Previous Page Next Page 
సక్స్ స్ పేజి 26



    "పూచీ  మీదైనా, మాదైనా ఒకటే రవిచంద్ర నాయుడుగారూ.... మరోలా అనుకోకండి. గత పదేళ్ళుగా ....మీ డాడికి , మీకూ మాకూ మధ్య బిజినెస్ డిల్ ఉంది. క్యాష్  ఇవాళే ఇవ్వక్కరలేదు. రెండ్రో జుల్లో ఇవ్వండి చాలు..."

    రెండ్రోజుల్లో యాబైలక్షల క్యాష్....ఇవ్వగలడా తను.... ఆలోచనలోపడ్డాడు రవిచంద్ర ఒక వేళ ఇవ్వలేకపోతే, తన పరువు పోతుంది.
 చెక్ ఇస్తే....బ్యాంకర్స్ ని ఎలాగైనా మానేజ్ చెయ్యోచ్చు....

    "పరవాలేదు....చెక్ తీసుకోండి.....నేను చెప్తేన్నాను గదా....."

    "నాకు  తెల్సిన విషయం  ఫ్రాంక్ గా  చెప్పేస్తున్నాను...మీకు, మీ చెల్లిగారికి మధ్య  గొడవలు  జరుగుతున్నాయని తెలిసింది.... మీరిచ్చిన చెక్  మీద....మీ చేల్లెగారు...అబ్బాక్షన్ ర్తేజ్ చేసారనుకోండి....మధ్యలో నేను  ఇరుక్కుంటాను.  మీ మీద నమ్మకంతో నక్లేస్ ఇస్తున్నాను- పట్టుకెళ్ళండి... ఎల్లుండి రాత్రి ఎనిమిది  గంటల  లోపల  క్యాష్  ఇచ్చెయ్యండి....చాలు...."

    జరిగిన గొడవ ఉమ్మిడియర్  వరకూ వచ్చిందా?ఎప్పడూ ఇచ్చిన చెక్కును కళ్ళకద్దుకానీ పుచ్చుకునే ఉమ్మిడియర్.....

    ఏం చేయాలో తోచలేదు రవిచంద్రకు.

    ప్రిస్టేజి క్వశ్చన్.

    అనిమిష వేపు చూసాడు రవిచంద్ర, అనిమిష నక్లెస్ గొడవలోనే ఉంది.

    తనవేపు చూసిన రవిచంద్ర  వేపు చూస్తూ-

    "ఎంత  బాగుందో కదూ....." గోముగా అంది.

    చిరాకేసింది రవిచంద్రకు.

    "ఓకే....మీ చెక్ తీసుకుంటాను...కానీ ఒక్కమాట...." మాటతో ఊపిరి లేచొచ్చింది రవిచంద్రకు.

    "చెప్పండి....."

    "రేపుపరిస్దితులేలాఉన్నా....చైనా ముందు జాగ్రత్త చర్య మీ చెల్లెలుగారి చేతకుండా చిన్న సంతకం  పెట్టించండి. అదిచాలు " బిజినెస్ మెన్  ఈజ్  ఆల్వేస్ ఎ బిజినెస్ మెన్.

     చెంపమీద కొట్టినట్టుంది రవిచంద్రకు.

    చెల్లెలు మాటను, ఉమ్మిడియర్ నోటినుంచి వినగానే అనిమిష రవి చంద్రవేపు చూసింది.

    "అంతగా .....కేష్ కి మరి ఇబ్బందయితే ....వద్దులెండి...." అనిమిష వగలుపోయింది.

    "ఓకే....ఉమ్మిడియర్ సాబ్ ఎల్లుండి ఈవెనింగ్ ఎనిమిది గంటల లోపల మీకు క్యాష్ పంపుతాను....."

    లేచినిలబడ్డాడు రవిచంద్ర.

    "మీకంత శ్రమేందుకు రవిచంద్ర నాయుడుగారు....మా మేనేజర్ మీ దగ్గరకోస్తాడు...."

    డిల్ సాఫీగా ఉన్నట్టనిపించినా, ఆ వెనక ఉమ్మిడియర్ చూబెట్టినఆలక్ష్యం, అపనమ్మకానికి  గొంతు వరకూ కోపం వచ్చింది రవిచంద్రకు. తన వెనక కుట్ర జరుగుతుందేమోనన్న అనుమానం మరింత బలపడింది అతనికి.

    చెల్లెలు ముక్త అమాయకత్వం  రవిచంద్రకు తెలుసు. లాయర్  సూర్యసాగర్  లేకపోతే తన ప్రపోజల్ కు ముక్త ఒప్పకునేది ఇవాళ ఉమ్మిడియర్ దగ్గర ఎదుర్తేన పరిస్ధితి  రేపు  మరోచోట రిపీట్ అయితే....

    __కార్లో ముభావంగానే కూర్చున్నాడు రవిచంద్ర.

    అనిమిష మాత్రం హేపిగా ఉంది.

     నక్లేసు  చూసి మురిసిపోతోంది అనిమిష.

    అదంతా గమనిస్తూనే ఉన్నాడు పుష్పక్.

                        *            *               *

    కాలింగ్ బజార మోగుతుంటే, చటుక్కున మెలుకువొచ్చింది ముక్తకు.

    కళ్ళిప్పింది కంగారుగా.

    రెండు నిమిషాలు మోగి, మళ్ళి ఆగిపోయి మోగుతుంది బజార బెడ్ లాంప్ వెలుగులో__

    గోడ గడియారం వేపు చూసింది.

    రేడియమ్ వాచీ ముళ్ళు మెరుస్తున్నాయి.

    సరిగ్గా రాత్రి రెండు గంటలు.

    ఈ సమయంలో ఎవరోచ్చుంటారు?     వెళ్ళిన సూర్యసాగర్ అంకుల్  తిరిగోచ్చేసారా....

    నెమ్మదిగా లేచి మెయిన్ డోర్ దగ్గరకొచ్చింది.

    "ఎవరూ....?"

    కాలింగ్ బజార చప్పుడు ఆగిపోయింది.

    "నేను..."

    ఆ గోంతేక్కడో విన్నట్టుగా అనిపించింది ముక్తకు. జ్ఞాపకం తెచ్చుకోవడానికి ప్రయత్నంచింది.

    జ్ఞాపకం రావడం లిదు.

    రవిచంద్ర మనిషి పుష్పక్ కాదుగదా!

    ఒక్కక్షణం చిరు భయం.

    రవిచంద్రగని, రవిచంద్ర మనిషిగాని అయితే.....

    అయితే...తను ఎదుర్కోగలదు....తను పిరికిది కాదు...భయస్తురాలు కాదు. నెమ్మదిగా తపులు గడియమీద చెయ్యి వేసింది ముక్త.

    ఒక్క క్షణం లో  తలుపు తెరచుకుంది.

    బయట....

    తలుపుకు కొంచెం దూరంలో, మసకవెల్తురులో వ్యక్తి.....

    "మీరా....ఎవరో అనుకున్నాను...." దైర్యంగా, ఊపిరి పిల్చుకుంటూ అన్నది ముక్త.

    లోనికి అడుగేసాడు సూర్యతేజ.

    హల్లోకి నడిచింది ముక్త.

    అప్పటికే సోపామిద  అసలటతో కూలబడిపోయాడు సూర్యతేజ

    "ఇలా జరుగుతుందని....కలలోకూడా  ఊహించలేం పదిమదికి అన్నం పెట్టె దేవుడిలాంటి మీ నాన్నగార్ని పొట్టన పెట్టుకున్న దుర్మార్గుల్ని అంత తేలిగ్గా వదిలిపెట్టగూడదు, రియల్లీ ఐయమ్ వేరిసారి ముక్తా. ఈ నిజాన్ని నమ్మటానికి నా మనస్సంగికరించటంలేదు...." ఎంతగానో బాధపడుతూఅన్న సూర్యతేజ వేపు అభిమానంగా చూసింది ముక్త.

 Previous Page Next Page