హరికృష్ణమనాయుడు____
కళ్ళజోడు సర్దుకుంటూ ,దూరంగా నిల్చున్న వ్యక్తివేపు చూస్తూ__
"టైమయినట్టుంది....వెళ్దామా...." చేతి వాచిని చూచుకుంటూ అన్నారాయన.
"ప్రమనోత్సవం స్టార్టయి....అయిదు నిమిషాల్తెంది....ఇప్పడే మెసేజ్ వచ్చింది....."
"మంత్రి పదవులు ఎవరికోచ్చాయో....ఏమన్నా తెలిసిందా?" గంభీరంగా అడిగాడాయన.
"మీకు ఇస్తారని.....అనుకుంటున్నారు....ఇవాళ పేపర్స్ కూడా అలాగే రాసాయి....." నెమ్మదిగా చెప్పాడాయన.
"మనం....మనవాళ్ళు.... అనుకోవడంకాదు....పి ఏం .....అనుకోవాలి....పి.ఏం.....దృష్టిలో.....నేనుంటే ముందుగా ఒక్కమాటైనా నాకు చెప్పేవాడాయన" ముందుకడుగేస్తూ అన్నారు హరికృష్ణమనాయాడు
"మన....పి.ఏం....గారి గురించి .....ఎవరికీ తెలిదు టి....తాగడానిక్కూడా అరగంట ఆలోచించి మరి తాగుతాడని.....ఆ మధ్య ఎవరో కామెంట్ చేసారు....మీ ప్రెండ్ గురించి మీకు తెలిదా...." ఆయన వెనకే అడుగేస్తూ అన్నాడాయన. ఆయన పేరు సూర్యసాగర్" ఆయనకోయాభ్తే ఏళ్ళుంటాయి....ఒకప్పుడు హరికృష్ణమనాయుడు కాలేజి మేట్ సూరి సాగర్__ ఆ తర్వాత అంతరంగికుడు ప్రస్తుతం హరికృష్ణమనాయుడు పర్సనల్ లాయర్.
"పి.ఏం.....బలవంతమ్మిద పొలిటిక్స్ కొచ్చాను_ పిలిచి సిటిస్తే కాదనలేకపోయాను.... ఎం.పి నయ్యాను.....పవర్ లో ఉన్న పార్టిలో .... ఉండడం మంచిదే....ఏ పవర్ ఎప్పుడుపయోగపడుతుందో.....ఎవరికీ తెల్సు....ఎంత పి.ఏం ....నాకు ప్రేండయినా, ఫస్ట్ టైమ్.....ఏం.పి... అయిన వ్యక్తిని నేను. పి. ఏం....నాకు మినిస్టి ఇస్తాడని నేననుకోను. అడిగినపుడల్లా కాదనకుండా, పార్టికి పండ్ ఇచ్చాను. దానికి కృతజ్ఞాతగా ప్రధాని నాకు ఎం.పి సిటిచ్చాడు. అంతకంటే ఆశించడం తప్పు. ఈ రాజకీయాల్ని నేనెప్పుడూ నమ్మాను. నమ్మితే, ఉన్నది పోతుంది, ఉంచు కొన్నది పోతుంది"
సూట్ బయటకొచ్చాడు హరికృష్ణమనాయుడు___
బయటకు రాగానే దూరంగా నుంచున్న ఆప్తాజనం....గబగబ దగ్గరకొచ్చి, అభినందనలు తెలియజేయడం ప్రారంభించారు.
అందులో ఎక్కువమంది ఇండస్టి యలిస్ట్ లే ఉన్నారు.
వాళ్ళ మధ్య ఓ కాకియూనిఫారం కన్పించడంతో , ఆశ్చర్యంతో ఆ వ్యక్తిని చూసారు నాయుడు.
"సౌత్ జోన్ డి.సి.పి.....మిస్టర్ అగర్వాల్ ....మిమ్మల్ని కలవడాని కొచ్చారు" పక్కనున్న పి.ఏ చెప్పాడు.
"నన్ను కలవడానికి పోలిసఫిషియల్స్ ఎండుకోస్తున్నారు" అన్నట్టుగా లాయర్ సూర్య సాగర్ వేపు చూసారు నాయుడు.
"ఊరక రారు....పోలిసులు" నవ్వుతూ అని, అగర్వాల్ వేపు చూసాడు సూర్యసాగర్.
"కంగ్రాచ్యులేషన్స్ సార్.....ఒక అరగంట తర్వాత మీరు హొం మినిస్టర్ సర్" ఏదో చెప్పబోయాడు అగర్వాల్.
"నువ్వెవరో .....నాకు తెలుస్తూనే ఉందిలే.....హొం ఇస్తే....నిన్ను మర్చిపోను. ఇవ్వక పోయినా మర్చిపోను, ఎందుగా వచ్చి పలకరించావ్" లిప్ట్ వేపు సడావబోయి పక్కకు తిరిగారు హరికృష్ణమనాయుడు.
"అమ్మాయి దగ్గర్నించి ఫోనేమ్తెనా వచ్చిందా?"
"నిన్న న్తెట్ చెయ్యడమే"
ఒక్క క్షణం ఆలోచనలో పడ్డాడాయన.
"ప్లయిట్ ఎక్కేముందు ఫోన్ చెయ్యమని చెప్పాను. మరోపని చెయ్యండి....బహుశా అమ్మాయి ఏ క్షణంలోన్తేనా రావచ్చు. మన సూట్లో ఎవర్నయినా ఉంచండి."
"మనవాళ్ళు ఉంటారు.....అమ్మాయిని రాష్టపతి భవన్ కి తీసుకు రావడానికి ఏర్పాట్లు చేసాను."
"గుడ్ .....వెరీగుడ్.....అమ్మాయికి టైమ్ సెన్స్ ఎక్కువ. సాదారణంగా లేటు కాదు" కూతురు జ్ఞాపకం రావడంతో ఉత్సాహంగా వచ్చింది హరికృష్ణమనాయుడికి.
ఇండికేటార్ లో కన్పిస్తున్న ఫోర్ నెంబర్ల వేపు చూస్తూ లిప్ట్ ముందు నించున్నారాయన.
అదే సమయంలో____
హరికృష్ణమనాయుడు సూట్లో ఫోన్ మోగింది.
అప్పడు ఆ సూట్లో ఎవరూలేరు.
సూట్ కు కొంచెం దూరంలో లిప్ట్ కోసం ఎదురు చూస్తున్న హరికృష్ణమనాయుడుకి ఆ ఫోన్ శబ్దం స్పష్టంగా వినిపించింది. ఆయన దృష్టి కొన్ని గంటలుగా ఫోన్ మీదే ఉంది.
క్రితం రాత్రి కూతురు ఫోన్ చేసినపుడు ఆయన సూట్లోలేడు మూడు నేలల్తెంది కూతుర్ని చూసి___ఎలక్షన్ల ముందు చూడడమే. ఎందుకో తెలిదు___
గత వారం రోజులుగా, ఆయనేపని చేస్తున్నా కూతురే జ్ఞాపకం వస్తోంది. లిప్ట్ దగ్గర్నించి వెనక్కొచ్చి ఫోన్ అందుకున్నారు హరికృష్ణమనాయుడు.
"హలో....నాయుడు హియర్....."
కూతురు స్వరాన్ని వినడానికి ఉబలాటపడుతున్నాడు హరికృష్ణమనాయుడు.
"కృష్ణమనాయుడు...." అవతలి వ్యక్తి స్వరం, తనని ఏకవచనంతో సంభోదించడంతో కృష్ణమనాయుడు మ్తేండ్ ఎలర్టయింది.
"హు ఆర్ యూ....?" కృష్ణమనాయుడు ఒకింత కోపంగా ప్రశ్నించారు.
"నీకున్న శాత్రువుల్లో పవర్ పుల్ శత్రువుని....." అవతలి వ్యక్తి గొంతు చాలా పొగరుగా ఉంది.