అసహ్యంతో, భయంతో విదిలించుకుంది స్వరూప.
ఆహారాన్ని ఇస్తామంటే నిరాకరిస్తున్న ఆమె ప్రవర్తన వాళ్ళకి అనుమానాస్పదంగా తోచింది. అడవిలో జీవాలన్నింటికీ రెండే తాపత్రయాలు ఉంటాయి, ముఖ్యంగా ఒకటి ఆహరం సంపాదించుకోవడం, రెండు ప్రాణాలు దక్కించుకోవడం.
మరొకసారి ఆమె చేతులు పట్టుకు లాగారు.
వాళ్ళంతా చెమటలు పట్టేస్తుంటే, గజ గజ వణుకుతూ, వెనక్కి జరిగింది స్వరూప.
వాళ్ళు మరింత మీదికి వచ్చారు.
ఆప్రయత్నంగా, చేతికి అందిన రాయి తీసుకుని, వాళ్ళని బెదిరించబోయింది స్వరూప.
అదే ఆమె తప్పు!
వెంటనే ఆ అమ్మాయీ, అబ్బాయీ, పెద్ద తోడీళ్ళతో బాటు పళ్ళు బయట పెట్టి కోపంగా మొరుగుతున్నట్లు శబ్దాలు చేస్తూ ఆమె మీదికి ఉరికారు, ఆమెని ఖండ ఖండాలుగా చీల్చేయ్యడానికి సిద్దమవుతూ.
అప్పుడామె ప్రాణభయంతో కేకలెయ్యడం మొదలెట్టింది.
* * *
క్షణమొక యుగంగా సాగర్ కోసం ఎదురు చూస్తోంది అనూహ్య దాదాపు రెండు మూడు గంటలు గడిచినట్లు అన్పిస్తోంది, అతను ఏనుగులను అనుసరించి బయటికి వెళ్ళి.
ఆమె మనసు దిగులుగా, బరువుగా అయిపోయింది.
అతను త్వరగా వచ్చేస్తే బావుండు!
ఇంతలో మళ్ళీ సింహం గర్జించింది. వెంటనే, ఒక మనిషి పెట్టిన చావు కేక!
ముచ్చెమటలు పోశాయి అనూహ్యకి.
"ఇబూకా, బయటికి వెళ్ళిన వాళ్ళు ముగ్గురూ తిరిగ రానేలేదు. నువ్వు ఒక్కసారి వెళ్ళి చూసిరా" అంది బతిమాలుతూ.
చిన్నగా నవ్వాడు ఇబూకా.
"అవసరం లేదు మేడమ్. తిరిగ వచ్చేస్తారు వాళ్ళు."
కాసేపు ముళ్ళ మీద నిలబడినట్లు అసహనంగా నిలబడింది అనూహ్య. కాసేపు నిప్పులమీద పడుకున్నట్లు ఇబ్బందిగా పచార్లు చేసింది. ఇంక ఆగలేక మళ్ళీ ఇబూకా వైపు తిరిగింది.
"ఇబూకా, ప్లీజ్ ఒక్కసారి వెళ్ళి చూసిరావూ?"
"మీరు భయపడకండి మేడమ్."
రెంషణ్ తో ఉన్న అనూహ్యకి ఉవ్వెత్తున కోపం వచ్చింది.
"అవతల మనుషులు బతికి ఉన్నారో, చచ్చారో తెలియక నేను అల్లాడిపోతుంటే నువ్వు తాపీగా మాట్లాడతావేమిటి? ఉన్నాపరిస్ధితికి తోడు ఆ సింహం ఒకటి కొత్తగా దాపురించింది మన ప్రాణాలకి."
పెద్దగానవ్వాడు ఇబూకా. "అది సింహం కాదు మేడమ్, మాన్ ఫకర్ లా అరుస్తున్నాడు. అతనికి వెంట్రికిల్వాజమ్ వచ్చు."
అపనమ్మకంగా చూసింది అనూహ్య.
"కానీ ఎందుకైనా మంచిది, ఒకసారి చూసి వస్తే బాగుంటుంది కదా?"
"మిమ్మల్ని ఒకళ్ళనే చాంగ్ దగ్గర వదీలేసి వెళ్ళడం చాలా డేంజర్ మేడం. ఒకవేళ మీకు ఏదన్నా జరగరానిది జరిగితే, నాకు ఇంక ఈ జీవితంలో విష్కృతి ఉండదు" అన్నాడు జపనీయులకు సాధారణంగా ఉండే అతి విషయంతో తలవంచి.
"దుంగలా పడిపోయి వున్న ఈ చాంగ్ నన్నేమి చెయ్యగలడు దొంగ పట్టుకుని కోపాన్ని ఆపుకున్నాడు.
కాసేపు ఇబూకా సమాధానం కోసం ఎదురుచూసి, ఇంక లాభం లేదని తెల్చుకుని, చివరికి తనే బయలుదేరింది అనూహ్య.
వెంటనే అడ్డం పడ్డాడు ఇబూకా.
"వద్దు మేడమ్ నేనే వెళ్ళి చూసి వస్తాను." అని విచారంగా తల తాటించి , "నేనే టోక్యోలో ఒకసారి రామాయణం భలే చూశాను మేడమ్! దాన్లో అచ్చం ఇలాంటిసీనే ఒకటి ఉంది. దాన్లో సీతాసాబ్ (సీతగారు) కూడా ఇలాగే నిందించి తరిమెస్తారు లక్ష్మణ్ సాబ్ ని. అదే గుర్తొస్తోంది నాకు, సరే మేడమ్ జాగ్రత్తగా ఉండండి. ఈ రాక్షసపు వెధవకి ఎప్పుడూ నాలుగు గజాల దూరంలోకి ఉండండి పొరబాటున కూడా గుహ లోపలివైపుకు వెళ్ళకండి మేడమ్! నేను చిటికెలో తిరిగి వచ్చేస్తాను." అని నేలను తాకేలా వంగి అభివాదం చేసి, మరుక్షణంలో కనుమరుగై పోయాడు.
గుహ గోడకి అనుకొని కొద్దిసేపు అలాగే నిలబడి తర్వాత నిస్సత్తువగా కిందకు జారిపోయి మొకాళ్ళపై తల పెట్టుకుని కూర్చుండిపోయింది అనూహ్య.
కాసేపయ్యాక ఏదో చిన్న చప్పుడవుతే తల ఎత్తి చూసింది.
అతి ప్రయాసమీద లేచి కూర్చోవడానికి ప్రయత్నిస్తున్నాడు చాంగ్. అతనిదృష్టి అనూహ్య మీదే కేంద్రీకరించి వుంది. విషం కక్కుతున్నాయి అతని చూపులు.
భయంతో బిగుసుపోయింది. అతను అసలు కదిలే స్థితిలో వున్నాడని ఆమె ఊహించలేదు. కొద్ది క్షణాలు గడిచిన తర్వాత ఆమెకి కర్తవ్యమ్ గుర్తు వచ్చింది. చటుక్కున లేచి నిలబడి పరిగెత్త బోయింది.
హఠాత్తుగా ఆమె కాలు చేజిక్కించుకున్నాడు చాంగ్.
విసురుగా ముందుకు పడిపోయింది అనూహ్య. నుదుటికి బాగా గాయమైన సంగతి కూడా ఆమె ఆ భయంలో పడిపోయింది అనూహ్య. సుదుటికి బాగా గాయమైన సంగతి కూడా ఆమె ఆభయంలో గమనించలేదు. కాలు వదిలించుకుని లేచి మళ్ళీ పరుగందుకుంది. తను ఎటు వెళ్తోందీ చూసుకోకుండా!
ఈ సారి గుహ లోపలి భాగంలోకి.
భయం ఆమె తన వివేకాన్ని కోల్పోయేలా చేస్తోంది.
పెద్దగా బుస కొడుతున్నట్లు రొప్పుతూ, కాలు ఈడ్చుకుంటూ గోడని ఆధారంగా చేసుకుని ఆ వైపే వస్తున్నాడు చాంగ్.
మరీ కాస్త లోపలికి వెళ్ళిపోయింది అనూహ్య.
ఆ గుహ రెండో గుహలోకి దారి తీసింది.
ఆ రెండోగుహలో నుంచీ మరి రెండు గుహలకి దారి వుంది.
అలా ప్రతి గుహ రెండు, మూడు గుహల్లోకి తెరుచుకుంటూ, వుండి పద్మవ్యూహంలా ఉన్నాయి. ఆ గుహలు.
వాటిలో చిక్కుకుని, తప్పిపోయిన వాళ్ళు ఇక తిరిగి రావడం అసంభవమే.
దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం తోడేళ్ళలా ప్రవర్తిస్తున్న ఆ అబ్బాయిలూ, అమ్మాయిల తల్లిదండ్రులు కూడా, తలదాచుకోవడానికి ఆ గుహల్లోకి వెళ్ళి తప్పిపోయి ప్రాణాలు కోల్పోయారు.
ఆ గుహల్లోకి ప్రవేసించిన వాళ్ళు దారి తప్పి మిన్నూ కానని చీకట్లో, దిక్కుతోచక, ఊపిరాడక, ఆకలి దప్పులకి తట్టుకోలేక చనిపోవడం అది మొదటిసారి కాదు.
మూడొందల యాభై శతాబ్దాల క్రితం అంటే ముప్పయ్ అయిదు వేల సంవత్సరాల క్రిందట, వచ్చి మాంసం పీక్కు తినే ఆదిమానవులు చాలామంది ఆ గుహల్లో చిక్కుకుపోయి చావటంతోనే మొదలయింది అక్కడ చావుల కథ.
దానిలో దారి తప్పింది అనూహ్య.
"సాగర్ " అనికేక పెట్టింది, విహ్వలంగా.
గుహలన్నీ లక్ష గొంతుకలతో ఎకసెక్కెంగా ప్రతి ధ్వనించాయి ఆమె కేకని.
* * *
తోడేళ్ళ తన మీద పడబోతుండగా స్వరూప చేసిన ఆక్రందన విన్నాడు సాగర్. గబగబ మిగతా బండలు ఎక్కేసి పైకి చేరుకున్నాడు.
అక్కడ చదునుగా వుంది నేల. ముందుకు పరిగెత్తాడు.
తోడేళ్ళ కోరలకి స్వరూప చర్మం అందలేదు. ఆమె బట్టలు అందాయి. వాటిని చింపేశాయి, అవి.
ఇంకో తోడేలు తన వాడి కోరలను ఆమె నడుములో దిగవెయ్య బోయింది.
వెంటనే చాకు తీశాడు సాగర్. వాటిమీదకు దూకాడు.
అనుకోని ఈసంఘటనకి కొంచెం ఆశ్చర్యపడ్డట్లు కనబడ్డాయి తోడేళ్ళు. తర్వాత తేరుకుని భీకరంగా అరుస్తూ అతని మీదకు దాడిచేశాయి.
చాకుని తయారుగా పట్టుకున్నాడు సాగర్. అది ఒక తోడేలు దవడని లోతుగా చీరింది. రక్తం బొటబొట కారింది.
వెంటనే వెనక్కి తగ్గింది తోడేలు. తమని చూసి భయపడని ప్రాణులంటే చాలా జంతువులకి భయం ఉంటుంది. ఆ సైకాలజి తెలుసు సాగర్ కి.
పైగా, అతను తమని అతి సులువుగా, అతి త్వరితముగా గాయ పర్చగలడని వాటికి అర్ధమయింది.
అందుకని వెనుదిరిగి పారిపోయాయి అవి. ఆ అమ్మాయీ, అబ్బయీ కూడా కాలి వేళ్ళమీద బరువు ఆనుస్తూ అతి వేగంగా పరిగెత్తి వెళ్ళిపోయారు.
"థాంక్స్!" అంది సవరూప అస్పష్టంగా. సాగర్ జవాబు చెప్పబోయేంతలోనే అతని దృష్టిని ఒక విచిత్రం ఆకర్షించింది. కళ్ళార్పడం మర్చిపోయి అలాగే చూస్తూ వుండిపోయాడు.
అది కింద నుంచి కనబడి వుండేది కాదు. కింద నుంచీ చూస్తే గుంట అనుకుంటారు దాన్ని. అతను అంత ఎత్తుమీద వున్నాడు కాబట్టి దాని పూర్తి ఆకారం యాదృచ్చికంగా కనబడింది కొన్ని వందల ఎకరాల కనబడుతోంది ఏనుగు ఆకారంలో తవ్వి వుంది. తెల్లటి ఏనుగులా, ఐరావంతలా కనబడుతోంది అది.
ఐరావతం కుమభస్థలం మీద పెన్నిధి.
అంటే............
చెట్ల రెమ్మలు గల గల్లాడాయి వెనుతిరిగి చూశాడు సాగర్.
ఇంతలో చెట్ల గుబురు వెనక నుంచి ఒక మనిషి వచ్చాడు.
తేరిపార చూసి " హలో మిస్టర్ సింగ్!" అన్నాడు సాగర్ సంతోషంగా.
బలహీనంగా తల ఊపాడు సింగ్ "నువ్వుకూడా దాన్ని చూశావా సాగర్?"
"తెల్ల ఏనుగునా? ఇప్పుడే చూశాను."
"ఏనుగు కాదు. ఆ భయంకరమైన ఆకారాన్ని! గాడ్. అది మనిషా? దెయ్యమా?"
"దేని సంగతి మీరు చెప్పేది?" అన్నాడు సాగర్ అనుమానంగా.
"జడలు కట్టిన జుట్టు, మొలచుట్టూ గొర్రె చర్మం.
మొద్దు చూపు__అదిగో సాగర్! మళ్ళీ వచ్చింది అక్కడ" అన్నాడు సింగ్, భయంగా వెనక్కి వెనక్కి నడుస్తూ.
మళ్ళీ ఆకుల గలగల, తర్వాత నిశ్శబ్దం.
అక్కడిదాకా వెళ్ళి చూసి వచ్చాడు సాగర్. అతనికేమీ కనబడలేదు.
ఇంతలో దబ్బుమని శబ్దం అయింది. వెనక్కి అడుగులు వేస్తున్న సింగ్ చూసుకోకుండా తోడేళ్ళ బోరియాలో పడ్డాడు.
అతని చేతులు విశ్వప్రయత్నంమీద బొరియ అంచుని పట్టుకున్నాయి.
కానీ అక్కడంతా మెత్తటి మట్టి. పెళ్ళలుగా విరిగిబడింది బొరియ అంచు.
పట్టుదప్పి మరి కొంత లోపలికి జారాడు సింగ్. ఇంకేదో ఆధారం దొరికింది.
కానీ కొద్ది క్షణాల తర్వాత అదీ విరిగింది.
అంచెలంచెలుగా లోపలికి దిగబడిపోతున్నాడు సింగ్.
తక్షణం తనుకూడా అతని వెంటే లోపలికి దిగాడు సాగర్. చేతిని ఆసరాగా అందించబోయాడు.
కానీ అతనికీ పట్టు తప్పింది. అతనూ జారడం మొదలెట్టాడు.
పాతాళానికి సరాసరి మార్గంలా వుంది ఆ బిలం.
సన్నటి దుమ్ము లేచి వాళ్ళ కళ్ళల్లోకి, ముక్కుల్లోకీ పోతోంది.
ఊపిరాడడం లేదు. ఇద్దరూ జారిపోతున్నారు.
15
సింగూ, సాగర్ ఇద్దరూ అతివేగంగా ఆ తోడేళ్ళ బోరియాలో నుంచి జారి పడిపోతూ ఉంటే, సన్నటి తెల్లటి దుమ్ము మేఘంలా లేచి వాళ్ళ కల్లలోకీ, ముక్కులోకీ, చెవుల్లోకీపోయి ఉక్కిరి బిక్కిరి చేసేస్తోంది.
కిందగా ఉన్న సింగ్ కి ఆ దుమ్ములో నుండి రాక్షసమాయలా అస్పష్టంగా కనబడ్డాయి రెండు అస్థిపంజరాలు.
గుహలో నిలబడి, చేతులు బార్లాజాపి ఆహ్వనిస్తున్నట్లు ఉన్నాయి అవి. పెదిమలూ, చెంపలూ కృశించి, నశించి పోగా బయటపడ్డ పళ్ళు వికృతంగా నవ్వుతున్నట్లు ఉన్నాయి. కళ్ళు కరిగిపోగా, మిగిలి ఉన్న రంధ్రాలతో భయానకంగా చూస్తున్నట్లు ఉన్నాయని.
వెర్రికేక పెట్టి వాటిమీదకు జారిపడ్డాడు సింగ్.
ఆ వెనుకే సాగర్ కూడా జారుతూ వచ్చాడు.
ఆపకుండా, విహ్వలంగా అరుస్తూనే ఉన్నాడు సింగ్.
సాగర్ లేచి నిలబడి, వంటికి అంటుకుని ఉన్న దుమ్ము దులుపుకుని, కళ్ళు నులుముకుంటూ తేరిపార చూశాడు.
నిజంగానే రెండు అస్దిపంజరాలు ఉన్నాయి అక్కడ. చావుకేక పూర్తికాకుండానే చనిపోయినట్లు వాటి నోళ్ళు తెరుచుకుని ఉన్నాయి చేతులు ముందుకి జాపి, అందకుండా ఉన్న దేన్నో అందుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నట్లు ఉంది ఆ భంగిమ.
ఒక ఆస్థిపంజరం చేతికి తుప్పుపట్టి. అద్దం ఊడిపోయిన రిస్టువాచీ ఉంది. కొంచెం చిన్నదిగా ఉన్న రెండో ఆస్థిపంజరానికి మెడలో బంగారు లాకెట్టు వెళ్ళాడుతుంది. రంగూ, రూపూ తెలియకుండా జీర్ణమై పోయిన వస్త్రాల తాలూకు చిన్న చిన్న పేలికలు కొన్ని, ఎముకల మధ్య చిక్కుకుని ఉన్నాయి అక్కడక్కడ.
మెల్లి మెల్లిగా సాగర్ కళ్ళు చీకటికి అలవాటు పడ్డాయి. అప్పుడతనికి కొంచెం దూరంలో ఉన్నావి కూడా స్పష్టంగా కనబడ్డం మొదలెట్టాయి.
విశాలంగా ఉంది ఆ గుహ.
తడుముకుంటూ ముందుకు నడిచాడు.
గోడమీద ఏదో ఎర్రగా మెరుస్తూ కనబడింది.
చేతిముద్ర! రక్తంలో చెయ్యిముంచి గోడమీద అద్దినట్లు అర చెయ్యీ, అయిదు వేళ్ళూ కనబడుతున్నాయి!
అయితే,
కుష్ఠురోగి చేతుల్లాగా. వేళ్ళు సగం సగమే ఉన్నాయి దానికి.
మరింత దగ్గరగా వెళ్ళి పరీక్షించాడు.
గోడలమీద అసంఖ్యాకంగా ఉన్నాయి చేతిముద్రలు. ఎర్రగా, భయానకంగా కనబడుతున్నాయి అవి. ప్రతి చేతి చుట్టూ బోర్డరులాగా నల్లటి గీత గీసి ఉంది.
కొన్ని కుడిచేతి గుర్తులు. కానీ ఎక్కువగా ఎడమచేతి ముద్రలు ఉన్నాయి.
అన్నిటిలోనూ కనబడుతున్నది ఓకే లక్షణం!
ఏ చేతికీ వేళ్ళు పూర్తిగా లేవు.
వళ్ళు జలదరించింది సాగర్ కి. ఆ వెనువెంటనే, అనాది మానవుల గురించి తను చదివిన విశేషాలు గుర్తొచ్చాయి.
ఈ గుహలు ఒకప్పుడు ఆదిమానవులకి ఆవాసాలయి ఉండాలి.
అంటే అప్పుడప్పుడే మృగావస్థలో నుంచి బయటపడుతున్న నారావానరం లాంటి మనుషుల(Neonderthal Mau) నివాస స్థానాన్ని చూస్తున్నాడా తను! ఆ మనుషులకి కోతి రూపు ఇంకా పూర్తిగా వదలలేదు.
ముందుకు జారిపోతున్నట్లు కనిపించే నుదురు. ఎత్తుగా ఉండే కనుబొమ్మాలు, చదునుగా పరుచుకుని ఉండే ముక్కు, ముందుకు తోసుకు వచ్చిన దవడలూ, పొట్టిగా దృఢంగా ఉండే ఆకారం-దాదాపు కోతుల్లాగే ఉంటారు ఆ ఆదిమానవులు.