Previous Page Next Page 
అమ్మో! అమ్మాయిలు పేజి 26

 

    " పోనీ పెరుగు కావాలా?"

    " పీలు తోడేస్తా కదండీ అదే పెరుగవుంతుంది."

    " వెచ్చాలు, అంటే ఉప్పు, పప్పు వగైరా..."

    " నిండు డబ్బాలతో వున్నాయండి."

    " పోనీ యిస్త్రీ చాకలిని పిలవమటారా?"

    " నిన్ననే బట్టలేయించు కెళ్ళాడండి."

    " అబ్బబ్బా! అన్నింటికి వున్నాయి, వున్నాయి, ఎలా గండి?"

    " ఏంటీ?"

    " అదే, మి బామ్మగారు మికేం కావాలో కనుక్కోమందా? మేమేం కనుక్కొన్నా వున్నాయి, వద్దు అంటున్నారు.

    కనీసం మర్యాదకి మేం అడుగుతున్నాం కదా అని అయినా ఏదో వకటి లేదకూడదూ?" అన్నాడు వ్యాకర్ణ యింకేం అడగాలో తెలియక.

    " లాభం ఏమిటి?" అంది జయచిత్ర.

    " పాయింటే" అన్నాడు అబ్బులు.

    వ్యాకర్ణకి వళ్ళు మండింది. " వెధవాయ్ నువ్వు 'లా' చదవటానికి తప్ప యింక దేనికి పనికిరావు" అన్నాడు.

    జయచిత్ర నవ్వి- " బాగుందండోయ్ జోక్. తెలివి తక్కువ నాగన్నలు 'లా' చదవటానికి పని కొస్తారని పాయింట్ లాగారు" అంది.

    " మిరు పాయింట్ కొచ్చారూ?" అన్నాడు వ్యాకర్ణ.

    " ఇప్పుడు మిరూ వచ్చారు" అంటూ మరోసారి నవ్వింది జయచిత్ర.

    సరిగ్గా అప్పుడే జిడ్డుధర్మరాజు బీడీ తాగుతూ అక్కడి కొచ్చాడు.

    బీడీ అవతల పారేసి వరండా మెట్లెక్కి పైకోస్తూ- " అబ్బాయిలు యిక్కడే వున్నారే? సరి సరి.

    ఏమ్మా జయచిత్రా! మి నాయనమ్మ వెళ్ళిపోయింది..." అంటూ చివరి మెట్టుమిద ఆగాడు.

    " నీ శార్ధము, నీ పిండాకూడు" అని పైకే శాపనార్ధాలు పెట్టింది జయచిత్ర.

    ధర్మారాజు వరండాలో వున్న మెడామిద కూలబడి " నాయనమ్మ వెళ్ళిపోతే మేమంతా లేమా? ఏం కావాలో చెపితే నేనున్నాను, అబ్బాయిలున్నారు. తెచ్చి పడేస్తాం" అన్నాడు.

    "ఛాదస్తపు నానమ్మా! నా భారం ఈ జిడ్డుమిద కూడా పెట్టి వెళ్ళావా? ఖర్మ" స్వగతంగా అనుకుంది జయచిత్ర.

    " పోనీలెండి, కాసేపు వాగి వెళతాడు" జాలి చూపించాడు వ్యాకర్ణ.

    ఆ తర్వాత ధర్మారాజు మధ్య జయచిత్ర మధ్య యీ విధంగా సంభాషణ జరిగింది. " కూరలున్నాయా అమ్మాయీ!" అన్నాడు ధర్మరాజు.

    " ఉన్నాయి" అంది జయచిత్ర.

    " లేవూ! సరి సరి రేపొద్దున నేను ఓ సంచీడు తెచ్చిపడేస్తాలే. మి నానమ్మ ఎప్పుడొస్తానంది?"

    " ఇంకా నాలుగు రోజులకి."

    " సరి సరి పదిరోజులుంటుందన్నమాట. ఊరికి దేని కెళ్ళింది."

    " ఏం పనిలేక."

    " మరే, పెద్దవాళ్ళకి బోలెడు పనులు. వెళ్ళకపోతే ఎలా?"

    ధర్మారాజు ఏమిటేమిటో అడుగుతూనే ఉన్నాడు. జయచిత్ర వ్యాకర్ణ వైపు తిరిగి- " తలనిప్పి వచ్చేసిందం డీ!"అంది.

    వ్యాకర్ణ గాభరాపడుతూ లేచి " ఆస్పో తెమ్మంటారా? నవాలజిన్ తేనా? విక్స్ తేనా? అమృతాంజనం తేనా?" అన్నాడు.

    " ఏం వద్దు. ఈ జిడ్డుమారాజు వెళితే అదే పోతుంది" అంది.

    " ఇటు కాలక్షేపం, అటు మి తలనొప్పి పోగొడతా చూడండి" అన్నాడు అబ్బులు.
    

 Previous Page Next Page