బాస్ ఒక్క నిమిషం ఆలోచించి "ఆల్ రైట్" అని అతని దగ్గరిగా జరిగాడు.
"జరిగింది టూకీగా చెప్పేస్తాను.
అనంతపద్మనాభశాస్త్రి, సుందరమూర్తి ముఖ పరిచయస్తులు.
ఓసారి వారికో గుప్తనిధి రహస్యం తెలిసింది.
యీ ఊళ్ళో ఉండగానే వారికి ఆ నిధి రహస్యం తెలుసు.
జరుగుబాటు కావటం లేదు. ఉద్యోగం దొరకటం లేదని చెప్పి ఉన్న కొద్దిపాటి ఆస్తి అమ్ముకుని మిత్రులు రంగూన్ వెళ్ళారు. పైకి వ్యాపారం చేసుకోటానికి అని చెప్పారు.
రంగూన్ లో వ్యాపారం చేస్తూనే నిధి చేజిక్కించుకున్నారు.
కాని అంతవరకు బాగున్న వారి బుద్ధి నిధిని చూడగానే వక్రించింది.
సుందరమూర్తి అంత నిధిని చేజిక్కించుకుని అనంతాన్ని మోసం చేసి పారిపోయాడు.
అనంతం చావలేదు కాబట్టి సుందరమూర్తికి అనంత వలన ఎప్పటికయినా ప్రమాదం. క్లుప్తంగా ఇదీ కధ!" ముగిస్తూ అన్నాడు.
మిత్రులిద్దరిలో నీవు సుందరమూర్తివా? అనంతపద్మనాభశాస్త్రివా? అతను అడిగాడు.
"ఆ మాత్రం గ్రహించలేవా?"
"గ్రహించాను. నీవేం చెపుతావో అని!"
"సుందరమూర్తిని."
"అంటే అనంతాన్ని మోసం చేసింది నీవేనన్న మాట!"
"ఆ విషయం నీకనవసరం. నీ కధ కానియ్యి."
"మిష్టర్ అనంతపద్మనాభశాస్త్రి కధ సగం నిజం చెప్పినా మిగతాది బాగా అల్లావ్ సుందరమూర్తి అని పేరు పెట్టుకున్నావుగాని, నీవే అంతా విని సుందరమూర్తిని మోసం చేసింది నీవే.
నీ మారువేషం నా కళ్ళు కప్పలేదు."
గంభీరంగా అన్నాడు అతను.
"ఎలా తెలుసుకున్నావ్?" కంగారుగ అడిగాడు బాస్.
"నీవు నీవే కాబట్టి" రాజారావు తాపీగా అన్నాడు.
బాస్ అని పిలవబడే అనంతపద్మనాభశాస్త్రి తనగుట్టు బయటపడటంతో కళ్ళు ఎర్రబడ్డాయి. కోపంతో పళ్ళు కొరికాడు.
చేతిలో రివాల్వర్ సూటిగా రాజారావు వైపు గురిపెట్టాడు.
"ఒప్పుకుంటున్నాను. నేనే అనంతపద్మనాభశాస్త్రిని. అవసరానికి మారువేషంలో ఉన్నాను. ఇంతకీ నీవెవరివి? నా సంగతి నీకెలాగు తెలుసు నాలాగా తయారయి యీ ఊళ్ళో ఎందుకు తిరుగుతున్నావ్?
ఊఁ అని తొందరగా చెప్పు. మాట మార్చజూసావో టైం వృధా చెయ్యను. ఒకేగుండు చాలు" అన్నాడు.
అనంతపద్మనాభశాస్త్రి రివాల్వర్ సూటిగా అతనికి గురిపెట్టి అనంతపద్మనాభశాస్త్రి అతనితో మాట్లాడుతున్నప్పుడు వెనుక తలుపులు మెల్లిగా తెరుచుకున్నాయి.
ఒకతను లోపలకి వచ్చాడు. అతని రెండు చేతుల్లో రెండు పిష్టల్సు ఉన్నాయి.
అనంతం ఒక్కసారి ఇటు తిరుగు అని వెనుక నుంచి మాటలు వినపడటం చూసి గిరుక్కున వెనక్కు తిరిగాడు అనంతం.
27
ఎదురుగా రెండు చేతులలో రెండు పిష్టల్స్ ధరించిన ఆగంతుకుడిని చూసి బిత్తరబోయాడు అనంతం. "ఎవరు నువ్వు" కంగారుగా అడిగాడు.
నా కంఠ స్వరం గుర్తుపట్టలేదా అనంతం! నువ్వు సుందరమూర్తిగాడే కనుకున్నావు. నేను మారువేషంలో వున్నాను. అయినా స్వరం పోల్చుకున్నావు. నీ తెలివిని మెచ్చుకుంటున్నాను. వచ్చింది తన ప్రక్కలో బల్లెంలాంటి సుందరమూర్తి అని తెలియగానే ఏ మాత్రం ఆలస్యం చేసినా తన ప్రాణానికే ముప్పు అని గ్రహించి రివాల్వర్ పేల్చాడు.
అనంతపద్మనాభశాస్త్రి, సుందరమూర్తికి గుండు తగలకపోవటం అటుంచి రివాల్వరు అసలు పేలనేలేదు.
సుందరమూర్తి ఫక్కున నవ్వాడు.
అనంతపద్మనాభశాస్త్రి తెల్లబోయాడు. సమయం మించిపోయింది. అనంతం కాలం ఎవరిచేతిలో ఉండదు తెలివి నీ ఒక్కడి సొత్తు అనుకోకు.
నీ రివాల్వరులో గుళ్ళు కాదు కదా ఆఖరికి గులకరాళ్ళు కూడా లేవు. నీవెలాగా వచ్చావు ఇక్కడికి అడిగాడు అ...ప...శా...
తెలివితేటలు ఉపయోగించి.
అది తెలుస్తూనే ఉంది. ఇది నాయిల్లు ఇక్కడే నా చేతుల్లో ఉన్నారు ప్రాణాలకు తెగించిన నరరూపరాక్షసుల్లాంటి మనుష్యులు.
ఇది నీ యిల్లు కాదు నీ స్థావరం. రెండో కంటి వాడికి తెలియకుండా చీకటి గదులు కట్టించావ్. రూపం మార్చావ్. చేతికింద రౌడీలను పెట్టుకున్నావు పాపం ఇన్ని జాగ్రత్తలు పడ్డా నా కంట పడక తప్పలేదు.
అది నీ ఖర్మ దొరికిన గుప్తధనాన్ని న్యాయంగా రావాల్సింది నాకు సగం వాటా పోనీ పావువాటా అన్నా ఇచ్చావా. ఉహు ఏమి ఇచ్చావు మంచిగా మెలిగి మొత్తం ఒకచోట చేర్చి ఇరువురం పంచుకుందాం అన్నావు అలాగే చేశాం.
ఆపై నీవు ఏం చేశావు నన్ను మోసం చేసి ఉడాయించావు.
నన్ను చంపమని రౌడీలను నియమించావు. వాళ్ళనించి తప్పించుకున్నాను నేను.