Previous Page Next Page 
సక్స్ స్ పేజి 27


   
    "నీకు బాల్యస్నేహితుడ్ని-ని క్షేమం కోరుకునే  వాడినని మార్చావా? కనిసం నాకు ఫోన్ చేయాలనిపించలేదా?

    నాకు ఆలస్యంగా  తెలిసింది వార్త....పరుగెత్తుకుని వచ్చాను"

    అయుదు నిమిషాల సేపు ఇద్దరి మధ్య మాటల్లేవు__

    మౌనంగా కూర్చున్న ముక్తవెపు, మౌనంగాచూస్తూ  కూర్చున్నాడు సూర్యతేజ-ఇద్దరి గుండెలు బరువెక్కాయి.

    ఆ సమయంలో సూర్యతేజ అక్కడకు రావడం ఎంతో ఉపశమనంగా, దైర్యంగా ఉంది ముక్తనందకు.

             *                 *                 *    

    అనిమిష-

    మూడీగా ఉన్న రవిచంద్ర కళ్ళల్లోకి, మత్తుగా చూసింది.
   
    "ఉమ్మడియర్ షాపు నుంచి వచ్చినదగ్గర్నించి, పరధ్యనంగా ఉన్నావ్.....పర్సనల్ ప్రాబ్లమ్స్ లో ఉన్నావని...పార్టీకూడా కేన్సిల్ చేసేసాను... ఇక్కడ కూడా.... ఇలాగేనా" అతని జుత్తులోకి, వెళ్ళు జొనిపి, తనవేపు లాక్కుంటూ అంది  అనిమిష.

    గదిలో మెడలోని నక్లెస్ మరిన్ని వెలుగుల్ని ఎగజిమ్ముతోంది.

    "విలువ్తెన నక్లెస్ ను....నా బర్త్ డే కానుకగా ఇచ్చావ్...." అతని పెదాల్ని గాడంగా ముద్దుపెట్టుకుంటూఅంది అనిమిష.

    నవ్వాడు రవిచంద్ర.

    "ని చెల్లెలు గురించి , ఆ లాయర్ గురించి ....అంతలా ఆలోచిస్తున్న వనుకోలేదు....."

    డ్రింకు నింపిన గ్లాసుని చేతికందిస్తూ అంది అనిమిష. గ్లాసులోని డ్రింక్ ను గబగబా తాగేసాడు. ఇంకో పెగ్ పోయించుకొని మళ్ళి తాగేసాడు.

    "డాడి మర్డర్ జరిగి....ఇంకా  రెండ్రోజులు కాలేదు....అందుకే వెయిట్ చేస్తున్నాను __ముక్తను ఆ లాయర్ తన గెస్ట్ హౌస్ కి తీసికెళ్ళి ఉంచాట్ట...అక్కడ ఆ లాయర్....ఏం కుట్రలు చేస్తున్నాడో ....ఏమీ నూరిపోస్తున్నాడో....." సిగరెట్ వెలిగించుకుంటూ అన్నాడు.

    "నూరిపోస్తే.....నూరి పొయ్యని.....మనకేం ....మీ చెల్లి ఆస్తికోసం కోర్టు కెక్కిందనుకో....సగం  వాటా మనకెలాగూ వస్తుందిగదా. దానికంత బుర్ర ఎందుకు పాడు చేసుకుంటావ్...."

    ఆ మాటకు చిఱున కోపం వచ్చింది రవిచంద్రకు.

    "అనూ....బి....ఇన్ యువర్ లిమిట్స్ నాకు సలహాలిచ్చేవాళ్ళంటే కోపం. ఆ ఆస్తి ఎవరి భిక్షమో కాదు....మా డాడిది అంటే నాది....దాని మీద మా చేల్లెలికేమాత్రం  హక్కులేదు. అంతే...ఆ లాయర్ లేకపోతే ...అంతా నాప్లాన్ ప్రకారమే జరిగేది...."

    రవిచంద్ర మనస్తత్వం, కొంతలో కొంత  అర్ధమ్తెంది అనిమిషకు.

    "ఆ లాయర్ ని లేపెయోచ్చుగా...." సలహా ఇచ్చింది అనిమిష .

    "ఈ పరిస్ధితుల్లో మనమేం చేయ్యగూడదు....."

    "మరి-ఎల్లుండి, ఆ ఫిప్టిలాక్స్ ఇవ్వాలి. ఎలాగా....ఇవ్వకపోతే పరువు పోతుంది. ఎలాగూ ఆ లాయర్ గెస్ట్ హౌస్ లో మీ చెల్లి  ఉందన్నావ్  కదా...ఈ ఒక్క చెక్కుమీద సంతకం చేసి  పంపమని, పుష్పక్ ని పమపు. ఏమంటుందో చూద్దాం...."

    ఆ ఆలోచన నచ్చింది రవిచంద్రకు.

    "లాయర్ లేని సమయంలో పంపితే సరి. ఆ మాత్రం మీ చెల్లి  అర్ధం చేసుకుంటుందన్న నమ్మకం నాకుంది....ముందుగా , ఆ ఉమ్మిడి యార్ దగ్గర మన పరువు దక్కుతుంది....."

    అదే సమయంలో___

    తలుపు తెరచుకొని లోనికొచ్చాడు పుష్పక్.

    పుష్పక్ ని చూడగానే రవిచంద్రకు దూరంగా జరిగింది అనిమిష.

    "సారి ఫర్ ధీ డిస్ట బింగ్ యూ....రవి....ఎయిర్ పోర్ట్ లో లాయర్ సూర్యసాగర్ కనిపించాడు.  బహుశా డిల్లి వెళ్తున్నాడెమో...."ఆ మాయను నమ్మలేనట్లుగా విన్నాడు రవిచంద్ర.

    "డిల్లినా....ఆర్యూఘ్యర్....?"

    "ఎస్...." అన్నాడు స్ధిరంగా పుష్పక్.

    "పుష్పక్ ....ఇప్పడే .....ఈ క్షణంలోనే....నువ్వోపని చెయ్యాలి." ఏదో జ్ఞాపకం వచ్చిన వాడిలా అన్నాడు రవిచంద్ర.

    "ఏంటది....."

    "ఇదిగో తీసుకో...." అని జేబులోంచి, తను సంతకం చేసిన చేక్ ని తిసి, అతనికిస్తూ దీని మీద ముక్త సంతకం పెట్టించి తీసుకురా.... లాయర్ లేడు కాబట్టి__నాయనో , భయానో .....బెదిరించు...." చేతిలోని చెక్ ను, జేబులో పెట్టుకుంటూ లేచి నిలబడ్డాడు పుష్పక్.

    అప్పుడు  సమయం సరిగ్గా రాత్రి పదకొండు గంటల్తెంది.

            *                *                *

    సరిగ్గా పదకొండూ , పదిహేనునిమిషాల్తెంది.

    అడయార్ పోలిస్ స్టేషన్ సమీపంలోని ఆ ప్రాంతం, చీకట్లో నిద్ర పోతున్నట్లుగా ఉంది. రోడ్డుకి ,ఎడమ వేపునున్న  ప్లాట్స్ లో ,ఓ ప్లాట్ కి,

    మొదటి కార్లో, డ్తెనింగ్  సీట్లో కూర్చున్న పుష్పక్ , కారు ల్తేట్స్ డిమ్ చేసి, అటూ ఇటూ చూసి- కిందకు దిగాడు.

    అక్కడంతా నిత్జనంగా ఉంది.

    రెండో కార్లోంచి కూడా నలుగుర వ్యక్తులు దిగారు.

    "మీరు నలుగురూ ....ప్లాట్ చుట్టూ కాపలాకాయండి. అవసరమ్తేతే నేనే విజిల్ వేస్తాను....ఎందుక్తేనా మంచిది.... టెలిఫోన్ వైర్ కట్  చెయ్యండి...పోలిస్ పెట్రోలింగ్ టైమీది.....బి ఎలర్ట్ " ప్లాట్ చుట్టూ  పక్కల ప్రాంతాల్ని ఒకసారి పరిశీలిస్తూ అన్నాడు పుష్పక్ పుష్పక్ చెప్పినట్టుగానే , నలుగురూ, ప్లాట్ చుట్టూ ఉన్న గోడ దూకి. నాలుగువేపులా కాపలా కాసారు.

 Previous Page Next Page