ఇండస్ట్రీయల్ గా దేశం మరో పదేళ్లు వెనక్కీ వెళ్తుంది. సోనియేట్ రష్యాలో కూడా ఆర్దిక పారిశ్రామిక నూతనత్వానికి 'పెరిస్తోయికా' ద్వారా నంది పలికారు గార్చ చెవ్. అంటే... బ్రతకటానికి తిండి ఆ తిండి కోసం పని అయినప్పుడు వారి కాయ కష్టం కూడా లిమిటెడ్ గా వుంటుంది.
అధికశ్రమ, అధిక ఉత్పత్తి, వ్యక్తీ గత లాభం వున్నప్పుడే సాధ్యమవుతుంది. ఒకప్పుడు ఇండియా అగ్రికల్చర్ మీద ఆధారపడేది. కాని ఇప్పుడు ఇండస్ట్రీ వ్ మీద ఆధారపడవలసి వచ్చింది. అది ఇండస్ట్రీయల్ ప్రోగ్రేస్ వందలు వేళ ఎకరాల పొలం వుండేది. బారీ వ్యవసాయం చేసేవారు. కాని భూసంస్కరణవల్ల ఒక్కొక్క రైతుకి మిగిలింది పద్దెనిమిది ఎకరాలు. ఈ పొలాన్ని నమ్ముకుని వ్యవసాయం ముఖ్యవృత్తిగా ఆధునిక వ్యవసాయం చేయలేడు. అలాగని వున్నది వదులుకోలేడు. దీనితో రైతు కూలీ వ్యవసాయం చేస్తూ పల్లెల్లో వున్నాడు. సన్నకారురైతు పట్నానికి వచ్చాడు_ఇండస్ట్రీ కాకపోతే ఏదో చిన్న వ్యాపారం మెదలేడుతున్నాడు. గవర్నమెంట్ పాలసీ కూడా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ స్ కి ప్రాధాన్యత ఇస్తోంది. దీనివల్ల పల్లెలనుంచి పట్నాలకు వలస అధికమయింది. అందుకే పట్నాలలో ఇళ్ళ స్థలాల రెట్లు పెరిగాయి. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ స్ రావడంతో పట్నాలకు అంటిపెట్టుకొనివున్న గ్రామాలు క్రమక్రమంగా పట్నాలలో కలసిపోతున్నాయి . పూర్వం గ్రామాలలో జనం సంవత్సరానికి అయిదు నెలలు విపరీతంగా కష్టపడేవారు. అయిదు నెలలు వృధాగా కాలక్షేపం చేసేవారు. ఇప్పుడు ఆ మందకోండితనం. పోయింది. మనషుల్లో ఫాస్ట్ నేస్ వచ్చింది. అదీగాక ఎవరికీ వరు తమ పిల్లల ' చదువు... భవిష్యత్తు విషయంలో జాగ్రత్తపడుతున్నారు. ఇందిరాగాంధీ హయంలో ఆమె సుప్రిమసీ వల్ల మన దేశంలో ఇండస్ట్రీ స్ ప్రారంభించడానికి విదేశీ దెబ్బతిన్నది... షేర్ మార్కెట్ విపరీతమైన ఒడిదుడుకులకు లోనయింది. రాజీవ్ గాంధీ పాలనలో ప్రారంభ దినాల్లో వాతావరణం చాలా అనుకూలంగా వుండి. కాని 'భావుఫర్స్' పుణ్యమా అని ఇండియన్ ఎకానమీ దెబ్బతింటోంది. గవర్నమెంట్ సుస్థిరంగా వున్నప్పుడు దీర్ఘకాలిక ప్రణాలికల్ని చేపెట్టకలుగుతుంది. పాలసీని నిర్ణయిస్తుంది. ప్రభుత్వ మనుగడపై అనుమానాలు తలెత్తినప్పుడు ఏ వ్యాపార వేత్త ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోలేదు. బ్లాక్ మార్కెట పెరుగుతుంది. ఫిస్కల్ గ్లాసెస్ వుండదు. అంతే!!"
"అవును డాడీ.... న ఫైబర్ గ్లాసెస్ ప్రాజెక్టు మీరెందుకుఆ ప్రూఫ్ చేయల్డు__" మనోహర్ ప్రశ్న.
"మీ తండ్రీ కొడుకులిద్దరూ ప్రాజెక్టులు ఇండస్ట్రీస్ అంటూ కూర్చుంటారా? లేక ఇంట్లో నాకు ఆడతోడుని తీసుకోస్టారా? లేదా? పావని నిలదీసింది.
ఆమె ప్రశ్నలోని అంతర్యం ఆ ఇద్దరికీ వెంటనే అర్డంగాలేదు.
ఆ ఇద్దరిలో ముందుగా తెరుకున్నది మాదల వెంకట్రామయ్య. "నీ కొడుకు ఫలానా , మాదాల వెంకట్రామయ్యగారి అబ్బాయి అని వెడ్డింగ్ కార్డులో వేసుకుంటాడో__ ఫలానా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అని వేసుకుంటాడో నిర్ణయించుకోమను" అని మరోమాట అన్నాడు. "మనూ! ఈ రోజున మనం కొత్త కొత్త ఇండస్ట్రీస్ పెట్టి సంపాదించవలసిన పనోలేదు. ఐ వాంట్ రికగ్నిషన్_ఫేమ్. మార్కెట్లో కొన్ని ప్రోడక్ట్స్ అమ్ముతాయి. మరికొన్ని సంస్థల గుడ్ విల్ సరుకుల్ని అమ్మిపెడ్తాయి. నాకులేని అడ్వాంటేజ్ నీకొకటి వుండి. ణా కెరీర్ రాగ్స్ నుంచి ప్రారంభామయింది. కానీ నీ కెరీర్ రిచేస్ నుంచి ఆరంభమవుతోంది కెరీ అన్..."
"ష్యూర్ డాడీ..." లేచిన వాడు బయటకు వెళ్ళబోతూ త్రుటి కాలంపాటు ఆగాడు.
"ఏమిటి..." అన్నట్టుగా కొడుకు ముఖంలోకి చూశాడు మాదాల వెంకట్రామయ్య.
"డాడీ! మన ఎర్లియర్ ఫరంస్ అన్నీ రాఘవయ్య అండ్ అసోసియేట్స్ పేరున రిజత్ర్స్ అయి వున్నాయి. ఎవరీ రాఘవయ్య..."
ఎప్పుడో పాతికేళ్ళక్రింత బూడిద అయిపోయిన రాఘవయ్య హఠాత్తుగా వారి ముందుకీ వచ్చాడు. ఆ రాఘవయ్యతో కాపురంచేసి రాఘవయ్య కు ఓ బిడ్డను కూడా కన్నా పావని__