"ష్యూర్!" అన్నాడతను.
"సతీష్!"
"ఇతనేమైనా పెయింటింగ్స్ వేశాడా?"
"అదొక్కటే అతను సాధించలేనిది. ఆఫ్ కోర్స్ ఆ లోటు ఫోటోగ్రఫీతో తీర్చుకున్నాడనుకో"
"ఇంకా!"
"గుడ్ ఎథ్లిటిక్! చెస్ ఛాంపియన్! బెస్టు క్రికెటర్!"
కళ్ళు విప్పార్చి చూసింది సత్య.
"మరి వెళదామా?"
"ఊఁ"
ఇది గెస్టు రూం! ఎవరైనా నీలాంటి అందగత్తో, నాలాంటి ఫ్రెండో వస్తే ఇక్కడే మకాం!"
సత్య జవాబివ్వలేదు.
ఆ గది నీట్ నెస్ కి సంతోషించింది.
తూర్పుగోడ ఆనుకుని నిలబడ్డాడు సతీష్.
కారిడార్ లో అతని సరసనే నిలుచుందామె.
అక్కడికి పెరటితోట, దాన్నానుకునివున్న నారింజతోట బాగా కల్పిస్తున్నాయ్.
అతను రోజూ ఉదయం ఇక్కడనుంచి చూస్తాడు. ఆ మాటకొస్తే ఇక్కడినుంచి సూర్యోదయం, అటునుంచి అస్తమయం ఎంత అందంగా కనిపిస్తుందని.... నేరుగా తల్లి గర్భంలోంచి వస్తున్నట్టుగా కనిపిస్తాడు బాలభానుడు.... ఈవెనింగ్సూ అంతే!
తల్లి వొడిలో అలసి సొలసి నిదురించే పాపాయిలాగా! మెల్లిమెల్లిగా పశ్చిమదిశా గర్భంలోకి జారిపోయే ఆ అంబం చూడాల్సిందే"
"ఆ ప్రక్క మెట్లున్నాయి. పైకి వెళ్ళొచ్చు. చూసొద్దామా?" అని అంగీకారం లేకుండానే సాగేడు తను.
మెట్లెక్కి మేడపైకి వెళ్ళగానే అక్కడ దృశ్యం చూసి అప్రతిభురాలైంది ఆమె.
"అది రూఫ్ గార్డెనా? లేక...." అనుకుంది.
పారాపిట్ వాల్ చుట్టూ కుంపట్లలో రకరకాల మొక్కలు అందంగా పెంచేరు. మధ్య మధ్య గులాబీలు కుంపట్లలో మధ్యగా రెండు కుర్చీలు, ఓ సోఫా!
పడమటి వేపుగా రెండు ఇనుప కడ్డీలాదారంగా ఏర్పాటు చేసిన ఊయల, దాన్నానుకుని ఓ కుర్చీ.
"బ్యూటిఫుల్! అప్రయత్నంగా అంది సత్య.
"యూవర్ పెల్ఫ్!" కొంటెగా అన్నాడు సతీష్.
ఆ ఉయ్యాల్లో కూర్చుని మెల్లిగా ఊగి "సతీష్! ఇన్ని రోజులుగా ఇవన్నీ చూపకుండా చాలా అన్యాయం చేశావ్ నో! నో! నిన్ను క్షమించకూడదు. మీ అయ్యగారొచ్చాక చెప్పి మంచి పనిష్ మెంటు.
"ఇప్పిస్తాను" అంది తనూ కులాసాగా నవ్వుతూ.
"ఏమిటండీ ఆ శిక్ష?"
"నీకు త్వరగా పెళ్ళి చేసెయ్యమంటాను."
"అమ్మాయెవరో?"
"ఇన్ని తెలిసిన మీ అయ్యగారు నీకు తగిన అమ్మాయినే చూళ్ళేరా?"
"అదిసరే! ఆయన పెళ్ళికాందే నా పెళ్ళికాదే?"
"ఆయనా తగిన తోడుని వెతుక్కుంటారు. అంత తెలీనివాడా? హి యీజ్ గుడ్ సెలక్షనిస్టు!"
"థాంక్స్! ఆయనపై అపారమైన గౌరవం వున్నందుకు మరోసారి థాంక్స్."
మళ్ళీ ఇంకేం అనకుండా ఆ చల్లనైనా సాయంకాలాన్ని హాయిగా ఎంజాయ్ చేయసాగింది సత్య.
ఆ ఊయలలో పాలసంద్రంలో లక్ష్మీదేవిలా వున్న ఆమెని తదేకంగా చూస్తుండిపోయాడతను.
పది పదిహేను నిమిషాలు ఆరాధనలో నడిచాయి.
"క్రిందికి వెళదామా?"
ఊగుతున్న ఊయల నాపుతూ అడిగింది.
"ఊఁ" దేవిగారి అజ్ఞ అన్నట్టుగా పలికేడతను.
క్రిందికి దిగి వచ్చారిద్దరూ.
"ఇది ఆయన బెడ్ రూం! చూసి మూర్చపోయేవ్. వెళ్ళి ఆ మంచాన్నాక్రమించుకునేవ్?" అది ఆమెగారి కోసం" కొంటెగా నవ్వుతూ అన్నాడు.
ఒక్కక్షణం ఆమె కళ్ళల్లో మెరుపు. కొన్ని సెకన్లు బుగ్గలపై ఎరుపు, కొన్ని క్షణాలు వేడి ఆవిర్లు.
చప్పున తల దించుకుంది సత్య.
నోరెత్తి ఏ మాటా అనలేకపోయింది.
తలుపు తెరిచి పట్టుకుని "పద! మళ్ళీ ఊహల్లో ఊయలలూగొచ్చు. ఇది ఏర్ కండీషన్ గది. ఇవి ఆటోమేటిక్ స్ప్రింగ్ తలుపులు!"
తెరిచిన తలుపువెంట గదిలో అడుగు పెట్టింది సత్య, కాలికి మెత్తగా, నున్నగా, చల్లగా తగిలింది తివాచీ. చల్లగా మంచిగంధంలా సోకింది గాలి. అతను గదిలోకి వచ్చి వెంటనే ఏ.సి. ఆన్ చేశాడు.
"తను ఏ ప్రభుత్వ అతిధి గృహంలోనో. ఏ ముఖ్యమంత్రి ఇంట్లోనో, ఏ సినిమాతార ఇంట్లోనో లేదుకదా?" అనుకుంది సత్య.
"ఇది ఆయన స్వయంగా డిజైన్ చేయించి తయారుచేయించిన మంచం. దీనిపై పడుకుని లేవకుండానే అన్ని సవరించుకోవచ్చు.
ఇదిగో! ఈ స్విచ్. దీన్ని నొక్కితే కిటికీ తెరలు విచ్చుకుంటాయి. క్రిందికి నొక్కితే మళ్ళీ తెరలు మూసుకుంటాయి. రెండు కిటికీలకి రెండు స్విచెస్" నొక్కి చూపించేడు. సిల్కు తెరలు సర్రున జారేయి.