Previous Page Next Page 
గాడ్స్ గిఫ్ట్ పేజి 27

    ప్రెసిడెంటుగారి కొడుకు పెద్దమనిషై నాల్రోజులైపోంది. తలంటి స్నానం చేయించి ఇంట్లోకి తీసుకొచ్చారో లేదో ప్రెసిడెంటుగారి భార్య కూతురు మకరందవల్లి పెద్దమనిషై కూర్చుంది మళ్ళీ ఆ ఇంట్లో సవర్తపేరంటం మొదలయింది. ప్రెసిడెంటుగారి భార్యకి అయిదుగురు ఆడపిల్లలు. ప్రెసిడెంటుగారు నలుగురు కొడుకుల్ని కంటే ప్రెసిడెంటుగారి భార్య ఐదుగురు కూతుళ్ళని కంది.
   
    ఆ ఇంట్లో ఇంకా ముందు ముందు తొమ్మిది శుభకార్యాలు జరగనున్నాయ్.
   
                                              *    *    *    *
   
    ఆ ఊళ్ళో-
   
    లేడీస్ కాలేజి, జెంట్స్ కాలేజి ఒకే వీధిలో వున్నాయ్. రెండు కాలేజీల వాళ్ళు సాయంత్రం కాంగానే ఒకే సమయంలో కాలేజీల్లోంచి బయట కొస్తారు.
   
    రోడ్డంతా వయసొచ్చిన ఆడ మగ పిల్లలతో సైకిళ్ళతో, స్కూటర్ లతో అక్కడక్కడ రిక్షాలతో నాలుగయిదు కార్లతో మహా రష్ గా ఉంటుంది.
   
    కాలేజీ నుంచి బయటపడ్డ అంబుజవదన తన లూనా తీసుకొని ఇవతలకు వచ్చింది. ఆమెతోపాటు ఆమె స్నేహితురాళ్ళు రోడ్డు మీద కొచ్చారు.
   
    సరీగ అదే సమయంలో కాలేజీనించి బయటకొచ్చిన కఫూర్ నడిచి రోడ్డెక్కాడు. ఆడపిల్లల్ని చూసుకోలేదు. వాళ్ళకి అడ్డు రావడంతో ఒకమ్మాయి లూనామీంచి బ్యాలెన్స్ తప్పి కిందపడిపోయింది దాంతో అక్కడ చిన్న వాగ్ మొదలయింది.
   
    "నేను చూసుకోలేదు. కావాలని మీకేం అడ్డు రాలేదు" కఫూర్ అన్నాడు.
   
    "కాదు కావాలనే వచ్చావ్. నీ సంగతి నాకు తెలీదేంటి? నీ రౌడీ రాలుగాయి వేషాలు చాలా రోజుల్నుంచి కనిపెట్టి చూస్తూనే ఉన్నాను. మేం వెళ్ళేది వాహనాల మీద నువ్వెళ్ళేది మోకాలి నడకన. కావాలని మా బళ్ళకి అడ్డు వచ్చింది కాక పైగా మాటలొకటి. సారీ చెప్పు" అంటూ అంబుజవదన గీరగ మాటాడింది.
   
    "కాలి నడక వాళ్ళకన్నా వాహనా లున్నవాళ్ళే కళ్ళు తెరుచుకుని ప్రవర్తించాలి. నీకు సారీ చెప్పే అవసరంలేదు. మీరు డబ్బున్నవాళ్ళ పిల్లలైతే కావచ్చు. తప్పు మీదయినప్పుడు సారీ చెప్పే అవసరం లేదు" అంటూ కఫూర్ పొట్లాటేసుకున్నాడు.
   
    అటు ఆడవాళ్ళు ఇటు మగవాళ్ళు చేరారు. పోట్లాట పెద్దదైంది. "నీ అంతు చూడకపోతే నా పేరు అంబుజవదనే కాదు" అంటూ అంబుజ వదన ఘోర శపధం చేసింది.
   
    "నీ పేరు వుంచుకుంటే ఎంత తీసేస్తే ఎంత? పొగరు తగ్గించుకో బాగుపడతావ్" కఫూర్ తల ఎగురవేసి చెప్పాడు చాలా పొగరుగా.
   
    "నీ పొగరు ఎలా అణచారో నాకు తెలుసులే" అనుకొన్న అంబుజవదన అప్పటికి మారుమాటాడకుండా వెళ్ళిపోయింది. ఆ వెంటనే స్నేహితురాళ్ళూ వెళ్ళిపోయారు.
   
    "అనవసరంగా ఆ పిల్లతో వాదన పెంచుకున్నావ్ రా కఫూర్! అది అసలే డబ్బున్నవాళ్ళ ఆమ్మాయి. రౌడీపిల్ల నీ దోవన నీవు పోక ఎందుకొచ్చిన గోల?" అంటూ స్నేహితులు కఫూర్ ని మెత్తగా మందలించారు.
   
    కఫూర్ వాళ్ళ మాటల్ని లక్ష్యపెట్టలేదు.
   
    అక్కడితో వాళ్ళ కథ అయిపోలేదు. కొత్త కథకి నాంది మొదలయ్యింది.
   
    ఒంటరిగా కఫూర్ ఇంటికి వెళ్తుంటే అంబుజ వదన నలుగురు ఆడపిల్లల్ని వెంటేసుకుని అడ్డు తగిలింది. అంతేకాదు. ఒకమ్మాయి అతని మీద పడి నోరు మూస్తే మిగతా ముగ్గురు కలిసి కఫూర్ ని రోడ్డు పక్కగా ఒక పొద చాటుకి లాక్కెళ్ళారు.
   
    నలుగురు ఆడపిల్లలు కలిసి సామూహికంగా కఫూర్ ని రేప్ చేసి అక్కడే వదలిపోయారు.
   
    శీలం కోల్పోయిన కఫూర్ పడుతూ లేస్తూ అక్కడి నుంచి బయలుదేరి పోలీస్ స్టేషన్ కు వెళ్ళి ఆ నలుగురు ఆడపిల్లలు మీద రిపోర్ట్ ఇచ్చాడు.
   
    డ్యూటీలో వున్నా ఇన్ స్పెక్టర్ గారికి ఆ ఉదయం నుంచి మనసు మనసులో లేదు. కారణం ఆయన ఇప్పుడు కడుపుతో వున్నాడు. ఏడో నెల జరుగుతున్నది. లీవు పెట్టి ఇంటిలో వుందామంటే కుదరక చచ్చినట్టు డ్యూటీకి వచ్చాడు ఆయనకీ మరొ దిగులు కూడా వుంది. ఎక్స్ రే తీసిన డాక్టర్ గారు "నీ కడుపులో వున్నది ఒక బిడ్డ కాదు కవలపిల్లలు" అని శుభవార్త వినిపించాడు. మనసు బాగుండక పోవటానికి అదొక కారణం.
   
    ఆ ఇన్ స్పెక్టర్ గారు పోలీస్ కానిస్టేబుల్ గా ఉద్యోగంలో చేరి ప్రమోషన్ లు పొందుతూ చివరికి ఇన్ స్పెక్టర్ అయ్యాడు. ఉద్యోగంలోనే ప్రమోషన్ లు గాక నిజ జీవితంలో కూడా ఒక్కొక్క అబ్బాయిని కంటూ అప్పటికే నలుగురు బిడ్డలకి తండ్రి అయ్యాడు. ఇన్ స్పెక్టర్ అయ్యే నాటికి నలుగురు బిడ్డల తండ్రి.
   
    అది చాలదన్నట్టు ఇప్పుడు కడుపులో కవల పిల్లలు పెరుగుతున్నారు. దిగులు కాక మరేమిటి? ప్రమోషన్ ఇవ్వరాదంటూ ప్రభుత్వం నించి ఆర్డర్ వచ్చింది.
   
    ఇన్ స్పెక్టర్ గారు విచారంగా కూర్చున్న సమయంలో కఫూర్ వచ్చి కంప్లయింట్ రాసిచ్చాడు.

    "నీకేసు చూస్తాంలే వెళ్ళు" అని చెప్పి అప్పటికి కఫూర్ ని పంపించి వేశాడు ఇన్ స్పెక్టర్.
   
    కఫూర్ అటెళ్ళంగానే అతను రాసిచ్చిన కంప్లెయింట్ ని చిత్తుకాగితాల బుట్టలో విసిరి కొట్టాడు.
   
    దాంతో కఫూర్ ఇచ్చిన కంప్లెయింట్ గాలి కెగిరిపోయింది. ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్ కు వెళ్ళొచ్చినా రవ్వంతయినా కనిపించలేదు. కంప్లెయింట్ ఫలితం కనిపించలేదు గాని సామూహిక మానభంగంవల్ల కడుపు మాత్రం వచ్చేసింది.
   
    కఫూర్ డాక్టర్ దగ్గిరకెళ్ళి పరీక్ష చేయించుకున్నాడు. డాక్టర్ పరీక్షలో కఫూర్ కడుపులో పెరుగుతున్నది మూడు పిండాలని తెలిసింది. రేప్ చేసిన అతివలు నలుగురు. కఫూర్ కడుపులో పెరిగేది మాత్రం ముచ్చటగా ముగ్గురు వీళ్ళకి తల్లెవరు?
   
    తన రోదన అరణ్య రోదనే అని గ్రహించిన కఫూర్ ఇంట్లో వాళ్ళను, స్నేహితులను, పోలీసులను వదిలేసి ప్రభుత్వం కదిలి వచ్చేలా మౌన పోరాటం నట్ట నడి జబారులో ఏర్పాటు చేస్తూ ఒక జంపఖానా పరచుకొని కూర్చున్నాడు.
   
    దారినపోతూ ఆగి తన్ని అడిగిన ప్రతివాళ్ళకి తన మౌనవ్రతం తాలూకా ఘోష వినిపించాడు. "మీరు నాగోడు విన్నారు కాబట్టి మీరంతా నా తరపున నిలచి... ఇటు అంబుజ వదన ఆమె మిత్రురాళ్ళు, అటు ప్రభుత్వం దిగివచ్చి నా కోర్కెలు మన్నించేవరకు నేను నా మౌనవ్రతం నిరాహార దీక్ష నా ప్రాణాలు పోయేవరకు చేస్తాను. మీరు నా తరపున నిలచి పోరాడతారా!" అని కోరాడు.

 Previous Page Next Page