సడన్ గా, అక్కడ ప్రత్యేక్షమైన, ఆ వ్యక్తెవరో అర్ధంకాలేదు పుష్పక్ కి.
సూర్యతేజ__
గబగబా ముందుకొచ్చే, అవలిలగా అతని చేతిలోని కత్తిని లాక్కుని__
అతని కంఠమ్మిద బలంగా చెయ్యివేసి, అదిమిపట్టి__
"ఎవర్నువ్వు...." అని అడిగాడు.
"మా అన్నాగారు పంపిన స్పూన ....చెక్ మీద సంతకం చెయ్యాలట...."అంది ముక్త కోపంగా.
పుష్పక్, సూర్యతేజ బలమైన ఉక్కు పిడికిలి నుంచి తప్పుంచుకో డానికి విశ్వప్రయత్నం చేస్తున్నాడు పట్టు దొరకడం లేదు.
చింపి విసిరేసిన చెక్ ముక్కలనుఏరి, ఒక ఉండలా చుట్టి పుష్పక్ దగ్గరకొచ్చి, అతని జేబులో పడేసింది ముక్తనంద.
"మళ్ళి ఇలాంటి ప్రయత్నలేప్పడూ చెయ్యేద్దని చెప్పు...." అన్నయు సూర్యతేజ కోపంగా.
"వాడ్ని ....వదిలెయ్యి....తేజ...." అంది ముక్త.
"మళ్ళి ....ఇంకొక్కసారేప్పడైన....నువ్వుగాని , మీ రవిచంద్ర కానీ....ముక్తకేవ్తేనా హాని తలపెట్టారో ....ముక్తవేపు చూసారో....తాట వలిచేస్తానని చెప్పు..." అంటూ ....పుష్పక్ చేతుల్ని వెనక్కి విరిచి పట్టుకుని _హల్లోకి తీసుకొచ్చాడు
"గెటవుట్...." గట్టిగా అన్నాడు తేజ.
పుష్పక్ తలవంచుకుని గేటు తెరచుకుని రోడ్డు మీద కొచ్చాడు.
పుష్పక్ బయటకు వెళ్ళిపోవడంతో, తేజ లోనికి నడిచాడు. అతని వెనకే హాలు తలుపుల్ని క్లోజ్ చేసి లోనికి నడిచింది ముక్త.
"ఇవాళ నువ్వు లేకపోతే.....ఏమ్తే ఉండేదో...." ఆమె కళ్ళల్లో ఒక్క క్షణం భయం కదలాడింది.
"నిన్ను వంటరిగా వదిలేసి, డాడి అలా వెళ్ళిపోవడం ఏం బాగా లేదు... గుడ్ న్తెట్ ...రెస్టు తీసుకో" మరోమాట మాట్లాడకుండా, తనగది లోకి వెళ్ళిపోయాడు సూర్య తేజ సూర్యతేజ ఎవ్తేనా మాట్లాడతాడేమోనని ఆశించింది ముక్త__తన గదిలోకెళ్ళి, నిద్రపోవడానికి ఉపక్రమించింది.
కానీ__
చాలాసేపు__
ఆమె కంటిమీదకు నిద్రరాలేదు.
* * *
జ్తే పూర్ ఏమ్ .పి___
జయేంద్ర మక్వావా పర్సనల్ రూమ్ లో లాయర్ సూర్యసాగర్ కూర్చున్నారు.
ఆయన కెదురుగా జేయేంద్ర మక్వానా
తానెందుకోచ్చాడో చెప్పారు సూర్యసాగర్.
"యూ ఆర్ కరెక్ట్ ....ఆ రోజు నేనూ చూసాను....ఆ సూట్ కేస్ ని గురువుగారి పర్సనల్ .....కాబిన్లో ఉంది....బహుశా, ర్తేల్వే పోలీసులు హేందోవర్ చేసుకున్నారేమో....."
వెంటనే, జయేంద్ర మక్వానా జ్తే పూర్ ర్తేల్వే స్టేషన్ , ర్తేల్వే సర్కిల్ ఇన్ స్పెక్టర్ కి ఫోన్ చేసాడు.
"ఎస్. సర్.....ఆ సూట్ కేసు ఉన్న మాట నిజమే....కానీ...నిన్న నే డిల్లి హొం డిపార్ట్ మెంట్ నుంచి వచ్చ్సిన ఇద్దరు అఫిషియల్స్ పట్టుకెళ్ళి పోయారు సర్....."
"వారి ఎడ్రస్ చెప్తారా...." ఆడిగాడు ఏమ్.పి.
రెండు నిమిషాలలో ఆ అఫిషియల్స్ అడ్రస్ చెప్పడు ర్తేల్వే సర్కిల్ ఇన్ స్పెక్టర్.
"ఆ సూట్ కేసు....హొం డిపార్టుమెంట్ కస్టిడిలో ఉందట.... సూట్ కేసు ఉండినగానే, పోయిన ప్రాణం వచ్చినట్టయింది సూర్యసాగర్
"ఆ సూట్ కేసుని వచ్చి తీసుకోమని, బహుశా హొం డిపార్ట్ మెంట్ హరికృష్ణమాన్యుడు కొడుకు రవిచంద్ర గారికి ఉత్తరం రాయొచ్చు.... మళ్ళి చెప్పాడు జేయేంద్ర మాక్వానా.
"ఆ అఫిషియల్ ప్రాసిడింగ్స్ .....జరక్కముందే.....ఆ సూట్ కేసుని మనం స్వాధీనం చేసుకుంటే మంచిది .....ఈ విషయంలో మీ కోపరేషన్ కావాలి....."
"ఏం...."
అసలు విషయం చెప్పుకొచ్చాడు సూర్యసాగర్"
"ముక్తను అన్యాయం జరగడానికి వీల్లేదు....."అంతవిన్న తర్వాత జయేంద్ర మక్వానా తన అభిప్రాయం చెప్పి__
ఈ విషయంలో మీకు నా పూర్తి కోపర్ షాన్ ఉంటుంది. ఈ వేనింగ్ ప్లయిట్ కి బయలు దేరాదాం...."
అప్పటికప్పడు, తన పి.ఎని ఎయిర్ పోర్ట్ కి పంపించాడాయన.
* * *
"తేజ....అంటే సూర్యసాగర్ కొడుకు....అంటే ....ముక్త, బలాన్ని సమీకరించుకుంటోందన్న మాట" రకరకాలుగా ఆలోచిస్తున్నాడు రవిచంద్ర.
"ఆలోచిస్తూకూర్చుంటే....పనులుకావు...." గదిలోంచి బయటికొస్తూ అంది అనిమిష.
"అర్దరాత్రి అక్కడ గొడవపడడం, బాగోదని ఊరుకున్నాను....
ఆ తేజ ఇక్కడనుంచి వెళ్ళేలోపల, వాడిశావం ....మెరినాబీచ్ లో తేలుతుంది" కోపంగా అన్నాడు పుష్పక్ .
"ఇప్పటికి నువ్వు చాలాసార్లు , చాలామంది గురించి, భీకరప్రతి జ్ఞలుచేసావు.....ఎ ఒక్కడూ శవం కాలేదు." రవిచంద్ర నవ్వుతూ అన్నాడు.
"అయితే.... ఈసారి చూడండి. రెండ్రోజుల్లో, తేజని శవంగా చూపించకపోతే.....నా పేరు పుష్పక్ కాదు...."
"ఇంకో ప్రతిజ్ఞ చేసావన్నమాట....ఆ ఉమ్మడియర్ మేనేజర్ ఇవళోస్తాడు. వాడ్నే లాగైనా మేనేజ్ చెయ్యి.... ఉమ్మిడియర్ నా గురించి అడిగితే , డిల్లి వెళ్ళనని చెప్పు. మన లాయర్ కి ఒకసారి ఫోన్ చేసి, నేనోస్తున్నానని చెప్పు....." చెప్పాడు రవిచంద్ర.