Previous Page Next Page 
సక్స్ స్ పేజి 28



    వాచ్ మెన్  ఉంటే, అతన్ని ఎదుర్కోడానికి సంసిద్దంగా, చేతిలోని కత్తిని రెడి చేసుకుని , మెయిన్ గేటును గబగబ లాం దాటి, పోర్టి కోలో నిలబడి అటూ ఇటూ చూసాడు. లోనికి ప్రవేశించడానికి దారికోసం చూస్తున్నాడు.

    అప్పుడు కనిపించింది-వెనుక పక్క గది లో వెలుగుతున్నలైటు ....

    నెమ్మదిగా-

    కిటికీ రెక్కను తెరచి చూసాడు.

    లోన ఏదో పుస్తకం చదువుతోంది ముక్తనంద.

    పడి నిమిషాలు వెయిట్ చేసాడు పుష్పక్.

  
               *                   *                       *   

    గోడ గడియారం వేపు చూసింది ముక్త- పదకొండున్నర....చేతిలోని పుస్తకాన్ని, పక్కనున్న టేబుల్ మీద పడేసి  మంచమెక్కింది.

    ఎక్కడో ధారాపాతంగా నీళ్ళు కారుతున్న చప్పుడు.

    ఎక్కడ?

    హాల్లోని బాత్ రూమ్  టాఫ్ ని కట్టడం మర్చిపోయిందా తను? శబ్దం....బాత్ రూమ్ లోంచే విన్పిస్తోంది....లేచి ల్తెటు వేసి, మంచం దిగింది.

    బాత రూమ్ వేపు నడిచింది.

    బెడ్ రూమ్ కి  మధ్య చిన్న వరండా - ఆ వరండా స్థంభం మాటున నిశ్శబ్దంగా చీకటిలో కదిలిన  ఓ ఆకారం.

    కళ్ళు చిట్లించుకుని చూసింది- ఎవరూ కనబడలేదు. బాత్ రూమ్  టాప్ ని కట్టేసి, వెనుతిరిగిముక్త-

    అక్కడ కనుపించిన దృశ్యాన్ని చూసి కెవ్వున అరవబోయింది గొంతు పెగలలేదు.

    ఎదురుగా , చేతిలో కత్తితో పుష్పక్!

    అతన్ని ఎక్కడ చూసిందో, జ్ఞాపకం తెచ్చుకోడానికి ప్రయత్నిస్తోంది ముక్త.

    "అరిస్తే....చస్తావ్ ....నేను చెప్పినట్టు చేస్తే ....నువ్వు బతికిపోతావ్....."

    "ఎందుకొచ్చావ్....."ద్తేర్యాన్ని కూడా దీసుకొని అడిగింది ముక్త అప్పటికి అతనెవరో గుర్తుకొచ్చింది ముక్తకు. తండ్రి శవం దగ్గర, రవిచంద్ర పక్కన నిల్చున్న వ్యక్తి.

    పుష్పక్ అంటే వీడేనా! విషయం అర్ధమ్తెపోయింది  ముక్తకు.

    "మాట్లాడకుండా...బెడ్ రూంలోకి నడు....ఎందుకోచ్చానో చెప్తాను...." నెమ్మదిగా అన్నాడు పుష్పక్.

    మౌనంగా  బెడ్ రూం లోకి  నడిచింది ముక్త.

    పుష్పక్ ఎ మాత్రం ఆలస్యం చెయ్యలేదు.

    "మేటర్ ఆఫ్ ఒన్ మినిట్ జాబ్....ఈ చెక్ మీద ని సంతకం కావాలి....ఎవరు పంపించారో....నీ కర్దమ్తెపోయి ఉంటుంది....ఎందుకు... ఏవిటి....ప్రశ్నలు వేసి, టైం వేస్త చెయ్యకుండా , సంతకం పెట్టేస్తే .....వెంటనే నేను వెళ్ళిపోతాను.... లేకపోతే...."

    చేతిలోని  చెక్ ను ....ఆమెకు అందేటట్లుగా బెడ్ మీదకు విసిరాడు పుష్పక్ .

    ఆ చెక్ నీ  చేతుల్లోకి తీసుకుని ఎదురుగా నుంచున్న పుష్పక్ వేపోక సారి దూరంగా టేబిల్ మీదున్న ఫోన్ వేపు ఒకసారి చూసింది.

    "నువ్విప్పుడు....సీరియస్ గా ఆలోచించడంవల్ల  ప్రయోజనం లేదు. నువ్వు సంతకం చెయ్యనని మొండికేసావనుకో....ఎలా చేయించాలో నాకు తెలుసు.... గెస్ట్ హౌస్  చుట్టూ .... మా మనుషులున్నారు .... నిన్నిక్కడ  నుంచి తీసికెళ్ళిపోవడం....పెద్ద సమస్య కాదు..." ముందుకోస్తూ అన్నాడు పుష్పక్,

    సంతకం చెయ్యాలా! వద్దా! ఒక్క క్షణం  తటపటయించింది ముక్త. 

    "నువ్వు యుద్దానికి దిగేవనుకో....గేలుప్తెన , ఓటమ్తెన , రెండింటికి సిద్దంగా ఉండాలి....చివరి వరకూ నిలబడాలి, అస్త్ర విన్యాసం తప్పు, అస్త్ర సన్యాసం ఎప్పడూ నిన్ను విజేతగా నిలబెట్టలేదు....గుర్తుంచుకో ...." లాయర్ సూర్యసాగర్ మాటలు గుర్తుకొచ్చాయి ముక్తాకు.

    తండ్రి మరణం....అన్న చేసిన పరాభవం....దుఃఖంతో  ఇంట్లోంచి బయటి కోచ్చేసిన దృశ్యం.

    ఆ సంఘటనలు జ్ఞాపకం రాగానే ....కనుకొలకుల్లో చిన్న తడి కదలాడింది.

    అప్పటికప్పడే, ఒక నిశ్చయానికొచ్చేసింది ముక్త.

    "ముక్తా....తీరిగ్గా  ఆలోచించడానికి టైం లేదు....ముందు సంతకం పెట్టు..."

    కళ్ళెత్తి చూసింది ముక్త.

    "ఆ టేబిల్ మీద పుష్పక్ ముఖం వికసించింది.

    "గుడ్....గాళ్...." గోడ పక్కనున్న టేబిల్ వేపు నడిచి,పెన్ అందుకుని ముక్తకు అందేటట్టుగా విసరబోయి, ఆగిపోయాడు.

    ముక్త చేతిలో నాలుగు ముక్కల్తేన చెక్!

    చెక్ ను  పరా, పరా చింపేసి,

    "వీటిని  పట్టుకెళ్ళి మీ రవిచంద్రకియ్యి.....మళ్ళి ఇలాంటి ప్రయత్నలేప్పడూ చేయ్యేద్దని చెప్పు..." కోపంగా అనేసి, ఆ ముక్కల్ని అతని మీదకు విసిరికొట్టింది ముక్త.

    నిశ్చేష్టుడ్తెపోయాడు పుష్పక్.

    ముక్తాలో అంతదైర్యం ఉంటుందనుకోలేదతను.

    "యూ....నిన్ను...." భీకరంగా , ఆరుస్తూ దగ్గరకు రాబోయాడు పుష్పక్.

    అప్పుడు చూసాడు గది  తలుపుల్ని  అనుకుని నిలబడ్డ వ్యక్తని .

    సూర్యతేజ.....   

 Previous Page Next Page