పిచ్చాపాటీ పూర్తయిన తర్వాత అసలు పాయింట్ కొచ్చారు డిఫెన్స్ మినిష్టర్.
"వదయారు షిప్పింగ్ కార్పోరేషన్ ప్రపోజల్ పై మీ అభిప్రాయం కోరుతూ ఇండస్ట్రీయల్ మినిస్ట్రీనుంచి మాకు లెటర్ అందింది. వాస్తవానికి ధర్మతేజ శిప్పిఉమ్గ్ కార్పోరేషన్ కి_ వదయారు షిప్పింగ్ కార్పోరేషన్ నేచురల్, పస్ఖనిమ్గ్ లో చాలా వ్యత్యాసముంది. అయినా మన నేవల్ ఫోర్స్_ మనం కోస్టల్ ఏరియాలో నిర్వహించే ఎతామిక్ ఎక్స్ ప్లావుజన్ దృష్టా ప్రైవైట్ వ్యక్తులని అనుమతించ వద్దని సిపారసు చేయబోతున్నాం. అవతలి వ్యక్తీ వదయారు అయినందున మీ అభిప్రాయాలనే మరొక్కమారు నేవేల్ పోర్సేస్ నుంచి కూడా కంఫర్మేడ్ గా తీసుకోదలిచాం. దీనివల్ల వదయారు షిప్పింగ్ కార్పోరేషన్ ప్రపోజల్ పెదిమ్గ్ లో పడుతుంది. ఇంతకుమించి, ఇప్పటికే కొన్ని షిప్పింగ్ కార్పోరేషన్ లకు ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోవలసి వుంటుంది."
ఈ విషయమై తను అభిప్రాయమేమిటో తనవారికీ అప్పటికే తెలియజేసినందువలన మాదల వెంకట్రామయ్య పెదవి విప్పలేదు. ఇతర విషయాలు మాట్లాడాడు. వదయారు షిప్పింగ్ కార్పోరేషన్ విషయమై ఏం.వి.అయ్య ఎంత పట్టుదలగా వున్నాడో కేంద్ర మంత్రికి అర్దమయింది.
* * * *
విమానంలో ప్రయాణిస్తున్న వ్యక్తీ క్రిందకి చూస్తె మినహాతము ముందుకు పోతున్నామన్న అభిప్రాయం కలగదు. అదే భావం ఇప్పుడు కావ్య మనసులో పేరుకుపోయింది. అనంతమైన ఆ సాగరంలో తాము ముందుకు వేలుతున్నదీ లేనిదీ తెలియడంలేదు! అసలు తామెక్కడన్నదీ_ ఆ పడవలో ఎంత కాలానికి గమ్యం చేరేదీ ఆమెకు బోధపడలేదు. నిర్వారామంగా ఏదో ఒక వ్యపకంతావు తిరిగిన ఆమెకు అలా గంటల తరబడి ఖాళీగా కూర్చోవడం భరించరానిదిగా వుండి. అప్పుడు జరిగిందిది_ ఆ పడవ ఓ పర్వతాన్ని ఢీ కొన్నట్టు, గలివర్ లిల్లీ పుట్స్ పడవని బొంగరంలా తిప్పినట్టు, ఆ పడవ వున్నట్టుంది వున్నా చోటనే గిరగిరతిరగడం ప్రారంభించింది. యధాలాపంగా నిల్చునున్న కవ్య ఆడురుకి రెండు పల్టీలుకొట్టింది. అలా పడటం పడటం అంచుమీద పడింది. హఠాత్పరిణామానికి ముందుగా మేల్కొన్న వ్యక్తీ తంబి కాదు, ఇంజన్ దగ్గర నిల్చునున్న జానీ.
"తంబీ! షార్క్ ఎటాక్ చేసింది...." అని ఓ గావుకేక పెట్టి ఇంజన్ అన్ చసి అప్రయత్నంగా వున్నాడు.రెండవవాడు ప్లాద్ లైట్, స్టీన్ గం తీసుకుని తంబి దగ్గరకు పడుతూ లేస్తూ వచ్చాడు. విమనలా పక్షులు కొండలు ఎంత ప్రమాదకరమైనవో సముద్రంలో ప్రయాణం చేసేవారికీ సోరచేపలు, తిమింగలాలు, తుఫాను లు అంత [ప్రమాదకరమైనవి. పెద్ద పెద్ద ఓడలు సయితం ఈ ప్రమాదాలను లోనయి సముద్ర గర్భంలో కలసిపోయాయి. ఈ విధంగా సముద్రం పాలయిన ఓడలు, పడవలు ఎన్నెన్నో వున్నాయి. అ విధంగా రెండవ ప్రపంచ యుద్దకాలంలో రంగూన్ నుంచి వెళుతూ మునిగిపోయిన ఈస్టిండియా కంపెనీవారి ఓడ ఆచూకీ తెలుసు కావువదనికే కావ్య తంబి సాయాన్ని కోరింది. ఒక కోటేశ్వరుని కూతురు ఆ విధంగా తనకు తానుగా ఓ చిన్న పడవలో అ మహా సముద్రంలో ప్రయాణం చేయడానికి పూనుకోవడం పెద్ద సాహసం, ఇప్పుడిప్పుడే మాఫియా లీడర్ గా వెలుగులోకి వస్తున్న తంబి అన్నీ తెలిసి వుండీ స్వయంగా ఆ చిన్న లాంచీలో రావడం పెద్ద తప్పు సముద్రంలో చేపలు, తుఫానులకి మించిన ప్రమాదం ఇంకొకటి వుంది . తంబిని ప్రత్యర్ది వర్గాలు ఏ మాత్రం పసిగట్టినా అతడి పై దడి ముఖ్యమైన కారణాలు రెండు వున్నాయి. ఓ ఆడపిల్ల చూపించిన తెగువ ప్రధన కారణమైతే, అ ఓడతోపాటు సముద్రం పాలయిన అమూల్యమైన సంపద రెండవ కారణం.
ప్లడ్ లైట్ వేస్తే షార్క్ మరింత రెచ్చిపోయే ప్రమాదం వుంది.
ఇహా ఆ పార్క్ తో బాహా బహి తప్పదను కున్నప్పుడే ప్లాద్ లైట్ అన్ చేయలి ఏం చేయటమా? అన్న ఆలోచనలో వుండగానే మరోమారు షార్క్ దాడి చేసింది.
"ఫస్టు లోకేట్ ది షార్క్..." స్టీన్ గన్ రెడీ చేసుకుంటూ అరిచాడు తంబి. అతడి బెల్టు కి ఎప్పుడూ వుండే నైఫ్ వుండనే వుండి. శార్కుని లోకేట చేయడానికి ఫ్లిక్కరింగ్ లైట్ పాస్ చేశాడు. జరుగుతున్న దేమిటో అర్ధంగాక చేష్టలుడిగి అలాగే వుండిపోయింది కావ్య.
"తంబీ షార్క్..." అరిచాడు లైట్ బోయ్, మరోమారు దాడి చేయబోతున్న షార్క్ మీదకి లైట్ ఫోకస్ చేస్తూ!
అంతే!!
తంబి చేతిలోని స్టీన్ గన్ పేలింది.
ఒక సరళ రేఖ స్టీన్ గం పేలింది.
ఒక సరళ రేఖ గీచినట్టు ఆ షార్క్ బోటుమీద దాడి చేసేమ్తలో బులేట్స్ షార్క్ వెన్నుని ఛీల్చుకుంటూ పోయాయి.
ఉన్నట్టుంది హఠాత్తుగా ఏం జరిగిందో, ఆ బోటు బొంగరంలా ఎందుకు తిరిగిందో, వారు ఎవరి మీదకి ఫైర్ చేస్తున్నారో ఆమెకు బోధపడలేదు. మాట్లాడే స్టేజీ దాటి పోయినట్టు ఆమె కళ్ళప్పగించి చూస్తోంది. అసలే పద్దవయిన కళ్ళు మరింత పెద్దవిగా కనిపిస్తున్నాయి.
ప్లడ్ లైట్ వెలుగులో ఎర్రబారిన నీళ్ళు స్పష్టంగా కనిపిస్తున్నాయి. శిలలు కుండ నీటిలో మునిగినట్టు షార్క్ వారి కంటపడకుండా సముద్రం అడుగుకి వెళ్ళిపోయింది.
అడవిలో దెబ్బతిని మెన్ ఈటర్ లా మారిన పులి, సముద్రంలో గాయబడ్డ సొరచేప పట్ల అప్రమత్తంగా వుండాలన్న జీవిత సత్యాన్ని మరిచాడు.