"అవునండి!"
"మాట్లాడేది అనంతపద్మనాభశాస్త్రియేనా?"
"కాదు-రాజారావు! నా పేరు రాజారావు? ఇహ ఫోన్ పెట్టవచ్చండి."
"చూడు అనంతపద్మనా..."
"నా పేరు రాజారావు! ఆ అనంతం ఎవడో, మీరెవరో నాకు తెలియదు."
"చూడు, అనంతపద్మనాభశాస్త్రీ! ఊరికె బుకాయించవద్దు"
"బుకాయించే ఖర్మ నాకు పట్టలేదు. కావాలంటే వచ్చి చూసుకోండి."
ఫోన్ లో పెద్దగా నవ్వు వినపడి టక్కున ఆగిపోయింది.
రాజారావు నొసలు ముడిపడ్డాయి. నేను చెప్పేది సావకాశంగా వింటావా?"
"వింటాను! వినక తప్పుతుందా? ఈ రాత్రంతా నిద్రకూడా పోనివ్వరు. ఈ ఫోన్ గోలతో ఆ చెప్పేదేదో తొందరగా చెపితే హాయిగా నిద్రపోతాను."
"నీవు నిజంగానే అనంతపద్మనాభశాస్త్రివి కాదా!" అవతలి నుంచి తాపీగా వినవచ్చింది.
"కాదని చెపుతూనే వున్నాగా! నా పేరు రాజారావు అని చెపుతుంటే వేధిస్తుంటివి" రాజారావు ఆత్రంగా అన్నాడు.
"నువ్వు అనంతపద్మనాభశాస్త్రివి కాదా! అచ్చం అలాగే వున్నావు కానీ నువ్వు అనంతపద్మనాభశాస్త్రి ఫేస్ తగిలించుకుని ఈ ఊరు రావటానికి తగిన కారణమే వుండి వుంటుంది."
"మీరు పొరబడుతున్నారని మర్యాదగా మరోసారి చెపుతున్నా! నా పేరు రాజారావు! మీరు చెప్పే పోలికలు నాలో వుండవచ్చు, అంతమాత్రాన నన్నీవిధంగా మీరంతా అవమానం చేయటం బాగుండలేదు."
"మీరంతా అంటున్నారు! ఎవరెవరు అడిగారేంటి!"
అతడు మాట్లాడలేదు.
"ఆ విషయం చెప్పకపోతే వచ్చే నష్టం ఏం లేదుగానీ ఈ ఊరు ఏం ప్లాన్ మీద వచ్చావో చెప్పమ్మా!" లాలనగా అడిగాడు అవతలి మనిషి.
"నీ బోటివాళ్ళని గోల చేద్దామని" కసిగా అన్నాడు అతడు.
"అది నీ తరం కాదు! నీ అబ్బతరం కాదు."
"పోనీ! నీ అబ్బతరం అవుతుందా?"
"స్టుపిడ్!"
"యూ స్టూపిడ్."
ఫోన్ లో కాసేపు నిశ్శబ్దం ఊపిరి పీల్చే చప్పుడు.
"నా ప్రయత్నంలో నేనుంటాను."
"నీ ప్రయత్నంలో నువ్వుండు" అవతలి మనిషి అన్నాడు.
"నీ ఏడుపు ఏదో నువ్వు ఏడువు" అన్నాడు రాజారావు.
"మంచిది! నా గురించి వివరాలు అక్కర్లేదా?"
"అక్కర్లేదు."
"అయినా చెప్పటం మర్యాద, నా ధర్మం."
"నా పేరు అనంతపద్మనాభశాస్త్రి అండర్ స్టాండ్."
అవతలి ఫోన్ పెట్టిన శబ్దం అయింది.
రాజారావు కొయ్యబారిపోయాడు
24
రాజారావు షేవింగ్ చేసుకుని బాత్ రూంలో దూరి అరగంట గోరు వెచ్చని నీటిలో స్నానం చేశాడు.
బాత్ రూంనుంచి బైటపడి మరో అరగంట టాయ్ లెట్ అవుతూ అద్దంముందు గడిపాడు.
ఇంకా అద్దంముందునుంచి కదిలి ఇవతలికి రాబుద్ది కావటంలేదు. దువ్వుకున్న క్రాపునే మళ్ళీ మళ్ళీ దువ్వుకున్నాడు ఫోన్ ట్రింగ్ మంది.
రాజారావు విసుగ్గా ఫోన్ వేపు చూసి మళ్ళీ అద్దం వేపు ముఖం తిప్పాడు.
ఫోన్ దగ్గరకెళ్ళి ఫోనెత్తి ప్రయత్నం చేయలేదు.
విసుగుచెందని విక్రమార్కుడిలా ఫోన్ తన పది కానిస్తూనే వుంది.
చెవికోసిన మేకలా చెవిదగ్గర అరుస్తూంటే సహనవంతుడికి కూడా చచ్చే విసుగు పు
రాజారావుకి చచ్చే కోపం వచ్చింది. రెండంగలలో ఫోన్ దగ్గర కొచ్చి రిసీవర్ ని చేతిలోకి విసురుగా తీసుకున్నాడు.
"హలో!" అవతలినుండి వినపడింద
"ఏమిటీ హల్లో! నీ పిండాకూడు, నా శాద్ధమూ, ఫోన్ చేయటం తప్ప వేరే ఏం పని లేదా నీకు? అనంతపద్మనాభశాస్త్రిని నేను అని ఫోనులో అఘోరించకపోతే నా ఎదుటికొచ్చి నీ ముఖం చూపరాదు. దాగుడుమూతలాడుతున్నావే ముఖం పచ్చడి చేసేవాడు లేక..."
అవతలివేపు నుంచి నవ్వు వినపడటంతో రాజారావు వాక్ ప్రవాహం ఆగిపోయింది.
ఫోన్ లో నవ్వు ఆగిపోయింతర్వాత "పిచ్చి పట్టిందా! లేక కోతులాడుతున్నాయా నీ చుట్టూ" అన్నాడు రాజారావు.
"నేనోయ్ రాజారావ్! ఫోను చేసిన వ్యక్తిని" అన్నాడు.
"నేనంటే! అనంతపద్మనాభశాస్త్రివా!" అన్నాడు రాజారావు.
"అనంతపద్మనాభశాస్త్రి నీతో మాట్లాడాడా" అవతలి వ్యక్తి ఆదుర్దాగా అడిగాడు.
"నేనే రాజారావ్! నా కంఠం గుర్తుపట్టలేదా?"
ఉహు గుర్తుపట్టలేదు నీ బొంగురు స్వరం నేనెప్పుడూ వినలేదు సరేనా?