Previous Page Next Page 
స్టార్ వార్స్ పేజి 26

    ఆ గొడవ తర్వాత తంబికి ఎక్కడ మేని గుర్తింపు, గౌరవం లభించాయి. ఈ సంఘట తంబినిదాదాగా మార్చింది. పిష్ యార్డు కి ఫారిన్ షిప్సు వస్తాయి. విదేశీ ఓడలలోని వస్తువులు దిగుమతి  కావడానికి వారాలు నెలలు పట్టవచ్చు. దిగుమతి చేయడంలో ఆలస్యమైతే దేమైర్ జేషన్ చెల్లించవలసి వుంటుంది. అంతకు మించి దొంగచాటుకి వస్తువుల రవాణా చేయడానికి గని, దిగుమతి చేసుకోవడానికిగాని పిష్ కెప్టెన్ సహకారం ఎంతయినా అవసరం. ఎన్నో నెలలక్రితం స్వదేశాన్ని, భార్యను విడిచి వచ్చిన ఆ కెప్టెన్ ని సంతృప్తి పరచడానికి సులభమార్గం లేడీస్ ని సప్లయ్ చేయడం కాని పిష్ యార్డునుంచి లేడిస్ ని వెళ్ళనివ్వరు. చాటుమాటుగా తీసుకెళ్ళాలి. అ భాద్యతను సక్రమగా నిర్వహించడంలో తంబి అందేవేసిన చెయ్యి. రాత్రివేళలందు తన మరపడవలో వారిని తీసుకెళ్ళేవాడు. తీరానికి దాదాపుగా, పదికిలో మీటర్ల దూరానవున్న ఆ ఓడ దగ్గరకు అమ్మాయిలను తీసుకెళ్ళడంలో ఎన్నో చిక్కులు ఎదుర్కోనవలసి  వచ్చేది. సముద్రం మీద గస్తీ తిరుగుతున్నా కస్టమ్స్ అధికారుల కంట పడితేచాలు వారు సరుకుని తమ పడవలోకి ఎక్కించుకునేవారు. అదే జరిగితే అవతల కాంట్రాక్ట్ రునుంచి మాట వస్తుంది. అందువల్ల కస్టమ్స్ వారి కళ్ళుగప్పి అమ్మాయిల్ని ఓడ దగ్గరకు తీసుకెళ్ళేవాడు. అసలు సమస్య అక్కడ అడురయ్యేది. తన బోటులోనివార్ని రహస్యంగా కెప్టెన్ డేక్ లోకి చేర్చడం అసలు సమస్య. ఇందుకు బోటులోని స్రీలు పిష్ నుంచి  వ్రేలాడే త్రాళ్ళు పట్టుకుని పైకి ఎగబ్రాకవలసి వచ్చేది. అలా పైకి ఎగబ్రాకడంలో ఏ మాత్రంగానైనా చేతులు జారితే ఆ స్రీ వుండేది నిండుసముద్రంలోనే అలా అష్టకష్టాలుపడిఓడలోకి వెళితే అక్కడ వారు చవి చూసే నరకం అంత ఇంతగాదు. దేశదేశలలో ఎందరెందరో స్రీలతో వ్యభిచరించేవారు. అలా వరు అంటించే ఇంటర్నేషనల్స్ సెక్స్ ఒసీపెన్ నుంచి కోలుకోలేక దిక్కుమాలిన చావు చచ్చేది కొందరయితే, తాగి శాడిజమ్ తో టార్చర్ పెట్టె కెప్టెన్ ల బాధ తట్టుకోలేక ఓడమీద నుంచి సముద్రములోకి దూకి ఆత్మహత్య చేసుకునేది మరెందరో! తీరాన తన పడవలోకి వచ్చినవారిలో ఏమ్దర్నీ సురస్ఖితంగా తీరానికి చేర్చగలదో తంబికే తెలిసేదికాదు. వారలా తన కళ్ళముందే ఆ సముద్రంలో కలసిపోతుంటే ఏ రోజునా అతడు వారి దుస్థతికి చింతించలేదు. అనగరికమను అనిపించలేదు. అలాగే బీచ్ కి ఓంటరిగావచ్చిన ఆడవాళ్ళని చీకట్లో రేప్ చేయటం కళ్ళారా చూసినా అతడు ఎన్నడూ పట్టించుకోలేదు.

    "కాని_ తన బాల్యంలో తనను బీచ్ కి తీసుకోవచ్చిన తన తల్లిని కూడా అ రోజున ఇలాగె రెప్చేసి చంపేశారా? అన్న ఆలోచనవచ్చిన క్షణం నుంచి ఆ బీచ్ లో రెఫ్  కి గురయి ఏ స్రీ అర్తంధం చేసినా ఆ కేక తన తల్లి కేకగా అతడికి వినిపించడం ప్రారంభించింది. స్రీలపై అత్యాచారాలకు పాల్పాడ్డఎందరి కీళ్ళను అతడు విరిచిపెట్టాడో అతడికే తెలియదు. ఆ బీచ్ లో అతడు ఆడుతూ పడుతూ పెరిగాడు. నాటినుంచి ఆ బీచ్ లో అత్యాచార్లు ఆగిపోయాయి. అలాగే ఓడ దగ్గరకు రావన అవుతున్న స్రీలలో తన తల్లికూడా వున్నదేమో... అన్న ఆలోచన వచ్చిందే తడవు, అటువంటి ప్రయత్నాలను ప్రతిఘటించడం ప్రారంభించాడు. డబ్బుకోసం అతడు వారి ప్రయత్నాలను ప్రతిఘటించడం లేదు.

    ఎవరో ఆదేశాల మేరకు అతడాపని చేయడంలేదు.

తన తల్లికోసం_ సెంటి మెంటుతోనో పోరాడాడు. 'మదర్ సెంటి మెంట్' అతడికి  పాశుపతాస్రమయింది. ఆ అయుధమే అతడ్ని 'దదాలకు దాదా' ని చేసింది.

    అటువంటి 'తంబి' ఇన్నాళ్ళకు ఒక స్రీని వెంటబెట్టుకుని సముద్రంలోకి వెళ్తున్నాడు. కవ్యను వెంటబెట్టుకుని తంబి స్వయంగా వేళుతున్నాడు  కనుకనే కస్టమ్స్ వారు ఏ విధమైన హడావుడి చేయకుండా సీసాలతో సరిపెట్టుకున్నారు.

    లాంచీలో తంబి హొల్దార్ పైన ఒక చివర కూర్చున్నది కావ్య. తీరానికి అంత గందరగోళంగా నున్న సముద్రంలోపల అంత ప్రశాంతంగా వుండటం ఆశ్చర్య్న్ని కలిగించింది. ఎక్కడో దూరాన మిణుక్కుమిణుక్కుమంటూ లీలగా కనిపిస్తున్న ఓడ లైట్లు తాము తీరానికి ఎంత దూరన వున్నదీ తెలియజెప్పాయి.

    "లాంచీలో ముందుభాగాన మందు కార్యక్రమం పూర్తీ చేస్తున్నా ఇద్దరిలో రెండోవవాణ్ణి అడిగాడు. "తాబి ఈ వేళ మందు పుచ్చుకోడా?" అని!

    "ఏమో! పడక పరచాడుగదా, ఈ రోజుకి ఆ ప్రయత్నంలేదనుకుంటూ...."

    "గురూ, ఇంతకీ మనం ఎక్కడికి పోతున్నాం__ ఈ పడవలోనే కొలంబస్ లా భూ ప్రదక్షణం చేయడంలేదు  గదా" నవ్వుతూ అన్నాడు.

    "అయినా కావచ్చు, మన గురించి ఆలోచించేవారు, కంట తడి పెట్టేవారు ఎవరయినా ఉంటే గదా దిగులు..."

    "మన ముగ్గురికీ అలాగూ లేరనుకో. మరి ఆ అమ్మాయికో..."

    "ఆ అమ్మాయిని వెళ్ళి అడిగి రమ్మంటావా?"

    బ్వాడి ప్రశ్నకు రెండవవాడు ఉలిక్కిపడ్డాడు. "వద్దు గురూ... ఆ పనిమాత్రం చేయకు" అన్న రెండోవవాడి మాటలకు సమాధానంగా మొదటివాడు నవ్వేశాడు.

    "పద... ఆ ఇద్దరికీ పుడ్ తీసి కెళ్దాం" అన్నాడు సంభాషణను మారుస్తూ.

    "తంబి గ్ల్సులో మందు, ఆ అమ్మాయికి మంచినీళ్ళు తీసుకో"

    "గ్లాసులు మారితే..."

    "ఆ అమ్మాయికి ఆ మాత్రం వాసన తెలియదంటావా?"

    "వారం రోజులలోపు తిరిగి వెళ్ళాకపోతే ఆ అమ్మాయి కూడా మంచినీళ్ళు బదులు మందు తాగాల్సిందే!"
   

 Previous Page Next Page