"మీరేం చెప్తున్నారో నాకర్ధం కావడంలేదు....."
"మొదట్నించి మీ డాడి ఆశలు ని మీదేఉన్నాయి. మీ డాడి ఎంత కష్టపడి ప్తెకోచ్చారో నీకు తెలిదు....మీ డాడి, హరికృష్ణమనాయుడు, ఓవర్ నైట్....బిజినెస్ మాన్ గా , ఇండస్టయిలిస్ట్ గా తయారుకాలేదు. అపారమైన కృషి, అపారమైన ప్రతిభ దాని వెనకున్నాయి.....ఆయనకు ,మీ అన్నయ్య మీద కంటే ,ని మీదే ఆశలున్నాయి. నాయుడు గ్రూపాఫ్ కంపెనీస్ కి నిన్ను చ్తేర్మన్ గా చేయాలనీ ఆయనకోరిక .....ఆ విషయం నాతో చాలాసార్లు చర్చించారాయన. ఆయన ఆశలకు, ఆశయాలకు ప్రతినిధిగా నిలవాల్సిన న్తేతిక బాధ్యత నీకులేదా...చెప్పు. అలాగే మీ డాడిని నిర్దిక్షినంగా మర్డర్ చేసిన హంతకుల మీద పగతిర్చుకోవాల్సిన అవసరం నీకు లేదా"
"ఉంది...."చటుక్కున వచ్చింది ముక్త నోటి వెంట.
సూర్యసాగర్ కళ్ళల్లో ఓ కాంతి వెలుగు.....
"ఉంటే....ఆస్తిలేకపోతే పగతీర్చుకోలేనా? మా నాన్నాగార్ని చంపిన వారిమీద పగతిర్చుకోటానికి ఆస్తిలో వాటాకావాలా?"
"కావాలమ్మ.....ఎందుకంటే జీవితం సినిమాకాదు. ఒట్టిచేతులతో కొండల్ని పిండి చేయటానికి__అధికారం అర్ధ బలం, అంగ బలంఉన్న ప్పుడు నీ పగతిర్చుకోవటం తేలికవుతుంది. అయినా అందుకోసమే అని నేను అనటంలేదుగా? మీ నాన్నగారి పేరుని___ ఆయన ప్రారంభించిన వ్యాపారాల్ని నిలబెట్టటానికి .....మనసులో కోర్కె పగఉన్న మౌనం గా ఉంటున్నావన్నమాట....రాక్షసుడులాంటి, అన్నమీద నువ్వు తిరగబడలేక పోతునావ్ అవునా...అంటే శక్తిలేక కాదుగా ? అసహ్యమేసి, బాదేసి, అవునా?"
అవున్నట్టు తలూపింది ముక్తానంద
"చూడమ్మా.....ముక్త పాండవులు, కౌరవులమధ్య జరిగినయుద్ధం కుటుంబ యుద్దమే. కానీ చరిత్ర దాన్ని ధర్మ యుద్ధమని అంటోంది కంటోంది. ధర్మస్ధాపనకోసం జరిగింది కాబట్టి పాండవుల్ని మనం, మూర్తులుగా ఎందుకు భావిస్తున్నాం. న్యాయం ,ధర్మం పక్షాన నిలిచారు కాబట్టి. ప్రోపెషనల్ ర్తేవల్రిస్, ఇవ్వన్ని ధర్మ యుద్ధాలే. ఒక బిజినెస్ మాన్ కో , ఇంకొక బిజినెస్ మాన్ కి, ఒక ఇండస్ట్రీ యలిస్ట్ కి ఇంకొక ఇండస్ట్రీయలిస్ట్ కి మధ్య జరిగే వ్యాపారయుద్ధంలో గెలుపుకి గుర్తుమిటో తెలుసా సక్సస్ .....సక్సస కి గుర్తు కీర్తి....
పోటిలో గెలిచిన నేటివిరుడు.....అందుకే ఇండస్ట్రీయలిస్ట్ ఎప్పడూ అప్రమత్తగా ఉంటాడు. మెదడుని పదున్తేనా చాకులా ఉపయోగిస్తాడు. నువ్వు ఎలా చేశావన్నదికాదు ముఖ్యం. ఏం చేసావన్నది ముఖ్యం. ఎన్ని అడ్డదార్లు తొక్కినా విజేతగా నువ్వు నిలబడితే ని పాదాక్రాంత మౌతుంది ప్రపంచంనువ్వలా చేయఖ్ఖర్లేదు ధర్మయుద్దమే చేసిగేలవచ్చు" చెప్పడంఆపి, ముక్త ముఖంలోకి సూటిగా చూసాడు సూర్యసాగర్.
"ఇంతకి నన్నేం చెయ్యమంటారు....."
"ని తండ్రి కి సిసల్తేన ప్రతినిధిగా నిలబడు....ని తండ్రి బిజినేస్సుల్ని చేతుల్లోకి తీసుకో....ని తండ్రి మరణానికి కారకుల్తేన వారిని పట్టుకుని శిక్షించు .....నేను చెయ్యగలనా అని నువ్వు ఆలోచించకు....ప్రపంచం ఎప్పడూ స్త్రి శక్తిని తక్కువగానే అంచనా వేస్తుంది. అధర్మాన్ని నిరసించే ఒక వ్యక్తిగత పోరాటమే, ఎప్పడూ సామాజిక పోరాటమావుంతుంది. మానసికంగా నిన్ను నివు సన్నద్దం చేసుకో.....ని వెనక నేనుంటాను....చివరి రక్తపు బొట్టు వరకూ, ని కోసం, మీ నాన్నగారి ప్రతిష్టను నిలపడం కోసం నేనున్నానని గుర్తుంచుకో...." ఆవేశంగా చెప్పాడు సూర్యసాగర్.
అయిదు నిమిషాలసేపు ముక్త ఏం మాట్లాడలేదు.
దీర్ఘంగా ఆలోచిస్తోంది.....
హొం మంత్రిగా పదవి స్వకారం చెయ్యడానికి ముందు, హరికృష్ణమనాయుడు కూతురును చూడాలని, కూతురుతో మాట్లాడాలని తహ తహ చెందిన విషయం ముక్తకు తెలిదు.
తేలిస్తే___
ముక్త ఇంతసేపు ఆలోచనలో పడేదికాదు.
ముక్తకు ఒక్కసారి___
హల్లో చివరిసారి తండ్రి శవం, జ్ఞాపకానికొచ్చింది. అకస్మాత్తుగా ఆమె కళ్ళంట నిల్లోచ్చాయి. అన్న చేసిన అవమానం గుర్తు కొచ్చి, మనసు విలవిల్లడింది.
ఒక్కొక్కప్పుడు చిన్న సంఘటన, చారిత్రాత్మకమ్తెన ఒక మలుపుకి నాంది కావచ్చు.
ఒక్కొక్కప్పుడు,ఒక్క చిన్న అల, పెను జలపాతానికి దారి తేయోచ్చు.
ఒక అవమానం, ఒక ఉజ్వలమ్తెన విజయానికి గుర్తుకావచ్చు.
ముక్తానంద సూటిగా సూర్యసాగర్ వేపు చూసింది.
"చెప్పండంకుల్.....మీరేం చెయ్యమంటే అది చేస్తాను...." అంది స్ధిరంగా ఆ మాటకు సంతోషంతో పొంగి పోయాడు సూర్యసాగర్.
"నువ్వు మాత్రమే మీ తండ్రి, హరికృష్ణమనాయుడు ప్రాసర్టికి అధినేతవి కావాలి.... నాయుడు గ్రూఫ్ కి చ్తేర్మన్ కావాలి.. కావాలంటే .....ముఖ్యంగా మనకు కావాల్సింది.....మీ తండ్రి గారి వీలునామా."
"డాడి వీలునామ రాసుంటారా.....?"
"వీలునామా విషయం నాతో ఒకసారి డిస్ కస్ చేసారు___ అంటే రాసే ఉంటారు,"
"వీలునామా రాసుంటే....మీకు తెలియకుండా జరుగుతుందా...."
"జరగడానికి ఆస్కారముంది...డిల్లిలో మీ కంపెని వ్యవహారాల్ని చూసే శ్రీ పతిరావు అనే సుప్రిమ్ కోర్ట్ అడ్వకేట్ ఒకాయన ఉన్నారు. ఆయనతో మాట్లాడితే ....అసలు విషయం తెలియోచ్చు" చెప్పారు సూర్యసాగర్.
"ఆయన ఫోన్ నెంబరుందా.....మీ దగ్గర...."
"లేదు...." ఏదో ఆలోచిస్తూ అన్నాడాయన మళ్ళి ఏదో జ్ఞాపకం తెచ్చుకుని....