Previous Page Next Page 
రుధిర మందారం పేజి 28

    వాళ్ళు నలుగురూ రాజారావుతో లిఫ్టు ఎక్కారు.
                                          26
    అయ్యా మీరు ఆరువందలసార్లు అడిగినా నేచెప్పేది ఇదే నా పేరు రాజారావు. నేనేం అనంత పద్మనాభశాస్త్రిలా అవతారం దాల్చలేదు.
    ఆ అవసరం నాకు లేదు. వాడి పోలికలు నాకుండటం నానేరకం కాదు అన్నాడు రాజారావు.
    రాజారావు చుట్టూ ఆయుధాలతో మదిమంది ఉన్నారు.
    రాజారావు నుంచునే వున్నాడు. చేతికి బేడీలు అలానే ఉన్నాయి. అతనిముందు ఒకతను ఉన్నాడు. అతనే వాళ్ళకి బాస్.
    ముఖం వికృతంగా వుంది.
    ఖరీదైన సూటుమాత్రం వేసుకున్నాడు.
    అరిగిపోయిన రికార్డులాగ ఒకటేమాట నీనోటంట. నిజం ఎలా పలికించాలో నాకు బాగా తెల్సు. మా వద్దనున్న హింసా విదానాలన్నింటినీ రుచిచూసి నరకం ఎక్కడోలేదని తెలియజేస్తే అప్పుడు నీవే కాళ్ళ బేరానికొచ్చి నిజం చెపుతావు అన్నాడు బాస్.
    నేను మీకేం అపకారం చేశాను అన్నాడు రాజారావు.
    అపకారం ఏం చేశానని అడుగుతున్నావా. ఈ వేషములో నాకోసం బైలుదేరివచ్చావు చాలదూ. ఇంతకూ నీవు సి.ఐ.డి. వా కేటుగాడివా?
    నేను సి.ఐ.డి. నో కేటుగాడినో అడిగేబదులు ఓసారి రంగూన్ వెళ్ళిచూస్తే సరిపోతుంది.
    రంగూన్ దేనికి బాస్ అనుమానంగా రాజారావుని చూస్తూ అడిగాడు.
    నా అడ్రసు వివరంగా ఇస్తాను. రంగూన్ వెళ్ళి నా గురించి వివరం సేకరించండి. మీ అనుమానం నివృత్తి అవుతుంది.
    కలపలగాయితు చేసే చిన్న వ్యాపారస్తుడిని. రెండు నెలలు రెస్టుగా ఉంటుందని అలా, అలా వూళ్ళుచూసుకుంటూ బైలుదేరి ఈ వూరువచ్చాను. ఈ ఊళ్ళో కాలుపెట్టినదగ్గరనుంచి నీవు అనంతపద్మనాభశాస్త్రి అంటూ ప్రతివాడు ప్రాణం తీయటమే అయినా ఆ వెధవకి నాకు పోలికలుండటం నా నేరమా.
    బాస్ నిర్లక్ష్యంగా తల ఎగరేసి రెండడుగులు ముందుకేసి రాజారావువైపు హేళనగా చూసాడు.
    ఊ నువ్వే అనంత పద్మనాభశాస్త్రివి
    వాడి వేషంలో మేకతోలు కప్పుకున్నావు రాజారావు అమాయకంగా అన్నాడు.
    మీరు పొరబడ్డారు.
    "నీవుకాదా అనంత పద్మనాభశాస్త్రి నాకు కావాలి. వాడిరూపం దాల్చిన పక్కా మోసగాడివి.
    రాజారావు పేరుతో ఈ ఊళ్ళో తిరుగుతున్నావు. అసలు అనంత పద్మనాభశాస్త్రి ఏమయ్యాడు? నీకావేషం ధరించే అవసరం ఏమిటా అని నిన్ను బంధించాము.
    ఉ. ఇప్పుడు చెప్పు నీ అసలు పేరు, అసలు కధ.
    "ఆగండాగండి. మీరే అనంత పద్మనాభశాస్త్రి అని పొరబడ్డాను. ఇంతకీ మీకు అనంతపద్మనాభశాస్త్రితో ఏమవసరమో?" 
    "అది నీకనవసరం!"
    "మంచిది. అది నా కనవసరమయితే ఇది నీ కనవసరం. నా పేరు రాజారావు. నా ఇష్టం వచ్చినట్లు తిరుగుతాను."
    "జాప్యం చేస్తే యమలోకం చూపించాల్సి ఉంటుంది"
    "ఎలాగూ టూర్ బయలుదేరాను. ఈ దోవన అదీ చూసిపోతాను."
    బాస్ కి పిచ్చి కోపం వచ్చింది.
    "ఊ! ఒకే ఒక ప్రశ్నకి సమాధానం ఇవ్వు. లేకపోతే ఈ నిమిషం నుంచి మా వాళ్ళ చేతిలో నల్లిలా నలిగిపోతావ్. నువ్వెవరు ఈ వేషంలో ఎందుకొచ్చావ్?"
    రాజారావు కళ్ళు మూసుకుని ఆలోచించి ఓ నిర్ణయానికొచ్చి కళ్ళు తెరిచాడు.
    "నిజం చెపుతాను కాని, మీ వాళ్ళెవరూ మన దగ్గర ఉండటానికి వీలులేదు."
    "ఆల్ రైట్" అని తన అనుచరుల వైపు తిరిగి "ఇతని కాళ్ళు చేతులు బంధించి మీరంతా బయటకి వెళ్ళండి" అన్నాడు బాస్.
    బాస్ అనుచరులు అతని చేతులకి, కాళ్ళకి ఇనుప గొలుసులు తగిలించారు.
    ఆ తర్వాత గదిలోంచి అందరూ బయటకు వెళ్ళిపోయారు.
    "నా జాగ్రత్త కోసం బంధించాను అంతే! ఊఁ ఇహ అసలు విషయానికి రా!" అన్నాడు బాస్.
    "అలాగే కాని ఓపని ముందుగా చేయాలి. అది మనమధ్య ఒప్పందం అనుకున్నా సరే మీరేమనుకున్నా సరే."
    "ఏమిటది?"
    "నేనెలాగూ నీ చేతిలో చిక్కాను.
    ఏ దైవమో ప్రత్యక్షమై సహాయం చేస్తే తప్ప ఇక్కడ నుంచి పారిపోలేను.
    నా గురించి నేనిజం చెప్పే ముందు నేను అనంత పద్మనాభశాస్త్రిలా ఉంటే ఏమిటి అతనికి నీకు శతృత్వం ఏమిటి?
    మీ మధ్య ఏదో కధ వుండే ఉంటుంది. ఆ నిజం చెపితే నేను నిజం చెబుతాను. లేదంటే మాత్రం నా నోటి నుంచి ఒక్క మాట రాదు.
    యమచర పెట్టినా సరే! యమలోకానికి పంపినా సరే!" అతను గట్టిగా చెప్పేశాడు.

 Previous Page Next Page