ఒహ్ మనం ముఖాముఖి మాట్లాడుకోటం తప్ప ఇంతవరకూ ఫోన్ అవసరం కలగలేదు కదూ? నేను రాజారావు నీ బాస్ ని.
అనంత పద్మనాభశాస్త్రి నీకు ఫోన్ చేశాడా?
రాజారావు ముఖంలో రంగులు మారాయ్. నిజంగానా అన్నాడు.
ఎస్ నీ బాస్ ని.
సారీ సార్ ఎప్పుడూ మీ స్వరం ఫోన్ లో విననందుకు పొరబడ్డాను. ఎందుకు ఫోన్ చేశారు అర్జంటుగా ఏదయినా చెయ్యాలా?
"ఉహు!"
"మరి?"
అనంత పద్మనాభశాస్త్రి అవునో కాదో కాని నేనే వాడిని సుమా అంటూ ఏదో మొత్తం చెప్పి ఫోన్ పెట్టేశాడు ఇది రాత్రి జరిగింది. ఈ విషయం మీకు చేబుదామనే బయలుదేరుతున్నాను.
గుడ్. గుడ్ న్యూస్ వినిపించావు. అవతలి వాళ్ళు బహుశా మనకి కావలసిన వాళ్ళేననుకుంటాను. రంగంలోకి దిగారు. బెదిరించటానికి నిన్ను ఎత్తుకుపోవచ్చు. అన్నింటికి సిద్ధంగా వుండు నీ వెనుక నేను వుంటాను. రాత్రి ఫోన్ బట్టే ఊహించాను. కొందరు రంగంలోకి దిగారని.
గుడ్ జాగ్రత్తగా వుండు మౌనంగా లొంగిపో తర్వాత విషయం నేచూసుకుంటాను.
25
చటుక్కున మెలకువ వచ్చింది రాజారావుకి.
అది చిన్నగది రాత్రో పగలో తెలియటానికి తలుపులు తెరిచిలేవు కిటికీ అంటూ ఒకటి లేదు.
గదిలో నలభై క్యాండిల్ బల్బు వెలుగుతున్నది.
రాజారావు మంచంమీద నుంచి లేచి గది నలువైపులా పరికించి చూసాడు.
గదిలో చెప్పుకోదగ్గవి ఏమీ లేవు ఓ మంచం స్టూలు ఆ స్టూలు మీద చిన్న మంచినీళ్ళ కూజా గాజుగ్లాసు వున్నాయి.
తను కూర్చున్న మంచం మీద చూపులు సారించి రాజారావు ఉలిక్కిపడ్డాడు. వెంటనే తన్ని తను చూసుకున్నాను.
రాజారావు ఒంటి మీద వుండాల్సిన బట్టలు తలా ఓ దిక్కున వన్నాయి.
రాజారావు శరీరం మీద కట్ డ్రాయరు బనీను వున్నాయి.
ఏం జరిగి వుంటుంది రాజారావు గ్రహించుకున్నాడు. హోటల్ గదిలో నిద్రపోవటం వరకు తనకు తెలుసు. ఆపైన జరిగిన ఊహిస్తే బహుశా తన్నెవరో మత్తుమందు వాసనకి గురిచేసి ఎవరికి తెలియకుండా ఈ గదిలోకి చేర్చి ఉంటారు. హాలంతా దిమ్ముగా వుంది. యీ లక్షణాలు ఘోరమయిన మత్తుమందు పీలిస్తే వస్తాయి. తను ధరించిన దుస్తులు విప్పేసి పరీక్షచేసి వుంటారు. పాపం వాళ్ళ పరీక్ష వృధా అయి వుంటుంది. ఇప్పుడు తనేం చేయాలి?
రాజారావు లేచి ఫాంటు షర్టు కోటు ధరించాడు. క్రాపు సరిగ్గా ఉందో లేదో అని క్రాపుని చేతితోనే సరిచేసుకున్నాడు.
రాజారావు తలుపుదగ్గరకొచ్చి తలుపుమీద కొట్టాడు.
అవతలవైపు నుంచి ఎవరు పలకలేదు.
రాజారావు వూరుకోలేదు. తలుపు మీద దరువు వేస్తూ వున్నాడు.
కొద్దేసేపు తరువాత రాజారావు శ్రమ ఫలించింది.
బయటనుంచి తలుపు తీస్తున్న శబ్దం అయింది.
భళ్ళున ఒక్కసారిగా తలుపులు తెరువ బడ్డాయి.
తలుపుకి అవతల నలుగురు మనుషులున్నారు. వాళ్ళ చేతిలో పిష్టల్స్ ఉన్నాయి. అందులో ఒకతని చేతికి తుపాకి వేలాడుతున్నది.
పిష్టల్ సూటిగా రాజారావు వైపుగారి పెట్టుబడి వున్నాయి.
నమస్తే అన్నాడు చేతులు జోడించి.
వాళ్ళు నలుగురు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు.
మెలకువ వచ్చిందా బుంగ మీసాలవాడు రాజారావుని అడిగాడు.
ఆ ఇంతకు ముందే మెలకువ వచ్చింది. ఎవరూ రాకపోవటంతో తలుపు తట్టాను. వినయంగా సమాధానమిస్తూ ఓ అడుగు ముందుకు వేశాడు రాజారావు.
ఆగక్కడే భీకరంగా అరిచాడు వాళ్ళలో ఒకడు.
"ఎందుకండీ నే బైటికి రాకూడదా?"
అమాయకంగా మాట్లాడకు మా చేతిలో వున్నదేమిటో తెలుసుగా కన్నుమూసి తెరిచేటప్పటికి ప్రాణం హరీ అనిపిస్తాయి.
తెలుసు అప్పుడప్పుడూ సినిమాలలో చూస్తుంటాను. వీటిని రివాల్వరనో, పిష్టలనో అంటారు.
తెలివితక్కువ వెధవగా మాట్లాడి తప్పించుకోవాలని చూస్తున్నావేమో, ఆ పప్పులేం మాదగ్గర ఉడకవు.
మా బాస్ దగ్గరకు తీసుకెళుతున్నాము. అక్కడ చూపించు నీ ప్రతాపము.
అలాగా అన్నాడు రాజారావు. ఏ భావం వ్యక్తం చేయకుండా.
వాళ్ళలో ఒకతను ముందుకోచి చేతులకి బేడీలేశాడు.
ఇద్దరు ముందు, ఇద్దరు వెనుక నడవగా రాజారావు వాళ్ళ మధ్య నుండి చేతికి బేడీలతో నడిచాడు.
నడుస్తూ నలువైపులా చూపులు సారిస్తున్న రాజారావు ఇది బలంగా భూగర్భంలో స్థాపించిన గోడవున్. దీనిపై ఇల్లుగాని ఫ్యాక్టరీలాంటిదిగాని నిర్మించి ఉండవచ్చా అనుకున్నాడు.