Previous Page Next Page 
స్టార్ వార్స్ పేజి 31

    తుఫాకి చేతపట్టుకుని నిల్చునున్న తంబివైపు ఆ ప్రతిభురాలాయి చూసింది. అతడి వయసు ముప్ఫైకి కొంచెం అటేగాని ఇటుకాదు. అతడు తుఫాకి పట్టుకున్న తీరు అతడికి వున్నా కమాండ్ ని తెలిపుతోంది. ఆమె చూస్తున్నది అతడి భంగిమను కాదు. అతడి మేహాన్ని!! అందులో అదోలాంటి పర్సనాలిటీ వుండి. హుందాతనం వుండి. మ్ములుగా చూస్తె కళ్ళకి అతడి అందం మాత్రమె కనిపిస్తుంది. లోతుగా చూడగలిగితే అతడి కళ్ళలో ఒక విధమైన పట్టుదల, కసి కనిపిస్తున్నాయి. అతడు ఇంట్రావర్ట్, అతడిలో ఏదో ఆకర్షన్ ఆమెను పరిమళంలా చుట్టూముడుతొంది.

    పడవలో అచేతనంగా పడివున్న ఆమెవైపు చూశాడతాడు. గాలికి ఆమె ముంగురులు ఎగురుతున్నాయి. పెదవి విప్పి ఒక్క మాటయినా మ్ట్లదకుమ్డ ఎక్కువ భావాన్ని స్పురించ్చేట్టు ఆమె చూస్తున్న చూపులు, చివరికి ఆమె కూర్చున్న పోజిషనులో  వున్నా దర్బం అతడిని అదోరకమైన సంభ్రంలో పడేశాయి. చేతిలోని గం క్రిందపెట్టి ఆమెవైపు అడుగులేశాడు. క్రింద పెదవిని బిగించి పట్టుకున్న తీరు_ అందంగా సిల్ హొటలోలాగా కనబడుతున్న కొనదేలిన ఆమె ముక్కుని చూడటంలేదు. ఆమె వైపు నడుస్తున్నవాడల్లా సదన్ గా వెనుదిరిగాడు. అతడి చెవులువిన్న శబ్దంకన్నా సబ్ కాస్షన్ రియాక్షన్  చాలా  తొందరగా జరగటంతో అతడు వెనుదిరిగాడు. కాని అప్పటికే ఆలస్యమయింది.  సోరచేపవచ్చి మరోమారు  పడవను ఢీకొన్నది. ఆ అదురుకి తంబి తటాలున చేపలా నీళ్ళలోకి  ఎగిరిపడ్డాడు.

    కావ్య అమాయకంగా, అనలోచితనంగా విసిరిన మాంసం ముక్కలకి మూల్యమెంత చెల్లించాల్సి వచ్చిందో ఆమెకు అర్డంగాలేదు.

    ఇప్పుడు తంబి, షార్క్ అభిముఖంగా వున్నారు. సోరచేపకి స్థానబలం వుండి. అందునా గాయపడిన సోరచేప అది. అక్షాణన ఆమె నేత్రంచలాల్లో ఉబికిన నీళ్ళను మిగిలిన ఇద్దరిలో ఏ ఒక్కరూ గమనించే స్థితిలో లేరు.

    తంబి చప్పున పరిస్థితిని ఆకలింపుజేసుకున్నాడు. సాధారణంగా అలా జరగదేప్పుడూ__ ఎంతటి వాడైనా భయపడతాడు. కాని అతడి సబ కాన్షస్ రియాక్షన్ ఎక్కువ తొందరగా వుంది. ఒక చేత్తో మేలలోని కత్తిని బయటకు తీశాడు. మరో చేతిని తెడ్డులా ఉపయోగించుకుంటూ నీటిలో చేపలా కదలడం ప్రారంభించాడు.

    లంచేలోని జానీ సుడిగాలిలా దూసుకొచ్చి స్టీన్ గం తీసుకున్నాడు. కానీ రక్తసిక్తమైన ఆ నీటిలో శార్కుని లోకేట చేయడం చాలాకష్టంగా వుంది. డానికి తోడు కళ్ళను నీటితెర కప్పివేయడంతో శార్కుని ఘాట చేయడం అసంభవం అనిపించింది.

    చిన్నతనం నుంచి తీరం మీదకు విరుచుకుపడే కెరటాలతో పోటీగా పరుగెత్తిన ప్రాక్టిస్ తంబికి ఇప్పుడు ఉపకరించింది. ఏ పోరాటానికయినా ఒక సైన్సు వుంటుందిగాని, ప్రాణాలకి తెగించి 'మరణమో, మ్రుత్యువో, అన్నట్టుగా పోరాడే పావురుకి సైన్సు ఏముంటుంది? షార్క్ నోటికి, తోకకు దొరక్కుండా వెన్నులో కత్తిని గుచ్చి ఆసరాగా పట్టుకుని ప్పావురు ప్రారంభించాడు. వెనుకనుంచి ఎవరో కత్తితో పొడిచినట్టు షార్క్  తాలుకూ ఫిన్స్ మోచేతి దగ్గర గాయం చేసింది_ చివాలున వేనుదిరిగాడు_ మరో పోతు డొక్కల్లో! రక్తం జివ్వున చిమ్మింది. ఇంతకు పూర్వం చాలా సందర్బాలలో  మృత్యు ముఖానికి వెళ్ళి తిరిగి వచ్చాడు. అప్పుడు ప్రత్యర్దులు సాటి మనుషులు. కానీ యిప్పుడు ప్రత్యర్ది సోరచేప. మరణం ఖాయమని తెలిసిపోయింది. తల్లి గుర్తొచ్చింది. చనిపోయే ముందు తల్లిని ఒక్కసారయినా తిరిగిచూడలేకపోయానే అన్న వేదన సమవేధంగా అతడిపై  పనిచేసింది. శక్తిసంతా చేతుల్లోకి తీసుకున్నాడు. హఠాత్తుగా విజ్రుమ్భించాడు. చేతుల్లో సత్తా వున్నంతవరకు సోరచేపను గాయపరుస్తూనే వున్నాడు.

    తన కళ్ళముందే 'బిగ్ బ్రదర్' మృత్యువుతో పెనుగులాడటం జానీ భరించలేకపోయాడు. విచక్షణారాహిత్యంగా కాల్పులు ప్రారంభించాడు. ఫ్లడ్ లైట్ కాంతి డిమ్ గా మీదపడటం తంబికి తెలుస్తూనే వుండి. కాని ఏం జరుగుతున్నదీ గమనించే స్థితిలోలేడు. స్టీన్ గన్ పేలుడు.... నీళ్ళలోకి దూసుకొస్తున్న బుల్లెట్స్... వర్షం__ మోహం చుట్టూ నీళ్ళు ఉప్పుగా తగుల్తున్నాయి. శరీరం మీద గాయాలు ప్రాణాలు తోడేస్తున్నాయి _ ఎంత రక్తం పోయిందో తెలియదు, తెలుపుకునే స్టితిలోలేడు. తడి బట్టల్లోంచి ఎరుపురంగు ధారకకడుతోంది. అతడి కళ్ళు నిసృత్తువతో మూతలు పడుతున్నాయి. స్పృహా తప్పుతున్నట్టు చేతిలోని కత్తి జారి పోయినట్టు_ తన జీవిత నాటకానికి తెర దిగుతున్నట్టు గుర్తించాడు. తల్లి గుర్తొచ్చింది. ఆ తల్లి తాలూకు జ్ఞాపకాలలేనే స్పృహా తప్పింది.

   
                                                          *    *    *    *
   
    రాజకీయాలలో పర్సనల్ ఇమేజ్ మహా ప్రమాదకరం.

    వ్యక్తిగత ఇమేజ్ వల్ల ఓటర్లను ఆకట్టుకునే వ్యక్తితో  ఆ పార్టీ భవిష్యత్తు, ఆ పార్టీ తరుపున పోటీ చేసేవారి భవిష్యత్తు ముడిపడి వుంటుంది. ఇందుకు తాజా ఉదాహరణగా తమిళనాడులో ఏం.జి.ఆర్.ని.ఆంద్రప్రదేశ్ లో ఎన్టీ ఆర్ ని చెప్పుకోవచ్చు.

    కాని జాతీయపార్టీ ప్రతినిధిగా__ రాష్ట్రా ముఖ్యమంత్రిగా నున్న సిన్హాకి ఆ అదృష్టం లేదు కానీ కొన్ని విఉశాయాలలో మహామేధావి. అపోజిట్ పార్టీ నాయుకలతో కూడా అతడికి అత్యంత సన్నిహిత సంభందలున్నాయి. అతంకు ముట్టే ముడుపుల్లో కొంత భాగం నేల జీతం అందినట్టు వారికి అందుతుంది. ప్రతిపక్ష నాయుకుల సొంతపనులు నియమ నిభందనలను ప్రక్కకునెట్టి మరీ చేస్తారు ముఖ్యమంత్రి. దీనివల్ల ప్రతిపక్ష నాయుకుల ముక్యమంత్రి మరీ ఇబ్బంది కలిగించని స్వల్ప విషయాలను బాహాటంగా విమర్శించడం, సవాళ్ళు విసిరి ప్రజల్ని మభ్యపెట్టడం జరుగుతోంది. కాని, తన పార్టీలోనే తనకు ప్రతిపక్షం__ అసమ్మతి వర్గం బయల్దేరింది. పార్టీ క్రమశిక్షణకు  భయపడి అసమ్మతి వాదులేవరూ  బహిరంగంగా ముఖ్యమంత్రిని విమర్శిచడంలేదు. కాని, పార్టీ ఫండ్ కి__ తన గ్రూపు మేయిమ్ట్ నేన్స్ కి ముఖ్యమంత్రి, అతడి అనుచరులు అటువంటి అడ్డదారులు తొక్కిందీ, ముడుపులు స్వీకరించింది. సాక్ష్యాధారాలతో  సహా పత్రికల వారికీ అందించటం- వారు ఆ సమాచారాన్ని ప్రముఖంగా ప్రచురించడం జరుగుతొంది.

    విజయవాడవంటి పట్టణంలో బస్ స్టాండ్ కి ఎదురుగా ఓ నూనె మిల్లు వుంది. ఆ మిల్లుని తన అల్లుడికి స్టాంపు రేటుకి ఇవ్వమని ముఖ్యమంత్రి వత్తిడి తెస్తున్నట్టు, అందుకు ప్రతి ఫలంగా రాష్ట్రంలోని అన్ని మిల్క్స్ ప్యాక్టరీలకు పాలిథిన్ పేపర్ బ్యాగ్స్ సప్లయ్ చేయడానికి వారికే కాంట్రాక్ట్ ఇవ్వజూపినట్టు ఆ రోజు పత్రికలో వచ్చింది. ఆ పత్రిక వచ్చినప్పుడు ముఖ్యమంత్రి దగ్గర మాదాల వెంకట్రామయ్య, మనోహర్ వున్నారు.

 Previous Page Next Page