"ఈ విషయంలో తంబి చాలా అదృష్టవంతుడు గురూ! సాల్ట్ వాటర్ మినహా సాప్ట్ వాటర్ తాగలేడు..."
"తంబి అదృష్టం మాత్రం పగవాడికి కూడా వద్దు గురూ...స్త్రీట్ ఫైట్స్ లో ఎన్ని సార్లు చచ్చి బ్రతుకాడో" లేవడానికి ఉద్యుక్తుడవుతూ అన్నాడు.
ఇద్దరూ పుడ్, డ్రింక్ గ్లాసులు తీసుకుని తంబి దగ్గరకు వెళ్ళారు అప్పుడు గుర్తోచ్చిందామెకు__ తిండి విషయమై తన ఏర్పాట్లు టాను చూసుకోలేదని.
"బోటు భోజనం వేరే వుంటుంది. రుచిచూడంది" నవ్వుతూ అన్నాడు తంబి.
"థాంక్యూ..." అంటూ గ్లాసులోని నీళ్ళతో చేయి కడుక్కోబోయిందిగాని, "ఁ...వద్దు వద్దు..." అంటూ వారించాడు తంబి.
"ఏం..." అన్నట్టుగా చూసింది కావ్య.
"సముద్రం మీదకి వచ్చిన తర్వాత డబ్బులేక చచ్చిపోయిన వాడంటూ వుండడు! తిండిలేక చనిపోయినవాడు అరుదుగా అరుదుగా కనిపిస్తారు. కానీ నీరులేక చనిపోయినవారు చాలామంది కనిపిస్తారు. చూడండి...చుట్టూ నీరు కనిపిస్తుంది. కాని ఒక్క చుక్కకూడా నోట్లో వేసుకోలేం" నవ్వుతూ అన్నాడు తంబి.
"ఈ సూత్రం అందరికీ వర్తిస్తుంది. కాని మ తంబికి వర్తించదు."
"అదేం...?"
"తంబి సాల్ట్ వాటర్ మినహా సాప్ట్ వాటర్ తాగలేడు...."
"నిజమా..." అన్నటుగా చూసింది.
"అది ఒక రకంగా శాపం... మరొక రకంగా వరం అయింది" అంటూ ఆ ప్రయత్నంగా పొడవాటి తన గ్లాసు అందుకున్నవాడు ఆగిపోయాడు. ఓ అడపిల్లను ఎదురుగా పెట్టుకుని తాగాడానికి అతడి సంస్కారం అడ్డేచ్చింది.
ఆ సంస్కారమే మరికొద్ది గంటల తర్వాత అతడిపాలట వరం కాబోతుందని ఆ క్షణాన అతడికి తెలియదు.
* * * *
"ఒరేయ్ అబ్బాయ్! అమ్మాయి ఏ ఊరేళ్ళిందిరా?" ముక్కు మీదకి జారిపోతున్న కళ్ళజోడు పైకి ఎగదోసుకుంటూ అడిగింది కావ్య బామ్మాగారు.
"సొంత వ్యాపారం మోదలేడుతొందిగా.... డిల్లీ వెళ్ళింది...." అని సమాధానమిచ్చాడు వదయారు.
వాస్తవానికి కావ్య వదయరుకి చెప్పింది ఆ సమాధానమే 'అలాగాక సముద్రం మీదకి వెళ్తున్నానని ఆమె మాట మాత్రంగా చెప్పినా అతడు అంగీకరించేవాడుకాదు.
"వ్యాపారాలు ఏమిట్రా.... ఒక్కగానొక్క పిల్ల! సలక్షణంగా పెళ్ళిచేసి పంపక _ అయినా ఒక్కమాట అడుగుతాను. చెంగల్పట్టునుంచి వస్తూ వస్తూ ఏం తీసుకోవచ్చావ్? ఇపుడు నీ కెంత ఆస్తి వుంది? యిది చాలక ఆడపిల్ల కూడా సంపదిమ్చాలా? ఈ ఇంట్లో నీ భార్య పోయినప్పుడు ఖర్మకాండ జరిపించడం... ప్రతి ఏడాది పిండతర్పణం చేయడం మినహా పసుపురాసి, కొబ్బరిమట్టలు.... మామిడి మందలతావు ఏదయినా ఒక్కశుభాకర్యం చేశవట్రా?"
కోట్లు సంపాదించినా తనను 'ఒరేయ్...' అనిపిలవగాలిగిన వ్యక్తీ మందలించగలిగిన వ్యక్తీ ఆమె ఒక్కతే!
తల్లి అలా నిగ్గదీసే సరికి ఉక్కిరి బిక్కిరయ్యాడు. అయిన ఆ క్షణనా తప్పించుకోవడానికి, "అప్పుడే చిన్నతల్లికి పెళ్ళేమిటి... చిన్న పిల్ల" అన్నాడు. తనకి తెలుసు తన మాటల్లోని నిజాయితీ ఎంతో!
"అవున్రా! చంటి పిల్ల... ఇంక చంకనేసుకుని తిరుగు. సిగ్గులేక పోతేసరి..." అని గొణుక్కుంటూ ఆమె లోపలకి వెళ్ళిపోయింది.
ఈ సంభాషణ ఆ రోజు ఉదయం జరిగింది.
ఆఫీసుకి వచ్చినా వాడయరుని తల్లి మాటలే వెంటాడుతున్నాయి.
వ్యాపార పరంగా తనకు వివిధ ప్రదేశాలలో వివిధ బ్రాంచీలున్నాయి. ఏ రోజుకి ఒక్కొక్క బ్రాంచీనుండి గోడౌన్ కీపరు స్టాక్ పొజిషన్ పంపుతాడు. క్యాషియర్ అ రోజు కలెక్షన్స్ పంపుతాడు. సేల్స్ సూపర్ వైజర్ అ రోజు సేల్స్ పొజిషన్ పంపుతాడు. మేనేజర్ తన రిపోర్ట్ వేరే పంపుతారు. ఈ మొత్తం ఇన్ ఫార్ మేషన్ కంప్యూటర్ కి ఫీడ్ చేస్తారు. అందరి రిపోర్టులు ఒకటి కావాలి. ఎక్కడ ఏ చిన్న పొరపాటున జరిగినా కంప్యూటర్ రెడ్ హండెడ్ గా పట్టేస్తుంది.
అలాగే వివిధ వర్స్ లోని పర్సనల్ ఆఫీసర్స్, జనరల్ మేనేజర్స్ ఎప్పటి కప్పుడు వాళ్ళ రిక్వయిర్ మెంట్స్ ఏమిటన్నది చెబుతుంటారు.
కాని ఓ ఆడపిల్ల 'నాన్న! నాకు పెళ్ళిచెయ్' అని 'డాడీ! నాకీ ద్రాస్ కావలి' అన్నట్టుగా అడగ లేదుగా!
తండ్రిగా పొరపాటుని గుర్తించాడు. ఇంతకాలానికి తల్లి తన పొరపాటుని వ్రేలెత్తి చూపకపోతేటాను ఆ విషయమే ఆలోచించేవాడు కాదు. మనసులోనే తల్లికి థాంక్సు చెప్పుకున్నాడు.
'కావ్యకి తగిన వరున్ని వెదకాలి. అతనెవరు...?' అన్న ప్రశ్న అతడి మనసులో మోలకేత్తింది.
ఇక్కడ వడయారు తన కుటుంబ విషయమై ఆలోచిస్తుంటే...
అక్కడ వదయారు ప్రత్యర్ది ఏం.వి.అయ్య. తన కుటుంబ సభ్యులతో కల్సి కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుతున్నాడు. అయితే ఆ మాట్లాడేది కుటుంబ విషయాలు కాదు... దేశ రాజకీయ పరిస్థితులతో ముడిపడి వున్నా తన వ్యాపారం గురించే!
"ఐక్యదళ్ అధికారంలోకి వస్తే ఇండస్ట్రీయల్ పాలసీ ఎలా వుంటుంది?" అడిగింది మాదాల వెంకట్రామయ్య భార్య పావని.