Previous Page
Next Page
అమ్మో! అమ్మాయిలు పేజి 28
మళ్ళీ అబ్బులి పెదవుల కదలిక చూసిన ధర్మరాజు " కొన్ని అలాగే వుంటాయి అబ్బాయీ!" అన్నాడు.
అబ్బులికేం చేయాలో తెలియక అర్జంటుగా ఆలోచించి " ఒరేయ్ కర్ణా! ఈ జిడ్డుగారిని మనం జాయింటుగా ప్రశ్న లేద్దాము. ఊ కానియ్!" అన్నాడు.
వ్యాకర్ణ తల వూపాడు. తన కుర్చీని ధర్నారాజు కూర్చున్న మోడాకి దగ్గరగా జరుపుకున్నాడు.
అబ్బులు కుర్చీని ధర్నరాజు దగ్గరగా జరుపుకున్నాడు.
అబ్బులు, వ్యాకర్ణ తన దగ్గరగా జరిగి కూర్చోటం ధర్మరాజు చూసి కాస్త కంగారుపడ్డాడు.
" ధర్మరాజు కాలు విరిచేస్తాను" అన్నాడు వ్యాకర్ణ అబ్బులివైపు తీవ్రంగా చూసి.
" మిరే చెప్పండి. కాలు విరవటం అధర్మంకాదూ? ఏ చెయ్యి అయినా ఫరవాలేదు" అని అబ్బులు ధర్మరాజు వైపు చూశాడు.
" ఉహూ, కాలే నయం కుంటాడిగా బ్రతుకుతాడు."
" ఉహూ, అసలే ఆయనకీ చెముడు. చెయ్యి లేకపోతే ఫరవాలేదు విరిచెయ్యి."
" ఏది విరగ్గొట్టమంటారో చెప్పండి."
" మర్యాదగా నా వైపు మాట్లాడండి. ఏదిరగొట్టమంటారు?"
ధర్మరాజువైపు చూసి యిరువురు తీవ్రంగా మాట్లాడి, మిరు చెప్పండి ఏం చేయాలో అన్నట్లు ధర్మారాజు ముఖంలోకి చూస్తూ ఆగారు యిరువురు.
ధర్మరాజుకి వెలక్కాయ గొంతు కడ్డంగా పడినట్లయింది. " ఎందుకబ్బాయిలూ! యింత చిన్న విషయానికి పోట్లాడుకుంటారు!
నువ్వు చెప్పిదీ బాగానే వుంది. అతను చెప్పిందీ బాగానే వుంది. ఇద్దరూ ఓ మాటకొచ్చి కానీండి అని" ఆనందు చిరునవ్వుతో.
జయచిత్ర పగలబడి నవ్వింది.
" సలహా చెపినా యింకా కోపంగా చూస్తారేమిటర్రా అబ్బాయిలూ! నా మాట నచ్చలేదా?
పోనీ ఓ పని చేయండి. మి యిద్దరిలో పెద్ద ఎవరో వాళ్ళ మాట రెండో వాళ్ళు వినండి. నా అభ్యంతరం లేదు" అన్నాడు ధర్మరాజు.
" పెద్దాడిని నేను కాబట్టి మి కాలు నేనే యిరుస్తాను" అన్నాడు వ్యాకర్ణ సీరియస్ గా ధర్మరాజు కళ్ళలోకి చూసి.
" అలా అన్నావు బాగుంది" అన్నాడు ధర్మరాజు.
ఈ దఫా జయచిత్రతోపాటు అబ్బులు, వ్యాకర్ణ కూడా నవ్వారు.
తనేదో పొరపాటు మాట్లాడానని ధర్మరాజు గ్రహించాడు. ఇంకా అక్కడే కూర్చుంటే మరింత నవ్వులపాలు కాక తప్పదని మోదామించి లేచి_
" వస్తానురా అబ్బాయిలూ! నిద్రొస్తుంది. అన్నదమ్ముల్లాగా కలిసున్న స్నేహితులు అనవసరంగా తగూలాడుకోకండి.
నువ్వన్నా చెప్పు జయచిత్రమ్మా! ఎవరో ఒకరు రెండోవారిమాట వీని అలా చేయమని..." అని సలహా యిచ్చి ధర్మరాజు వెళ్ళిపోయాడు.
ధర్మరాజు వెళ్ళిన తరువాత ముగ్గురూ అలా ఒఅ పడి నిమిషాలు నవ్వుకుని తర్వాత నవ్వాపేసి " పాపం" అనుకున్నారు ధర్మరాజు తలుచుకుని.
" నిజమే పాపం అనుపిస్తుంది. ఎగతాళి చేయకూడదు. నవ్వకూడదు అనిపిస్తుంది.
ఓ కుంటివాడినో, గుడ్డివాడినో చూసి నవ్వామానుకోండి. అది మానవులు చెయ్యాల్సిన పనికాదు. రాక్షసుడు చేసే పని.
చెవిటివాళ్ళని, మూగవాళ్ళని తలుచుకుంటే పాపం అనిపిస్తుంది కాని వారి చేష్టలు వద్దన్నా నవ్వు తెప్పిస్తాయి" అంది జయచిత్ర.
నిజం కాబట్టి " నిజమే" నని వప్పుకుని తలాడిం చారు అబ్బులు, వ్యాకర్ణను.
Previous Page
Next Page