Previous Page Next Page 
స్టార్ వార్స్ పేజి 29

    ఆ రాఘవయ్య భార్యనే తన అర్దాంగిగా చేసుకుని ఆమె ద్వారా ఓ బిడ్డను కన్నా ఏం.వి. అయ్య__

    ఇటువంటి ప్రశ్న ఒకటి మునుముడు తమ కొడుకు నోటి ద్వారానే వినవలసి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. అందుకే చేష్టలుడిగి చూస్తుండి పోయాడు.

    ఆ ఇద్దరిలో ముందుగా తెరుకున్నది పావని!

    "రాఘవయ్యగారని మీ నాన్నగారి స్నేహితుడోకాయ వుండేవారు. స్నేహంమీద వ్యాపారంలో వాటా తర్వాత కొంతకాలానికి ప్రమాదంలో అయన పోయారు....."

    "గాడ్ మే కన్సోల్ హిజ్ సోల్..." అని, సి యూ డాడీ...." అంటూ వెళ్ళిపోయాడు.

    అతడు వేల్లిపావుయన అయిదు నిమిషాలకు గాని మాదాల వెంకట్రామయ్య ఆ షాక్ నుంచి తేరుకోలేదు. అతడి నుడుదిపై అలుముకున్నా స్వేద బుమ్డువుల్ని ఆమె తన పవితతో సున్నితంగా సృశించింది. ఆమె తన ప్రక్కనుండటం కూడా సత్తువ లేని వదిలా ఆమె భుజం మీదకి తల అనించాడు.

    "అయన పేరు తీసేస్తే బాగుండేది గదా..." అతడి తల నిమురుతూ అన్నదామె.

    "మొదట్లో కాంట్రాక్ట్ను చేయడానికి ఆ ఫరం గుడ్ విల్ వాడుకో వలసి వచ్చింది. తర్వాత  ఆ ఫరంలోని వైట్ మనీ అవసరమయింది. ఆ విధంగా ఆ ఫరం బుక్సులోకి వచ్చింది."

    "ఇప్పుడయిన తీసేయ్యరాదా..."

    "ఈ పని ఓ పదేళ్ళక్రితం చేయవలసింది.... కానీ సడెన్ గా ఇప్పుడు తీసేస్తే అబ్బాయికి అనుమానం రావచ్చు..."

    అంతలో ఫోన్ మోగడంతో వారి సంభాషణకి అంతరాయమేర్పడింది.

    ఆ ఫోన్స్ డిఫెన్స్ మినిష్టర్స్ సెక్రటేరియేట్ నుంచి.

   
                            *    *    *    *

    కనుచూపుమేరలో ఎటు చూసినా నీళ్ళు. ఆకాశంలో తప్పా నరాకటి కనిపించడంలేదు.

    పైన ఆకాశం_ క్రింద నీళ్ళు. ఆకాశంలో కనీసం పక్షులు కాదుగదా మేఘాలు కూడా కనిపించడంలేదు. వెన్నముద్దలా చందమామ మాత్రం అంబరాన మెరిసిపోతున్నాడు. అంతటి మహసముద్రంలోకి చిన్న పడవ మీద వెళ్ళడం ఎంతటి సాహసమో ఆమెకు అప్పుడర్దమంయింది.

    షిప్పింగ్ కార్పోరేషన్ ప్రాజెక్ట్ ఫిన లిజ్ అయితే టాను కొన్ని నెలలపాటు సముద్రంలో వుండవలసిన వస్తుంది. ఒక ఓడను అద్దెకు తీసుకోవడమో_ సొంతగా కొనుక్కోవడమో చేయవచ్చు. అంతకు మించి హెలికాప్టార్  ఓడమీద అద్దెకు లేండ్ అయ్యేలా చూడాలి. లేకుంటే చాలా కష్టం_ అనుకున్నది. అలా ఆలోచిస్తూ తన ప్లేటులో వున్నా తినుబండారాలను  ఒక్కొక్కటిగా నీటిలోకి విసిరేస్తోంది. తంబి తన భైజనం పూర్తీచేసి దిక్కూచి దగ్గరే పెట్టుకుని తాము కరెక్ట్ దైరేష్ణ లో వేలుతున్నదీ లేనిదీ గమనిస్తున్నాడు. మిగతా ఇద్దరూ కేబిన్ లో వున్నారు. అందువల్ల ఆ ముగ్గురిలోఏ ఒక్కరూ కవ్యను గమనించలేదు. గమనిస్తే అంత పెద్ద ప్రమాదం ముంచుకొచ్చేది కాదు.

   
                                                                       *    *    *    *

    రాష్ట్రముఖ్యమంత్రి జాతకాలమీద, పూజలు పునస్కారాలమీద ఎంత నమ్మకమో మాదాల వెంకట్రామయ్య మీద అంతకన్నా పెద్దా నమ్మకం వుండి. కారణం_ రాజ్యసభ  ఎన్నికలు! రాష్ట్రంలోని తన పార్టీలోని అసమ్మతివాదులు పార్టీ నిర్ణయించిన అభ్యర్ధులకు ఓటేయ్యకుండా ప్రతిపక్షాల అభ్యర్దులకు ఓటేసి రాష్ట్రా రాజకీయాలలో తన బలహీనతని అసమర్దతని వ్రేలెత్తి చూపాడానికి_ రాజీకియంగా బలహీన పర్చడానికి పెద్దయెత్తున పథకం వేశారు. ఆ ఎత్తుకి పైఎత్తువేసి ప్రత్యర్డుల్ని చిత్తూ చేసినవాడు మాదల వెంకట్రామయ్య. అపోజేషన్ పార్టీ ఎమ్మెల్యే లందర్నీ డబ్బుతో కొనేసి అధికార పార్టీ అభ్యర్డులకి ఓటేసేలాచేశాడు. అంతకు మించి పార్టీలోని అసమ్మతి ఫలితంగా అధికార పార్టీ అభ్యర్డులందరు విజయం సాధించడమేగాక రాష్ట్రంలో గెలుపొందవలసిన ఇద్దరు ప్రతిపక్ష అభ్యర్డులూ గ్ఫ్హావురంగా ఒడిపోయారు. రాజ్యసభకు తన పార్టీ అభ్యర్దులు అదనంగా ఎన్నిక కావడం ముఖ్యమత్రి పరపతిని విపరీతంగా పెంచింది. పర్యవసానంగా రాహ్స్త్రముఖ్యమంత్రి సూచించిన ఇద్దరికీ కేంద్రంలో మంత్రిపదవులు లభించాయి. ఒకరు కేబినేట్ హొదాలో డిఫెన్స్ మినిస్ట్రీలోవుంటే మరోకరు డిప్యూటీ హొదాలో ఇండస్ట్రీయల్ మినిస్ట్రీలో వున్నారు. ఆ విధంగా మాదల వెంకట్రామయ్య కి రాష్ట్రమంత్రి వర్గంలోకి కాక కేంద్ర కేబినేట్ లోకూడా పలికుబడి వుండి.

    షిప్పింగ్ కార్పోరేషన్ పేరిట వదయారు కూతురు కావ్య ప్రపోజల్స్  పంపగానే మాదల వెంకట్రామయ్య జోక్యం కల్పించు కోవడం ఆ ప్రాజెక్ట్ కి ఎక్కడలేని  ప్రాధాన్యత వచ్చింది. జవహర లాల్ నెహ్రూ ప్రధనమంత్రిగా వుండగా జయంతి ధర్మతేజ షిప్పింగ్ కార్పోరేషన్ ప్రారంభించడం__ ఆ కార్పోరేషన్ పై దుమారం చేలరేగడం__ఎంక్వయిరీ జరగడం_ జయంతి షిప్పింగ్ కార్పోరేషన్ ధర్మతేజ ఇండియా విడిచి వెళ్ళిపోవడం అందరికీ తెలిసిందే! జయంతి ధర్మతేజ తర్వాత అంతటి ప్రాధాన్యత కావ్య ప్రారంభించిన సంకల్పించిన వదయారు షిప్పింగ్ కార్పోరేషన్ కి వచ్చింది. పారిశ్రామిక రంగంలో వదయరుకి ఏ.వి. అయ్యకి వున్నా పోటీ ఈ ప్రపోజల్ లో మాదల వెంకట్రామయ్య జోక్యానికి పూరికోల్పింది. ఏం.వి.అయ్య అధికార పార్టీ వ్యక్తీ అని అందరికీ తెలుసు. అతడు అధికార పార్టీ అభ్యర్దుల విజయానికి ఎంత ఖర్చు పెడతాడో, ప్రతి పక్షలనేతల వ్యక్తిగత విజయానికి అదే నిష్పత్తిలో విరాలమిస్తాడన్న సంగతి అతి కొద్దిమందికి తెలుసు. అయిన ఈ వ్యవహారాన్ని ప్రతిపక్షాలు అధికర పక్షంపై దుమ్మెత్తి పోయడానికి వినియోగించు కోవచ్చు. బోఫోర్స్ వ్యవహారం తర్వాత అధికార పార్టీ ప్రతి చిన్న విషయాన్ని అత్యంత జాగ్రత్తగా పరిశేలిస్తున్నదీ. ఇదే విషయమై ఏం.వి.అయ్య తో చర్చించడానికి మినిష్టర్ మెసేజ్ పంపించారు.

 Previous Page Next Page