Previous Page Next Page 
అమ్మో! అమ్మాయిలు పేజి 30

    " పెళ్ళాడింది పిచ్చి తల్లిని. పెళ్ళి చేసింది యీ పిచ్చి మారాజులు గాబట్టి."

    " ఆ... అయితే నీకలలోకి వచ్చింది జయచిత్ర కాదా?"

    " ఏంటీ, నీ కలలోకి వచ్చింది జయచిత్రా?"

    ఆపై వచ్చిన కలలు అర్ధం చేసుకోటానికి యిద్దరికీ అయిదు నిమిషాలు మించి పట్టలేదు.

    " కలలోనే కదరా పెళ్ళయింది ఏం ఫరవాలేదు" అని దైర్యం చెప్పాడు వ్యాకర్ణ.

    " మరి, నీ కొచ్చిందీ కలే కదా! కొంపలంటుకున్నట్టు అంత గాభరాగా పరుగెత్తుకొచ్చావ్?" అని అబ్బులడిగాడు.

    " కల సంగతి జయచిత్రతో నోరుజారి చెప్పారా అబ్బూ!" అని రాగం తీశాడు వ్యాకర్ణ.

    " దిగులు పడకు, ఈ యిల్లు గాకపోతే మరో యిల్లు నీ తప్పేముంది. నువ్వేం రమ్మని పిలిచావా? పెళ్ళిగాని పిల్ల ఆ పిల్లది తప్పు.

    బ్యాహ్మచారి కల్లోకి రావచ్చా? ఏదన్నా అంటే ఈ మాట ముఖాననేసెయ్యి. ముఖం ఎక్కడ, దాచుకోవాలో తెలియక నీ గుండెల్లో దాచేసుకుంటుంది" అంటూ అబ్బులు తాపీగా చెప్పి తీరుబడిగా లేచి టవలు భుజనేసుకున్నాడు.

    అబ్బులి సలహా విని ఆనందించిన వ్యాకర్ణ అబ్బులి బుగ్గలు ముద్దేట్టుకుని " నువ్వాడపిల్లవయితే నిన్నే పెళ్ళాడే వాణ్ణి" అని విచారించి...

    " ఎక్కడికిరా అబ్బూ" అని అడిగాడు.

    " బాత్ రూమ్ కి" అన్నాడు అబ్బులు.

    " మధ్య దోవలో సుకన్య నాధ అంటూ తగులుకుంటుందేమో రోయ్?" అన్నాడు వ్యాకర్ణ భయపడిపోతూ.

    " భయమక్కర లేదు కర్ణా! అబ్బులి కలలోకి సుకన్యని లాక్కొచ్చారు పెద్దమనుషులు.

    సుకన్య కలలోకి యీ అబ్బులుగాడు వెళ్ళలేదు. వెళ్ళడు" అని అబ్బులు బాత్ రూమ్ కి బైలు దేరాడు.

    " సంగతి అల్లా కాదే. నా కల్లోకి జయచిత్ర వచ్చింది. జయచిత్ర కల్లోకి నే వెళ్ళాను. మాది సియరిస్ కేసు" అనుకున్నాడు వ్యాకర్ణ.

    అబ్బులు బాత్ రూమ్ కెళ్ళే దోవలో సుకన్యా వాళ్ళుండే భాగం రాగానే తలొంచుకుని నడక వేగం హెచ్చించాడు.

    అబ్బులుని సుకన్య చాడనే చూసింది." నాధా! ఇటు రండి ఒక పర్యాయంబు, ఓ నాధా! వినిపించుకో వేమిటి?

    నాన్నగారూ! నాన్నగారు నా పతిదేవులు పారిపోతున్నారు పట్టుకురండి" అంటూ అరిచింది.

    అబ్బులు యింకా తల దించుకుని బాత్ రూమ్ వైపు పరుగుతీశాడు. అబ్బులు తలొంచుకోటం కంగారుతో పరుగుతీయటం పెద్ద యాక్సిడెంటుకి దారితీసింది.

    ఓ అందమైన ఆల్చిప్పలంత కళ్ళు గల చిన్నదాన్ని ఢీకొని, ఢీకొన్న దెవరినో తెలియక కంగారుతో రెండు చేతులూ జాపి ఆ పిల్ల పడిపోకుండా ఆ పిల్లదాని తామరతూడలు లాంటి సుతిమెత్తని జబ్బలని గట్టిగా పట్టేసుకున్నాడు.

    ఆ పిల్ల కంగారు పడింది. జయింట్ విల్  అబ్బులి ఛాతీకి ఆ పిల్ల దాని తల గుద్దుకుంది. ఒక్క అరనిమిషంలో ఆరోవంతు వుండిపోయారు.

    ఆ పిల్ల పేరు బిందు రేఖ. రాత్రి పదిగంటల ఎక్స్ ప్రెస్ కి భజన బృందంగారి యింటికి వచ్చింది.

    భజన బృందం భజగోవిందానికి బిందురేఖ త్మద్రి ఏదో వేలువిడిచిన చుట్టం అవుతాడు.

    బిందురేఖ చదువు పి యు సి. తో పూర్తయింది. టైపునేర్చుకుంది. సంగీతం ( ఆరున్నొక్కరాగం)  అప్పుడప్పుడూ తీస్తుంటుంది.

    విజయవాడలో ఏదో ఉద్యోగంకి ఇంటర్వ్యూ పిలుపోస్తే వచ్చింది.

    అబ్బులు ఆ బిందురేఖనే యిప్పుడు ఢీ కొట్టింది.

 Previous Page Next Page