"మీ డాడికి..డైరి రాసే అలవాటుంది....నీకు తెలుసుకదా....అందులో ఆయన రెండు డైరి లు రాస్తారు. ఒకడైరి పర్సనల్ కాన్పిడెన్షి యల్ మేటర్స్....రెండోది....అఫిషియల్ మేటర్స్ .....ఆ డైరి గనక- సంపాదిస్తే ....మనపని సులువవుతుంది."
"వీలునామా విషయం....వాటిలో ఉండొచ్చంటారా...." ప్రశ్నించింది ముక్త.
"తప్పకండా ఉంటుందని నా నమ్మకం....ఆ డైరి లేప్పడూ ఆ వీ. ఐ.పి సూట్ కేసులోనే ఉంటాయి. ఆ రోజు....ప్యాలెస్ ఆం విల్స్ లోకి ఎక్కేముందు వరకూ, ఆ సూట్ కేసు నా దగ్గరే ఉంది. అందులో మీ డాడికి చెందిన చెక్ బుక్ కూడా ఉన్నాయి. టైన్ లో ఆయన పర్సనల్ క్యాబిన్ లోకి వెళ్ళేముందు , నేనే ఆ సూట్ కేసును ఆ క్యాబిన్ లోని టేబిల్ మీద పెట్టాను" చెప్పారు సూర్యసాగర్.
"తర్వాత ఆ సూట్ కేసేమ్తెంది...." అనుమానంగా అడిగింది ముక్త.
"నిజవేనమ్మా.....ఇంతవరకూ ఆ సూట్ కేసును గురించి ఎవరూ పట్టించుకొకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఆ సూట్ కేసేక్కడుంది" తనని తనే ప్రశ్నించుకున్నాడయన.
"ఆ సమయంలో ప్యాలెస్ ఆం విల్స్ లో డాడితో పాటు ఎవరెవరున్నారు" ప్రశ్నించింది ముక్త.
"పర్సనల్ సెలూన్లో ఎవరూలేరు....ఎటాచ్ డ్ కంపార్ట్ మెంట్లో జరిగిన డ్రింక్ పార్టిలో ఆయన సన్నిహిత మిత్రులున్నారు. వాళ్ళలో ఎవరి దగ్గర్తేనా ఉందేమో...." దీర్ఘాలోచనలో పడ్డారు సూర్యసాగర్.
పదిహేను నిమిషాల్ తర్వాత ముక్తే అంది.
"మర్డర్ జరిగిన వెంటనే, డాడిని మొట్టమొదటిసారిగా చూసింది....మీరు....అవునా."
"అవును...."
"వెంటనే ఎవరికీ రిపోర్ట్ చేసారు మీరు?"
"జ్తేపూర్ ర్తేల్వే పోలిసులకి...."
"జ్తేపూర్ ర్తేల్వే పోలీసుల్ని ఎంక్వయిరీ చేస్తే తెలుస్తుందనుకుంటాను" అంది ముక్త.
"గుడ్....అయిడియా...."
"ఫోన్ చేస్తారా....."
"ఇలాంటి పనులు ఫోన్ ద్వారా కావమ్మా....వెళ్ళాలి...ర్తేల్వే పోలీసులు లేదా జ్తేపూర్ ఏం.పి....వీరిద్దరిలో ......ఎవరికో ఒకరికి ఆ సూట్ కేసు గురించి తెలుస్తుంది. లక్కీగా ఉందనుకో ....మన ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది."
"ఇప్పడేల్లా....."
"ఎలా...ఏవీటి? నేను వెళ్తాను....ఈ రాత్రికి, జ్తేపూర్ బయల్దేరి వెళ్తాను. నేను ఆలోచించేది ని గురించే....నువ్వు ఒక్క ర్తివే , ఎవరూ సహాయంగా లేకుండా."
"నన్నేవరేం చేస్తారు.....?"
"ఈ సమయంలో ఓవర్ కాన్పిడేన్స్ పనికిరాదు తల్లి....అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. రవిచంద్ర , నీ ప్రాణాలకేవైనా ప్రమాదం తల పడితే..." తన మనసులోని సంశయాన్ని వ్యక్తం చేసాడు సూర్యసాగర్.
"ఈ పరిస్ధితిలో నా జోలికి రాడు....నాకేవైనా జరిగితే.....దానిక్కారణం....అతనే అవుతాడు కాబట్టి...." చెప్పింది ముక్త.
"నీకు లిగాలిటిస్ తెలుస్తున్నాయి ముక్తా....అయినా ఎందుకైనా ,మంచిది.....అడయార్ పోలిస్ స్టేషన్ ...సబ్ ఇన్స్ పెక్టర్ వరదరాజు న్ నాకు తెలుసు అతనికి ఇన్ ఫామ్ చేసి వెళ్తాను."
జైపూర్ వెళ్ళడానికి ఉద్యుక్తుడయ్యాడు సూర్యసాగర్. వెళ్ళే ముందు, మరి మరి జాగ్రత్తలు చెప్పి వెళ్ళాడయన.
* * *
మద్రాసు....
జెమిని సర్కిల్ లోని అన్నప్ల్తే ఓవర్ కి, ఎడమ వేపునున్న షాపింగ్ కాంప్లెక్స్ ముందు నీలం రంగు మారుతి కారాగింది.
అందులోంచి రవిచంద్ర, అనిమిష దిగారు. పుష్పక్డైనింగ్ సీట్లోనే కూర్చున్నాడు.
షాపింగ్ కాంప్లెక్స్ లోని గ్రౌండ్ ప్లోర్లో ఉమ్మిడియర్ జ్యూయలర్స్ నేమ్ బోర్డు నిరెండలో అందంగా కనిపిస్తోంది.
లోనికోస్తున్న రవిచంద్రను చూడగానే, షాఫ్ ఒఅనర్ రతన్ లాల్ ఉమ్మిడియర్ గబగబ కేష్ కౌంటర్ లోంచి లేచి ఆహ్వానించాడు.
అతిధి సత్కారాలయక తానెందుకోచ్చాడో చెప్పాడు రవిచంద్ర.
ఆ నక్లేసును తెప్పించి___
"ఓకే ఒక్క పిసుంది రవిచంద్రనాయుడుగారూ....యూఆర్ వెరి లక్కి...."
ఆ బక్సుని ఆత్రంగా అందుకుని , ఆ నక్లేసును తీసుకుని , తన మెడ దగ్గర పెట్టుకుని , అద్దంలో చూసుకోంటోంది అనిమిష.
"సారి....రవిచంద్రనాయుడుగారూ ...డాడి బ్రూటల్ మర్డర్ గురించి పేపర్లో చదివాను....వెరిసారి..."
తన సంతాపాన్ని తెలియజేశాడు ఉమ్మిడియల్.
రవిచంద్ర, జేబులోంచి చెక్ బుక్ తీసాడు.
"కాస్ట్ ఎంతన్నారు....." ఉమ్మిడియర్ ముఖంలోకి చూస్తూ అడిగాడు.
"ఫిప్టిలాక్స్ ....బస్....అంతే....కానీ__రవిచంద్రనాయుడుసాబ్... చిన్న రిక్వెస్టు....ఈ సారి కేష్ ఇప్పించండి....చెక్ వద్దు."
ఉమ్మిడియర్ చెక్ ఎందుకు వద్దంటున్నాడో అర్ధం కాలేదు రవిచంద్రకు.
"రెండ్రోజుల్లో.....మీ చెక్ ఎన్ కేష్ అయిపోతుంది....... డోన్ట్ వర్రీ..... పూచీనాది....." అప్పటికే రవిచంద్ర ముఖం పాలిపోయింది.