"దానికి ప్రతిఫలం ఏమిటో తెలుసా?"
"రోజూ చస్తూ బ్రతికేకంటే రేపటితో చావో బ్రతుకో తేల్చుకోవడం మంచిది కదా!"
"అందుకు మేము మాత్రం సిద్దంగాలేం...."
"పుట్టినప్పుడు కలసి పుట్టలేదు. జీవిత మార్గంలో కలిశాం__ విడిపోతున్నాం. అంటే" అన్నాడు.
ఆ మరుసటిరోజు ఉదయానే లేచి వినాయుకుని గుడికి వెళ్ళాడు. అప్పటికే అక్కడ నీళ్ళుచల్లి ముగ్గులు పెట్టి వున్నాయి. మామిడి మండలుకట్టారు. పలకలు దొంతరలుగా పేర్చి వున్నాయి. మరోప్రక్క మరమరాలు, పప్పుబెల్లం, ఇతర తినుబండారాలు. అక్కడికి తిలసంస్కారంలేని జుట్టుతో, చిరిగినా దుస్తులతో దాదాపుగా నలబై_ ఏభైమంది చిన్న పిల్లలు వచ్చారు. వారందర్నీ మంచి మాటలతో ఓ ప్రక్కగా కూర్చో బెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు పండిట్ జీ ఉద్దేశించి అన్నాడు.
"పండిట్ జీ! నా మామూలు ఇవ్వకుండా ఇక్కడ బడి పెటోద్దన్నానా? నీ కేక్కడ్నించి వచ్చింది ఈ ధైర్యం" అంటూ కాలితో మరమరలా బుట్టను బలంగా ఒక్క తన్నుతన్నాడు. అ బుట్ట బెలూన్ లా గాలిలోకి లేచింది. మరమరాలు విరజిమ్మిబడ్డాయి. అన్న కేకతో అగిపోయాడు.
తంబి అతడి ముందుకోచ్చాడు.
"అరె తంబీ! నువ్విక్కడ... ఏమది పనేమన్నా వుండి వచ్చావా? నీ వెందుకు రావడం__ కాకితో కబురంపితే నీ పని పూర్తీచేసేవాడిని గదా"
అని, "అరెతంబికి టీ గట్రా మర్యాదులు చూడండి" అని తన అనుచరుల్ని ఉద్దేశించి అన్నాడు.
"మీ అతిధిమర్యాధులకు చాలా సంతోషం. నేను నీకు రెండుచేతులూ ఎత్తి నమస్కరిస్తున్నాను. ఈ పసివాళ్ళని వదిలేయ్. అడుక్కుతినెవాళ్ళ దగ్గర మామూలు వసూలు చేయకు."
"అచ్చా_ అదన్నమాట పండిట్ జీ ధైర్యం. అయినా తంబీ_ ఇది నా డివిజన్. ఇక్కడ న ఇష్టం వచినట్లు జరగాలి. తెలిసిందా?'
"అందుకే బ్రదర్_ నీకు వంగి వంగి సలాములు చేసేది. ఈ పసివాళ్ళని ఒగ్గేయ్..."
"అది జరగదు. ఇది నా ప్రేస్తేజీ కోశ్చను_"
"మరొకమారు దణ్ణం పెడుతున్నాను. ఆ పసివాళ్ళలో మరొక పాండు, తంబి తాయారు కాకుండా చూడు..."
"అని న డివిజన్ కి చెప్పడానికి నువ్వెవడివి బే..." అంటూ మరో అడుగు ముందుకేయబోయాడుగాని అడ్డుగా తంబివచ్చి నిల్చోవడంతోనే ఆగిపోయాడు.
"పాండూ! నీ కాళ్ళు పట్టుకుంటాను. దయచేసి పసివాళ్ళ జోలికిరాకు"
"అని నీవు వినడానికి నేను నీ గౌలాముని కాను. ముందు అడ్డుతప్పుకో__"
"అడ్డు లేచే ప్రసక్తిలేదు_"
తంబి సమాధానం వింటూనే పాండు అనుచరులు తంబిని మరకత్తులతో చుట్టూముట్టారు. అటువంటి సంఘటన ఏదో జరుగుతుందని గ్రహించిన చుట్టూవున్నా జనం ఎవరికీవారే కాళ్ళబలం ప్రదర్శించారు. రేపటి గూండాలు_ రౌడీలు గా మారనున్న ఆ పసివాళ్ళు ఆశ్చర్యంతో, ఆకలితో ఓ మూలకు చేరారు.
"తంబీ_పెద్ద స్త్రీట్ ఫైటర్ వి గదా! చూడరా మా తఢఖా_ ఈ రోజుతో నీ చరిత్ర పరిసమాప్తి" అంటూ బెల్టు బిగించాడు పాండు.
అప్పుడు జరగరానిది జరిగింది.
తంబి ముఠా రెండు జేపుల్లోదిగింది. ఎవరు ఎవర్నికొట్టారో చూసిన వారంటూ లేరు. అక్కడి నేల రక్తంతో తడిసింది. చోట్టూప్రక్కల వున్నా ఇల్లు తగలబడ్డాయి. కాని పోలీసులు రంగా ప్రవేశం చేసేసరికి ఏ ఒక్కరూ లేరు. ఎవరికీ వరు తప్పుకున్నారు. అంత గలాటా జరిగిన ఏ ఒక్కర్నీ అరెస్టు చేయకపోవడం అవమానంగా భావించారుపోలీసు అధికార్లు. అంత గొడవ జరిగినప్పుడు తప్పకుండా కొందరికయినా పెద్ద దెబ్బలు తగిలి వుంటాయన్న నిర్ణయానికి వచ్చారు. దుమ్దగుల్ని అరెస్టు చేయటానికి ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర, ప్రైవేట్ హాస్పిటల్స్ దగ్గర పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. గాయలతో ఎవరైనా వస్తేచాలు అరెస్టు చేయమని ఉత్తర్వులు ఇచ్చారు. దుండగుల కోసం పోలీసులేకాదు, పాత్రికేయలు కూడా రంగప్రవేశం చేశారు. గాయాలతో ఎవరైనా వస్తేచాలు అరస్టు చేయమని ఉత్తర్వలు ఇచ్చారు. అంతకు కొద్దికాలం నుంచి మాఫియ గుంపుల ఘర్షణపడటం_ అంతపెద్ద అగ్నిప్రమాదం జరగటంతో పాలనా యంత్రాంగానికి అదొక సవాలుగా నిలిచింది. పైపెచ్చు పత్రుకల్ని ఆ విషయానికి బహుముఖి ప్రచారం ఇచ్చాయి.
ఆ గొడవలో తంబి తలకు బలమైన గయాలు తగిలాయి. ప్రతి హాస్పిటల్ వద్ద పోలీసు బందోబస్తుంది. ప్రైవైటు డాక్టర్ని కూడా తీసుకురావవడం కూడా అసంభావంగా తోచింది. మరుసటి రోజుకి తంబి తల సెప్టిక్ అయి వాచీపోయింది. అదే పరిష్టితి కొనసాగితే తంబి చనిపోవడం ఖాయం. అనుకున్నారు. వెంటనే తదుపరి కార్యక్రమాన్ని రూపొందించారు. ఆ సారా దుకాణాన్ని అంతకు పూర్వమే ఎప్పుడో ఇన్సూర్ చేయించారు. అందువల్ల వెంటనే దుకాణంలోని సారసీసాలను పగులగొట్టారు. లోపల వున్నా పర్నిచార్ ని ద్వంసం చేశారు. మంచం మీద దాదాపుగా అపస్మారక స్థితిలో పడివున్న తంబిని లేవదీసి బలంగా తల మీద పంచేస్ ఇచ్చారు. సెప్టిక్ అయి వాచీపోయిన తల నుంచి చీము రక్తం అ గదంత చిమ్మి చూడటానికి భీభత్సంగా మారింది. తంబి సృహతప్పి పడిపోయాడు. అప్పుడు పోలీసులకి ఫోను చేశారు. పోలీసులు రంగప్రవేశం చేయడంతో తంబి సమస్య పరిష్కారమైంది. తంబిని అంబులెన్సు లో పోలీసువారే హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు. పట్టణంలో అరాచకం సృష్టించే ప్రయత్నంలో భాగంగా గుర్తుతెలియని దుండగుల ముతా ఒకటి తమ దుకాణంపై దాడిచేసినట్టు ఫిర్యాదు చేశారు. ఆ విషంగా అ వ్యవహరం రంగుమారి పోలీసు రికార్డులకెక్కింది. ఇన్సూరెన్స్ వారు నష్టపరిహారం చెల్లించవలసి వచ్చింది.