఎబౌట్ మిడిల్ క్లాస్ డాడీ" అప్పటివరకు శ్రోతగా నున్న మనోహర్ అడిగాడు.

    "రేషన్ పెంచు.

    పండుగులకు పబ్బాలకు బోనస్ ఇవ్వు.

    ఎన్టీవొల కోరికలు__పోలీసు డిపార్ట్ మెంట్ కోరికలు వెంటనే ఆమోదిస్తేసరి. రేపు పోలింగ్ బూత్ ల దగ్గర వుండేది వీరిద్దరే! ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి జలగం వెంగళరావుని ఈ విషయంలో ఏ ముఖ్యమంత్రి అయిన ఆదర్శానంగా తీసుకోవాల్. కృష్ణజిల్లా పరిషత్ చేయిర్మేన్ పిన్నమనేని కోటేశ్వరావుని టీచింగ్ కమ్యునీటి  ఇందుకే అభిమానిస్తారు."

    "అది సరే__ మన బాగోతం కోర్టులో రుజువయితే?"

     "అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ని ఆదర్శనంగా తీసుకో. నిన్ను గద్దె దింపడానికి విదేశీ శక్తులు పన్నిన కుట్ర. అది అంతే" నవ్వుతూ అన్నాడు ఏం.వి.అయ్య.    

    "అంతేనంటావా_అన్నీ అరటి పాండు వలచి చేతిలో పెట్టినట్టు చెబుతున్నావయ్య!"

    "ఈ ఊసుపోక కబుర్లకు ఏమొచ్చిందిగాని, నాపని ఏమంయిదో కనుక్కున్నావా?"

    "ఏది వడయారు కూతురు కార్పోరేషన్ వ్యవహారమేనా దాన్దేముంది. అయిపోయినట్టే లెక్క."

    "కాదు, ఆర్డినెన్స్ తీవాలి. జి.ఓ. నేను చూడాలి."

    "దానికింత పరిష్యానవుతవెందుకు, నీకు కాకపోతే నేను ఎవరికీ చేస్తాను."

    అది నాకు తెలియదు. ఇండియన్ ఇండస్ట్రీయలిస్టులలో

    మొదటి స్థానం ఏం.వి. అయ్య.

    రెండోవా స్థానం ఏ.వి.అయ్య.

    మూడోవ స్థానం ఏం.వి అయ్య.

    నాలుగోవ స్థానం ఏం.వి.అయ్య.

    అయిదోవ స్థానం ఏం.వి.అయ్య.

    ఇలా ఒకటి నుంచి పదివరకు ణా పేరే వినిపించాలి. ఈ పది పేర్లలో ఎక్కాడా ణా పేరు చెరిగి పోవడానికి వీల్లేదు. దానికోసం ఎంతయినా ఖర్చు పెడతాను_ ఏదైనా చేస్తాను. నీకేం కావాలో చెప్పు.

    "అయ్యా! ఈ రోజున నేను ముఖ్యమత్రిగా కొనసాగటానికి కారణం నీవు. ఆ విషయాన్ని నేను నిద్రలో కూడా మర్చిపోను. నీ కోసం నేను ఎంత వరకయినా వెళతాను_ ఏదైనా చేస్తాను. ఎన్ని పేపర్లు ణా గురించి ఏం చేసినా లక్ష్యపెట్టను."

    "దట్ ఐ నో... ముఖ్యమత్రిగా నిన్ను గద్దెమీద కూర్చో పెట్టడమే నా లక్ష్యం."

   
                                    *    *    *    *

    నెమ్మదిగా కళ్ళు విప్పాడు.

    సూర్యకిరణాలు సూదుల్లా చురుక్కున పొడవటంతో వెంటనే కళ్ళు మూసుకున్నాడు. అతికష్టం మీద కళ్ళు తెరిచాడు. తనమీదకు వంగి చూస్తున్నా ఆకారాన్ని గుర్తించాడు. అతడు జానీ!

    అవును జానీ!!

    తంబికోసం ఎంతగా ఏడ్చాడో కళ్ళు ఎర్రబడి వున్నాయి, వాచీ వున్నాయి.

    "తంబి.." ఆ పిలుపు అతడి గుండెల్లో నుంచి వచ్చింది.

    సమాధానంగా పెదవులు కదిలించాడు.

    జానీ చేయిపట్టుకుని లేవబోయాడు. కాని అప్పటివరకూ చచ్చుపడినట్లున్న చెయ్యి, కాలూ భగ్గున మండాయి... సముద్రంలోనుంచి బయటకు వచ్చి చాలా సేపవడంవల్ల తడి అరి గాయాల చుట్టూ ఉప్పు తెల్లగా మెరుస్తోంది. రక్తం  గడ్డకట్టిగడ్డకన్నులా భయభ్రాంతుల్ని చేస్తోంది.కోల్పోయిన సత్తువనంతా తెచ్చుకుని లేచి కూర్చున్నాడు. కాని చేతిలోను, కాలిలోను గచ్చుకున్న బులేత్స్ ప్రాణాలు తోడేస్తున్నాయి. మరిహ కదలలేక కూలబడిపోయాడు. తలలో తిరిగి సన్నటి నొప్పి  ప్రారంభమయింది. కళ్ళుమూతలు పడ్డాయి. అలా ఎంత సేపునన్నాడో అతడికే తెలియదు.

 Previous Page Next Page